‘ఇమ్రాన్‌ పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..!’ | Imran Khans second wife sensational comments on his third marriage | Sakshi
Sakshi News home page

‘ఇమ్రాన్‌ పచ్చి మోసగాడు, నా ముందే ఆమెతో..!’

Published Tue, Feb 20 2018 8:57 PM | Last Updated on Tue, Feb 20 2018 9:22 PM

Imran Khans second wife sensational comments on his third marriage - Sakshi

లాహోర్‌ : మాజీ క్రికెటర్‌, పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో పెళ్లిపై రెండో భార్య రేహమ్‌ ఖాన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇమ్రాన్‌ పచ్చి మోసగాడని, వివాహేతర సంబంధాల్లో ఆరితేరాడని ఆరోపించారు. ‘టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేహమ్‌ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

మూడో పెళ్లి ప్రకటన ఓ నాటకం : ‘‘నేను భార్యగా ఉన్నప్పుడే అతనికి బుష్రాతో వివాహేతర సంబంధం ఉంది. నా ముందే ఆమెతో చనువుగా ఉండేవాడు. అందుకే 10 నెలలు తిరక్కుండానే అతనికి విడాకులు ఇచ్చేశా. మొన్న ఆదివారం ఇమ్రాన్‌ మూడో పెళ్లి చేసుకున్నట్లు పీటీఐ పార్టీ ప్రకటించింది. కానీ నిజమేంటంటే.. ఆ తంతు నెలన్నర కిందటే జరిగింది. విచిత్రమేంటో తెలుసా? నా పెళ్లప్పుడు కూడా ఇలానే జరిగింది. మేం పెళ్లి చేసుకున్న రెండు నెలల తర్వాత ఆ ఫొటోలు, ప్రకటనను మీడియాకు ఇచ్చారు. ఇమ్రాన్‌ లాంటి నీతిమాలిన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు’’ అని రేహమ్‌ వ్యాఖ్యానించారు.

కౌంటర్‌ ఇవ్వబోయి అడ్డంగా బుక్కయ్యారు : రేహమ్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలపై స్పందించిన ఇమ్రాన్ అభిమానులు‌.. కౌంటర్‌ ఇచ్చేందుకు విఫలయత్నం చేశారు. ‘రేహమ్‌ వ్యాఖ్యలు వాస్తవాలేనని నమ్ముతున్నారా?’ అని ట్విటర్‌లో పోల్‌ క్వశ్చన్‌ పెట్టారు. ప్రతిగా రేహమ్‌ సైతం తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు. గడిచిన మూడేళ్లుగా ఇమ్రాన్‌- బుష్రాలు కలిసే ఉంటున్నట్లు స్వయంగా బుష్రా మాజీ భర్తే చెప్పినట్లు పేర్కొన్నన్నారు. ‘ఇమ్రాన్‌-బుష్రాలు జనవరిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ మొన్ననే పెళ్లైనట్లు పార్టీ ప్రకటించడం దారుణం’  అని నెటిజన్లు సైతం వ్యాఖ్యానించారు. దీంతో ఖంగుతిన్న ఇమ్రాన్‌ వర్గీయులు ‘వంద మంది కుట్రదారులు వచ్చినా మా గెలుపును ఆపలేరు’అంటూ కవరింగ్‌ ఇచ్చారు.

1992లో పాక్‌ జట్టుకు క్రికెట్‌ ప్రపంచ కప్‌ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్‌.. తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్‌.. జర్నలిస్టే అయిన రేహమ్‌ను(2015లో) రెండోపెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు తాజాగా మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకురు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement