బెంగళూరు: 'తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చిన వ్యక్తులు నా భర్త తలకు గన్ పెట్టి బెదిరించారు. వారు మేం ఢిల్లీ పోలీసులం అని చెప్పారు కానీ ఎలాంటి ప్రూఫ్ చూపించనే లేదు. నన్నూ తుపాకితో బెదిరించి ఆయుధాలు ఎక్కడున్నాయ్ అని అడిగారు. ఎలాంటి అరెస్ట్ వారెంట్, సెర్చ్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి వచ్చి నా భర్తను తీసుకెళ్లారు. నా భర్త చాలా చాలా అమాయకుడు' అని ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టైన బెంగళూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.. అఫ్జల్ భార్య బష్రా మీడియాతో వాపోయింది.
దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న పలువురిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బెంగళూరులో అఫ్జల్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారని కర్నాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
'నా భర్త చాలా అమాయకుడు'
Published Sat, Jan 23 2016 12:13 PM | Last Updated on Thu, Mar 28 2019 6:19 PM
Advertisement