వరుణ్ గ్రోవర్, సమీర్ అంజాన్, అమితాబ్ భట్టాచార్య
‘‘పాటకు పదాలు ముఖ్యం. ఆ పదాలు రాసేవాడికి క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకంత అశ్రద్ధ? మేం రాసిన పాటకు మా పేరు వేయండి. క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్’’ అంటూ ఓ పాటను విడుదల చేశారు బాలీవుడ్‌కు చెందిన పలువురు పాటల రచయితలు. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15 మంది పాటల రచయితలు ‘క్రెడిట్స్ దేదో యార్’ అనే పాటను రిలీజ్ చేశారు.
రచయితలు వరుణ్ గ్రోవర్, కౌశర్ మునిర్, సమీర్ అంజాన్, స్వానంద్ కిరికిరే, అమితాబ్ భట్టాచార్య, నీలేష్ మిశ్రా, మనోజ్ ముంతాషిర్, మయూర్ పూరి, షిల్లే, పునీత్ శర్మ, అభిరుచి చంద్, హుసేన్ హేడ్రీ, రాజ్ శేఖర్, అన్విత దత్, కుమార్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర నిమిషాలున్న ఈ ‘క్రెడిట్ దేదో యార్’ పాటను ఈ 15మంది ఆలపించారు. ఈ ఉద్యమంలో శ్రోతలు కూడా భాగమవ్వాలన్నారు. గీత రచయిత పేరు (క్రెడిట్) లేకుండా ఏ మ్యూజిక్ కంపెనీ అయినా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో అయినా పాట కనిపిస్తే ప్రశ్నించండి అని వీళ్లంతా ట్వీటర్ ద్వారా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment