Song Writer
-
యువ సంగీత కెరటం లియాం పెనీ హఠాన్మరణం
బ్యూనస్ ఎయిర్(అర్జెంటీనా): బ్రిటన్ సంగీత సంచలనం, పాప్ గాయకుడు, గేయ రచయిత 31 ఏళ్ల లియాం పెనీ కన్నుమూశారు. బుధవారం సాయంత్రం అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్ సిటీలోని ఒక విలాసవంత హోటల్ మూడో అంతస్థు బాల్కనీ నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మద్యం, మత్తుపదార్థాలు అతిగా తీసుకోవడం వల్ల హోటల్ గది అంతా చిందరవందర చేసి కిందపడి చనిపోయారని వార్తలొచ్చాయి. పోస్ట్‌మార్టమ్ నివేదిక తర్వాతే మరణానికి కారణాలు తెలిసే వీలుంది. ఆయన బస చేసిన కాసాసర్ హోటల్ గదిలో మద్యంతోపాటు బెంజోడైజీపైన్ అనే ఔషధంను కనుగొన్నారు. బెంజోడైజీపైన్ను ఉద్రేకాన్ని తగ్గించేందుకు, మూర్ఛ, నరాల సంబంధ చికిత్సల్లో వాడతారు. పెనీ తన గది బాల్కనీ నుంచి దూకి ఉంటారని నగర భద్రతా మంత్రి కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాబ్లో పోలీసీచియో మీడియాతో చెప్పారు. 14 ఏళ్లకే సంచలనం 2010లో బ్రిటన్ ప్రఖ్యాత టాలెంట్ రియాలిటీ షో ‘ది ఎక్స్ ఫ్యాక్టర్’లో 14 ఏళ్ల వయసులోనే అడుగుపెట్టి అద్భుతంగా పాటి అందరి మనసుల్ని గెల్చుకున్నాడు. మరో నలుగురితో కలిసి ‘వన్ డైరెక్షన్’పేరిట బాయ్బ్యాండ్ను నెలకొల్పాడు. ఈ బ్యాండ్ నుంచి వెలువడిన పాటలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. 7 కోట్ల ‘రికార్డ్’లు అమ్ముడుపోయాయి. 2016లో బ్యాండ్ నుంచి విడిపోయాక సోలోగా కెరీర్‌ను మొదలుపెట్టి సంచలనాలు సృష్టించారు. ఈయన చేసిన సంగీత విభావరిలు సైతం పెద్ద హిట్ అయ్యా యి. సొంత ఆల్బమ్స్ లక్షల్లో అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో వీటిని దాదాపు 390 కోట్ల సార్లు చూశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మద్యపానంతో ఇబ్బంది పడుతున్నట్లు గతంలో పలుమార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. రెండు సార్లు ఆస్పత్రిలో చేరారు. గత ఏడాది మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చికిత్సపొందారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఒక ‘టియర్‌డ్రాప్స్’ పాట అందర్నీ నిరాశపరిచింది. -
అమెరికాలో ఉద్యోగం వదిలేసి సింగర్‌గా రాణిస్తున్న లిసా
‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో బాలీవుడ్ సింగర్‌గా అరంగేట్రం చేసింది లీసా మిశ్రా. యూనిక్ వాయిస్‌తో ప్రేక్షకులను మెప్పించింది. తనకు ఇష్టమైన పాటలు పాడి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసే మిశ్రా చికాగోలో డాటా–ఎనలిస్ట్‌గా ఉద్యోగం చేసింది. సంగీతాన్నే కెరీర్ చేసుకోవడానికి అమెరికా నుంచి ముంబై వచ్చింది. రెండు సంవత్సరాల క్రితం ప్రఖ్యాత సింగర్ లేడీ గాగాతో కలిసి మ్యూజిక్ ప్రోగ్రామ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మిశ్రాకు ఎనిమిది లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. తన యూట్యూబ్ చానల్‌కు మూడు లక్షలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ‘మ్యూజిషియన్‌గా పేరు తెచ్చుకోవడానికి నాకు యూట్యూబ్ ఎంతో ఉపయోగపడింది. నా సంగీతం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి పరిచయం కావడానికి సోషల్ మీడియా ఉపయోగపడింది. View this post on Instagram A post shared by Kabeer Kathpalia (@oaffmusic) కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పులా, ఒత్తిడిని జయించే శక్తిలా నా సంగీతం ఉండాలనుకుంటాను. చాలామందికి మన విజయం తప్ప ఆ విజయం కోసం గతంలో పడిన కష్టం గురించి తెలియదు. దీంతో వోవర్ నైట్ సక్సెస్ అంటుంటారు’ అంటుంది సింగర్–సాంగ్ రైటర్ లీసా మిశ్రా. View this post on Instagram A post shared by Lisa Mishra (@lisamishramusic) -
ఎన్నోసార్లు ఫెయిల్..కానీ ఇప్పుడు సింగర్‌గా, నటిగా రాణిస్తోంది
కోల్‌కతాకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ అమిక శైల్. తొమ్మిది సంవత్సరాల వయసులో ‘లిటిల్ చాంప్స్’ రియాలిటీ షోలో పాల్గొంది. ఫోక్, జాజ్, క్లాసిక్‌లో ‘వావ్’ అనిపించుకుంది. డిగ్రీ పూర్తయిన తరువాత తన కలను సాకారం చేసుకోవడానికి ముంబైకి వచ్చింది. ‘స్ట్రగుల్’ అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. సినిమాల్లో పాడడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో అమికకు మంచి పట్టు ఉంది. అవకాశాలు వచ్చే వరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకని మ్యూజిక్ టీచర్‌గా జాబ్‌లో చేరింది. ఎట్టకేలకు ‘వెడ్డింగ్ యానివర్సరీ’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఎన్నో టీవీ సీరియల్స్‌కు టైటిల్ సాంగ్స్ పాడింది. ఎన్నో రియాల్టీ షోలలో పాల్గొంది. ‘సంగీతం అనేది నాకు అభిరుచి కాదు శ్వాసలాంటిది. View this post on Instagram A post shared by Amika Shail (@amikashail) సంగీత సాధనకు ఎన్ని గంటలైనా సరిపోవు. యాంత్రికంగా, మొక్కుబడిగా కాకుండా ప్రశాంత చిత్తంతో సంగీత సాధన చేయాలి’ అంటున్న అమిక నటిగా కూడా రాణిస్తోంది. ‘పవర్ఫుల్ డైలాగులో చెప్పడంలో. సరిౖయెన భావోద్వేగాలు ప్రదర్శించడంలో నాలోని సింగర్ గురువులా మార్గదర్శనం చేస్తోంది’ అంటుంది అమిక శైల్. View this post on Instagram A post shared by Amika Shail (@amikashail) -
అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు
‘‘ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నా బర్త్‌డే సందర్భంగా నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు మంచిర్యాల జిల్లాలో 2022 మొక్కలు నాటుతున్నందుకు హ్యాపీ’’ అని పాటల రచయిత తైదల బాపు అన్నారు. నేడు తన బర్త్ డే సందర్భంగా తైదల బాపు మాట్లాడుతూ– ‘‘విద్యార్థి దశ నుంచే పాటలు రాసేవాణ్ణి. 1998లో హైదరాబాద్‌కు వచ్చి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారికి నా పాటలు వినిపిస్తే, బాగున్నాయన్నారు. (చదవండి: దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?) దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారి ‘6 టీన్స్’ చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’, ‘అధినేత’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా దాదాపు 236 సినిమాల్లో 500లకి పైగా పాటలు రాశాను. 2019లో ‘జాతీయ కళారత్న’ అవార్డును అందుకున్నాను. రచయితల సంఘం రజతోత్సవంలో చిరంజీవి, రాఘవేంద్రరావుగార్ల చేతులమీదుగా విశిష్ట రచనా పురస్కారం అందుకున్నాను. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘మాణికే మాగే హితే’, ఎవరీ అమ్మాయి
ఈ మధ్య తెలుగులో బుల్లెట్ బండి పాట ఎంతగా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడా చూసిన, బయట ఎక్కడికి వెళ్లిన ఈ పాటే వినిపిస్తోంది. ఇక ఈ పాటకు డ్యాన్స్ చేసిన నవ వధువు ఏకంగా ‘బుల్లెట్ బండి వధువు’గా మారిపోయింది. ఇదిలా ఉంగగా బుల్లెట్ బండి పాట లాగే మరో పాట కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రీల్ చూసిన ఈ పాటే దర్శనం ఇస్తోంది. అంతలా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పాట ఎంటా? అనుకుంటున్నారా!. అదేనండి ‘మాణికే మాగే హితే’ అనే తమిళ పాట. దీనికి అర్థం తెలియకపోయిన మన తెలుగు వాళ్లు సైతం ఈ పాటకు, సింగర్‌కు ఫిదా అయిపోయారు. అంతలా ఈ లిరిక్స్, ట్యూన్‌తో సింగిత ప్రియులను కట్టిపడేసి ఈ పాట బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌ను సైతం ఆకట్టుకుంది. చదవండి: బిగ్‌బాస్ 5: అడ్డంగా బుక్కైన లోబో..ఆడేసుకుంటున్న నెటిజన్లు తాజాగా ఆయన సోషల్ మీడియా వేదిక ఈ పాట యూట్యూబ్‌ను లింక్‌ను షేర్ చేస్తూ ఈ పాటకు తనని ఎంతగా మంత్రముగ్ధున్ని చేసిందో వివరించారు. దీని లిరిక్స్ అర్థం కాకపోయిన తన మనసుకు ఈ పాట చెప్పలేని అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ పాట తెలుగు, హిందీ, కన్నడ, బెంగాళితో పాటు పలు భాషల్లో కూడా డబ్ అయ్యింది. అయినప్పటికి మలయాళంలోనే ఈ పాట ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. మన తెలుగు వారు సైతం దీనికి ఇన్‌స్టా రిల్స్ చేస్తున్నారు. దీంతో ఈ పాటను అంత మధురంగా ఆలపించినా ఈ సింగర్ ఎవరా అని, ఆమె పేరు ఎంటని నెటిజన్లు సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ట్రెండింగ్‌గా మారింది. మరి మీరు కూడా ఆ గాయనీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఓ లుక్కేయండి. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! ఇంతకి ఎవరీ ‘మాణికే మాగే హితే’ యొహాని డి సిల్వా: మాణికే మాగే హితే పాటను పాడింది శ్రీలంకలోని కొలొంబోకు చెందిన ఓ పాప్ సింగర్. ఆమె పేరు యొహాని డి సిల్వా. తను పాప్ సింగర్ మాత్రమే కాదు గేయ రచయిత, నిర్మాత, బిజినెస్ ఉమెన్ కూడా. తొలుత యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె ‘దేవియంగే బారే’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వేదికగా ఎన్నో పాప్ పాటలు విడుదల చేసి అందరి మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే ఆమెను ‘రాప్ ప్రిన్సెస్’ అనే బిరుదు కూడా వరించింది. తన పాటలతో స్టార్ గుర్తింపు తెచ్చుకున్న యొహాని 2021 మే నెలలో మాణికే మాగే హితే పాటను ఆలపించి యూట్యూబ్ ఛానల్లో వదిలింది. చదవండి: Akshay Kumar: అక్షయ్ కుమార్ తల్లికి తీవ్ర అస్వస్థత, ఐసీయూలో చికిత్స అంతే ఈ పాటతో ఆమె ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందలా తనకు గుర్తింపు తెచ్చిన ఈ పాట యూట్యూబ్‌లో 8 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించుకుంది. కాగా యొహాని తండ్రి మాజీ ఆర్మి అధికారి కాగా తల్లి ఎయిర్‌హోస్టెస్ అట. కూతురికి సంగీతంపై ఉన్న ఆసక్తిని గుర్తించి ఆమె తల్లి ప్రోత్సాహం అందించారని ఆమె ఆమె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా యొహాని డిసెల్వా గురించి తెలిసి చిన్న వయసులోనే బిబినెస్ ఉమెన్‌గా, గేయ రచయితగా, నిర్మాతగా ఎదగడం నిజంగా గొప్ప విషయం అంటూ నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. -
కందికొండకు క్యాన్సర్.. ‘మనందరం అండగా నిలబడదాం’
సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం. ప్రొఫెసర్ అవ్వాలనే కోరికతో డబుల్ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ. ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి. సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్డీ చేసి ఇటీవలే డాక్టరేట్ కూడ అందుకున్నారు. తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు. ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్‌తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది. దాతలు గూగుల్ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్ 135510100174728 (అకౌంట్ నంబర్). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును. - వరకుమార్ గుండెపంగు ప్రముఖ కథా రచయిత మొబైల్: 99485 41711 -
పదేళ్ల కల నెరవేరింది
ప్రముఖ పాటల రచయిత శ్రీమణి కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఏడడుగులు వేశారు. వారిది ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దల సమ్మతితోనే ఈ వేడుక జరిగింది. ఈ విషయాన్ని శ్రీమణి సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ‘‘నా జీవితంలోకి నా దేవత ఫరాకు స్వాగతం. పదేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూశాం.. మా కల నెరవేరింది. మా మనసును అర్థం చేసుకున్న దేవుడికి, మా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు శ్రీమణి. ఆయన ట్వీట్‌కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ, ‘శ్రీమణీ.. నీ రొమాంటిక్ లిరిక్స్ వెనక ఉన్న సీక్రెట్ ఇప్పుడు అర్థం అయ్యింది. ‘ఇష్క్ షిఫాయా’ అని పాడి, ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్‌గా లవ్ చేసి, ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట. హ్యాపీ మ్యూజికల్ మ్యారీడ్ లైఫ్’ అని పోస్ట్ చేశారు. -
క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్
‘‘పాటకు పదాలు ముఖ్యం. ఆ పదాలు రాసేవాడికి క్రెడిట్ ఇవ్వడానికి ఎందుకంత అశ్రద్ధ? మేం రాసిన పాటకు మా పేరు వేయండి. క్రెడిట్ ఇవ్వండి ప్లీజ్’’ అంటూ ఓ పాటను విడుదల చేశారు బాలీవుడ్‌కు చెందిన పలువురు పాటల రచయితలు. మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ రచయితలకు క్రెడిట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తూ 15 మంది పాటల రచయితలు ‘క్రెడిట్స్ దేదో యార్’ అనే పాటను రిలీజ్ చేశారు. రచయితలు వరుణ్ గ్రోవర్, కౌశర్ మునిర్, సమీర్ అంజాన్, స్వానంద్ కిరికిరే, అమితాబ్ భట్టాచార్య, నీలేష్ మిశ్రా, మనోజ్ ముంతాషిర్, మయూర్ పూరి, షిల్లే, పునీత్ శర్మ, అభిరుచి చంద్, హుసేన్ హేడ్రీ, రాజ్ శేఖర్, అన్విత దత్, కుమార్ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర నిమిషాలున్న ఈ ‘క్రెడిట్ దేదో యార్’ పాటను ఈ 15మంది ఆలపించారు. ఈ ఉద్యమంలో శ్రోతలు కూడా భాగమవ్వాలన్నారు. గీత రచయిత పేరు (క్రెడిట్) లేకుండా ఏ మ్యూజిక్ కంపెనీ అయినా, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయినా పాట కనిపిస్తే ప్రశ్నించండి అని వీళ్లంతా ట్వీటర్ ద్వారా కోరారు. -
పాటే నా ప్రాణం: చంద్రబోస్
సాక్షి, భద్రాచలం : పాటే తన ప్రాణమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. భద్రాద్రి కళాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ అంతరాష్ట్ర తెలుగు నాటకోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా మంగళవారం భద్రాచలం విచ్చేశారు. ఈ సందర్భంగా సాక్షి పలుకరించగా పలు విషయాలు తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘మాతృ భాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది. కీరవాణితో సినిమా అంటే ఎంతో మధురమైన పాటలు ఆశువుగా వచ్చేస్తాయి. పాటల రచయితకు అభిమానులుగా ఉంటూ.. గత నాలుగేళ్లుగా భద్రాచలానికి చెందిన తోటమళ్ల సురేష్, కృష్ణా రెడ్డి లాంటి వ్యక్తులు సేవ చేయడం మరిచిపోలేని విషయం. నేను భవిష్యత్తులోనూ వేరే రంగంలోకి వెళ్లబోను. సినిమానే నా ప్రపంచం. చివరి వరకు ఇందులోనే ఉంటా’. అని చంద్రబోస్ పేర్కొన్నారు. -
వద్దన్న పాట
పదమూడేళ్ల వయసులో రెబెక్కా బ్లాక్ పాడిన ‘ఫ్రైడే’ అనే పాటను ప్రపంచం తిరస్కరించింది! పాపం చిన్న పిల్ల కదా అని సరిపెట్టుకోకుండా ఛీ కొట్టింది. నీ ముఖం అంది. ‘ది వరస్ట్ సాంగ్ ఎవర్’ గా ఆ పాట లోక‘ప్రసిద్ధి’ చెందింది. రెబెక్కా ఆడి, పాడిన ఆ సింగిల్ సాంగ్ వీడియో పుట్టి తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్లుగా లోకం తిడుతున్న తిట్లను భరిస్తూనే జీవితాన్ని ప్రేమించడం నేర్చుకుంది రెబెక్కా. తిరస్కారాల నుంచే తనను తనను మలుచుకుంది. వద్దన్న పాట నుంచే భవిష్యత్తుకు కొత్త స్వరాలను సమకూర్చుకుంది. ప్రేమ దక్కని వాళ్లు చేయవలసిన పని ఇదే. జీవితానికి దగ్గరవడం. మాధవ్ శింగరాజు కొంచెం టైముందా! లేక.. ‘గాట్టా బి ఫ్రెష్. గాట్టా గో డౌన్‌స్టెయిర్స్.. ఇట్స్ ఫ్రైడే..’ మూడ్‌లో ఉన్నారా.. బెడ్రూమ్లోంచి దిగెళ్లి పళ్లు తోముకుని.. ఇంత తిని.. శుక్రవారపు సోమరి పరిమళాలను అందుకుని కిటికీలోంచి గాల్లో తేలిపోడానికి! ఇట్స్ వాలెంటైన్స్ డే కూడా కదా. ఎవరికీ అందకండి. ఇది మీ లైఫ్. శుక్ర–శని–ఆది.. మీదే లైఫ్. తర్వాతెలాగూ మీ లైఫ్ మీ బాస్‌ది. మీ లైఫ్ మీ ప్రిన్సిపాల్ది. మీ లైఫ్ మీ హెడ్మాస్టర్ది. ఒక్కమాట. వెళ్తూవెళ్తూనైనా యూట్యూబ్‌లో రెబెక్కా బ్లాక్ – ఫ్రైడే అని కొట్టి చూడండి. పదమూడేళ్ల అమ్మాయి తొమ్మిదేళ్ల క్రితం పాడిన వీడియో సాంగ్ అది. ఆమెను స్మరించుకుంటూ ప్రేమికుల రోజున ఈ పాటను చూడమని కాదు. ఆమె నిక్షేపంగా ఉన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో. రెబెక్కా బ్లాక్ తన పేరు. ‘ఫ్రైడే’ ఆ పాట పేరు. 3 నిముషాల 47 సెకన్లు ఉంటుంది. వాలెంటైన్స్ డే రోజు అంత టైమ్‌ని వృ«థా చెయ్యడం అన్యాయమే. బయట గులాబీ పూలకాడలు అయిపోయాయంటే.. వట్టి చేతుల్తో వెళ్లి ఐలవ్యూకి ముందు సారీ చెప్పాల్సి వస్తుంది. సారీ కూడా ప్రేమ సిలబస్‌లో ఒక చాప్టరే. అలాగని బుంగమూతిని తెరిపించే పూలగుత్తేమీ కాదు కదా ‘సారీ’. వీడియో చూడకున్నా పర్లేదు. పైపై డీటెయిల్స్ చూడండి. పది లక్షలా పది వేల లైక్‌లు కనిపిస్తాయి. పక్కనే చూడండి. ముప్ఫై లక్షల అరవై వేల డిస్‌లైక్‌లు ఉంటాయి! రేటింగ్ చూడండి. ‘నో మెచ్యూర్ కంటెంట్’ అని ఉంటుంది. ఇక పాట చూడ్డానికేముంటుంది! చూసినా ఏం ఉంటుంది? ∙∙ ‘7 ఎ.ఎం. వేకింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ గాట్టా బి ఫ్రెష్.. గాట్టా గో డౌన్ స్టెయిర్స్.. గాట్టా గెట్ డౌన్ టు ద బస్ స్టాప్.. గాట్టా క్యాచ్ మై బస్.. ఐ సీ మై ఫ్రెండ్స్..’ పాటంతా ఇదే తొందర. ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలన్న ఓ పదమూడేళ్ల అమ్మాయి తొందర.. రెబెక్కా బ్లాక్ ‘ఫ్రైడే’ సాంగ్ థీమ్. జీవితాన్ని ప్రేమిస్తే జీవితం మన చుట్టూ తిరుగుతుంది. వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చుట్టూ మనం తిరగాల్సి వస్తుంది. రెబెక్కా బ్లాక్.. జీవితాన్ని ప్రేమించింది. ప్రేమించి ఊరుకోలేదు. పాటతో ఆ ప్రేమను చూపించింది. ఎవరికీ అర్థం కాలేదు. ఇదేం పాట అన్నారు! ఇది పాటా అన్నారు. పాటలో కీట్స్ లేడు. షెల్లీ లేడు. బైరన్ లేడు. కనీసం కుర్రవృద్ధుడు జస్టిన్ బీబర్ లేడు. అసలు పొయెట్రీనే లేదు. శుక్రవారం రాగానే లేవడం, పార్టీలకు పరుగెత్తడం. ఏముంది ఇందులో? లోకం నిక్కచ్చి మాస్టారు. పదమూడేళ్ల పిల్లయినా గెలిచే తీరాలంటుంది. గెలవలేకపోతే ‘ఈ లోకంలోకి ఎందుకొచ్చావ్?’ అని అడుగుతుంది. పాడింది మాత్రమే రెబెక్కా. తన ఫీలింగ్స్‌ని వేరెవరికో చెప్పి తనకు కావలసినట్లు పాటను రాయించుకుంది. ప్రపంచంలోని ఒక్క లిరిక్ లవర్‌కి కూడా ఈ పాట నచ్చలేదు. పూర్ గర్ల్ అన్నారు. ‘ఎస్టర్డే వాజ్ థర్స్డే.. టుడే ఈజ్ ఫ్రైడే.. టుమారో ఈజ్ శాటర్ డే’ అని పాడుతుంది రెబెక్కా.. పాటలో ఓ చోట. ‘డే ఆఫ్టర్ టుమారో సండే కదా.. హహహా.. ఈ పిల్లలో విషయం లేదు. కసిగా ఏదో అవ్వాలనుకుని లోకం మీద విసురుగా పడింది’ అని కామెంట్స్. సిస్టమ్‌ని షట్ డౌన్ చేసేస్తే ఈ కామెంట్స్ అన్ని మాయమౌతాయి. కానీ స్కూల్ మాయమౌతుందా? సెలవులొచ్చే వరకు ఆన్‌లోనే ఉంటుంది. సెలవులయ్యాక మళ్లీ స్కూల్. పాటను యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేసిన రోజు మొదలైన వెవ్వెవ్వేలు రెబెక్కాను టీనేజ్ అంతా వెంటాడాయి. స్కూల్లో టీచర్లు కూడా ఆమెను చూసి నోటికి చెయ్యి అడ్డుపెట్టి నవ్వుకున్నారు. ముడుచుకుపోయింది. స్కూల్లో పదిహేనవ యేట ఆమెతో మాట్లాడేవాళ్లు తగ్గిపోయారు. డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కాలేజ్‌లో పదిహేడవ యేట.. అప్పుడే రెబక్కా ‘ఫ్రైడే’ను చూసి వచ్చినవాళ్లెవరో.. తింటున్న పీజాలు, బర్గర్లు ఆమె మీద విసిరేశారు. సగం చచ్చిపోయింది. పందొమ్మిదో యేట మ్యూజిక్ ప్రొడ్యూజర్లు, సాంగ్ రైటర్లు నిన్నసలు ఎప్పటికీ తీసుకునేదే లేదనేశారు. ఇంటికొచ్చి ఏడ్చేసింది రెబెక్కా. రోజూ ఏడుస్తూనే ఉంది. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఒకటే ఏడుపు. తలుపులు వేసుకుని ఒంటరిగా ఏడుపు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. ∙∙ టీనేజ్ దాటుతుండగా రెబెక్కా ఓ రోజు అద్దంలో తనని తను పరిశీలనగా చూసుకుంది. ఏడ్చినట్లుంది. తనేం ఏడ్వడం లేదు. కానీ ఏడ్చినట్లే ఉంది! కన్నీళ్లొస్తే చేతులతో తుడుచుకుంటాం. ఏడుపే రాకుండా కన్నీళ్లు కనిపిస్తుంటే.. తుడుచుకోవలసింది కళ్లను కాదు. కళ్లు మూసినా, కళ్లు తెరిచినా తనను ఏడిపిస్తున్న లోకాన్ని! అవును.. లోకాన్ని తన కళ్ల ముందు నుంచి తుడిచేయాలి. కళ్లు మూసుకుంది రెబెక్కా. రెప్పల మాటున అంతవరకు ఉంటూ వచ్చిన అవమానాలన్నీ ఒకటొకటిగా అదృశ్యం అయిపోవడం మొదలైంది. చివరికొక రూపం మిగిలింది. ఆ రూపం రెబక్కాదే. రెబక్కా అందంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ఉంది. ఒక కొత్త పాట కోసం తనని తను ట్యూన్ చేసుకుంటోంది! ఈ ఫిబ్రవరి 10 కి రెబెక్కా పాట ‘ఫ్రైడే’.. పదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. దీనిపై ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న పోస్ట్ పెట్టింది రెబెక్కా. ‘మీరేమిటన్నది మీ గురించి మీకేం తెలుసో అదే కానీ.. మీ గురించి ఎవరేమనుకుంటున్నారో అది కాదు మీరు’ అని. ఇంకా చాలా రాసింది. వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయ్యాక.. ఈ సాయంత్రం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ పోస్ట్‌ను చదవండి. మీరు జీవితాన్ని ప్రేమిస్తున్నారో, వ్యక్తిని ప్రేమిస్తున్నారో మీ కనురెప్పల లోపలి స్క్రీన్‌పై కనిపిస్తుంది. తర్వాత మీరు.. రెబెక్కా ఇన్నేళ్లలోనూ సొంతంగా, ఎవరి సహాయమూ లేకుండా చేసిన మిగతా సింగిల్స్‌ని (సింగిల్ సాంగ్స్) కూడా వెతకడం మొదలు పెడతారు. ఆమెదే కొద్దిగా ఫిల్మోగ్రఫీ ఉంది. డిస్కోగ్రఫీ ఉంది. అన్నీ తనకు తానుగా చేసుకున్నవే. జీవితాన్ని ప్రేమించేవారు ఏదైనా సొంతంగా చేసుకోగలరు. దేన్నయినా సొంతంగా సాధించగలరు. మన జీవితమే మనకు వాలంటైన్. -
గోపికనై నేను జలకములాడేను
నా తమ్ముడు చిత్రంలోని ‘హే సుందరాకార హేబృంద సంచార/ఏ బండికొచ్చావురా/నేను నా మేను ఇస్తాను నీతోటి వస్తా ను ఛస్తాను నీ కోసమే’ అని సరదాగా సాగే ఈ పాటలో నేను, రాజబాబు నటించాం. ఈ పాటకు పెండ్యాల శాస్త్రీయ సంగీతం, పసుమర్తి కృష్ణమూర్తి శాస్త్రీయ నాట్యం కూర్చారు. నా నాలుగో ఏట నుంచే నాట్యం నేర్చుకోవడం వల్ల సెమీ క్లాసికల్ చేయడానికి ఇబ్బంది అనిపించలేదు. చాలా సులువుగా చేశాను. ఏ పాత్రనైనా చేస్తున్నంత సేపు పాత్రలో నిమగ్నమైపోతాను. ‘శ్రీకృష్ణుడి కోసం కల కంటే ఆయన ప్రత్యక్షమైనట్టు భావించే సన్నివేశం’ అని పాట సిట్యుయేషన్ చెప్పారు. చాలా సరదా సన్నివేశం. పాట షూటింగ్ అయిపోయాక అందరూ ఫక్కున నవ్వేశారు. నేను కూడా నవ్వాను. ‘నీ సొద విన్నాను పింఛము కొన్నాను/రిక్షాలో వచ్చాను దరిశనమిచ్చాను/కలలో కనిపించి పులకలు పెంచావురా/ఇంక పైని చాలజాల జాలి పూని ఏలుకోరా’ చరణంలో నేను రాజబాబు ఇద్దరం పోటీ పడి నాట్యం చేశాం. ఆయనకి ఈ పాటంటే చాలా ఇష్టం. ఆయన చాలా సరదా మనిషి. అందరితోనూ స్నేహంగా మెలిగేవారు. ఆయన ఇంటి నుంచి షూటింగ్ స్పాట్‌కి మధ్యాహ్నం క్యారేజీ వచ్చేది. ఆయన అందరికీ రుచి చూపించేవారు. ఒకవేళ నేను రాలేకపోతే, నాకు గదికి పంపేవారు. రాజబాబుగారి భార్య రెండు చేతుల నిండుగా బంగారు గాజులు వేసుకునేవారు. ఆవిడ నాకు అలా గుర్తుండిపోయారు. మా అమ్మకి నేను ఒక్కర్తినే ఆడపిల్లను. ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒకటి చేయించేది. ఒక సంవత్సరం నడుముకి గొలుసు చేయించింది. ఏ ఫంక్షన్‌కి వెళ్లినా నా నడుముకి గొలుసు తప్పనిసరి. ప్రసన్నరాణి అంటే ‘నడుముకి చెయిన్’ అని గుర్తింపు తెచ్చుకున్నాను. ‘ఇది యమునా నది మనకై గదిలో పడుతున్నది/గోపికనై నేను జలకములాడేను/ఇసుకతిన్నెలవిగో పొన్నమాను ఇదిగో/నీ చిలిపి గోపబాలుడనై దాగి చీర దోచుకుని పోయెదనిపుడే’ చరణం చాలా సరదాగా ఉంటుంది. ఈ పాట అంతా ఒకే గదిలో తీశారు. ఒక వాటర్ క్యాన్, బేసిన్ పెట్టి, క్యాన్‌లో నీళ్లు పడుతుంటే, అదే యమునానది అంటూ, ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ జలకాలాడుతున్నట్లు భావిస్తాం. గదిలో వస్తువులు చూడగానే నవ్వు ఆగలేదు. ఈ పాటలో నా డ్యాన్స్‌కి ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చారు. పక్కన ఉన్న స్టూడియోలలో వారు కూడా వచ్చి నన్ను ప్రశంసించారు. ఫస్ట్ టేక్‌లోనే ఓకే అయిపోయింది. రెండు రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. షూటింగ్ పూర్తవ్వగానే ఇంటికి వెళ్లిపోయేదాన్ని. ఈ పాట నాకు మంచి గుర్తింపు తెచ్చింది. నాగేశ్వరరావుగారు నన్ను గట్టి పిండం అన్నారు. చిత్రం: నా తమ్ముడు రచన: అప్పలాచార్య గానం: బి. వసంత, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం: పెండ్యాల సంభాషణ: వైజయంతి పురాణపండ -
లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు
ఆడ ఏడనో కొండమీద కూసొని ఉంటాడు. ఈడ ఏడనో మనం మట్టిలో దొర్లాడుతుంటాం. ఓపారి సూడాలని ఓసారి దరిచేరాలని శానా ఆశ ఉంటుంది. దేవుడు కొండమీద ఉండనీ.. ఆకాశం అవతల ఉండనీ.. మన భుజమ్మీద ఒక చేయి ఉండనే ఉంటుంది. దేవుడంటే మిత్రుడు, స్నేహితుడు, శ్రేయోభిలాషి అంటూ... ‘సదాశివా సన్యాసి తాపసి కైలాసవాసి..’ పాటను అందించి మనందరి మనసులు గెలుచుకున్న రచయిత రామజోగయ్యశాస్త్రి గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ! పాటల రచయితగా వెలుగొందడం దైవ రచన అంటారా, మీ స్వయంకృషి అంటారా? మనలోని ప్రతీ ఒక్కరి జీవితం డెస్టినీ మీద ఆధారపడి ఉంటుందని నా నమ్మకం. నా జీవితం కూడా భగవంతుని దయగానే భావిస్తున్నాను. ప్రపంచంలో వేలాది విషయాలు ఉన్నప్పుడు నాకు ఈ ‘అక్షరం’ మీదనే ఎందుకు జిజ్ఞాస కలిగింది? అదే నాకు అన్నం పెట్టేదిగా ఎలా అయ్యింది. ఇది తలచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ రంగంలోకి రావడానికి, నిలదొక్కుకోవడానికి దైవం ప్రేరణ తప్పక ఉంది. ఇంజనీరింగ్ చదివాను. ఉద్యోగం చేస్తూనే నా ఇష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడటం అంటే ఇష్టం. ఆ ప్రయత్నంలో ఉండగానే పాట రాయాలనే ఆలోచన కలిగింది. నా ప్రయత్నమేదీ వృథా కాలేదు. ఇప్పటికీ నా ప్రతి అడుగులోనూ భగవంతుని అనుగ్రహం ఉంది. అయితే, దైవ కృప ఒక్కటే సరిపోదు. మన స్వయంకృషి ఉండాలి. మనమేదీ చేయకుండా భగవంతుని మీద వదిలేయడం సరైనది కాదు. ఉదయం పూజాధికాలు ముగించుకున్న తర్వాత రాయడం పనిగా పెట్టుకుంటాను. రాసే పనిలో లేనప్పుడు చదువుతాను. ఈ ధ్యాసలో పడితే అన్నం, నీళ్లు కూడా గుర్తుకురావు. జీవితంలో నిలదొక్కుకోవడానికి విధి మనకు కొన్ని అవకాశాలను ఇస్తుంది. వాటిలో అమితంగా నచ్చినదాన్ని పట్టుకుంటాం. దానిని వదలకుండా ఆ పనికి కావల్సిన వనరులన్నీ సమకూర్చుకోగలగాలి. సమర్థతను పెంపొందించుకోవాలి. చేసే సాధన ఎంత ఉంటే దైవం ఆశీస్సులు అంతగా ఉంటాయని నమ్ముతాను. చాలా మంది రచనలు చేసేటప్పుడు ముందు వారి ఇష్టదైవం పేరును రాస్తుంటారు. మీరూ అలా రాసే రచన మొదలుపెడుతుంటారా? ఒకటి కాదు మూడు రాస్తాను. మొదటగా శ్రీ గురుభ్యోనమః అని రాసుకుంటాను. ఆ విధంగా ముందు గురువును తలచుకుంటాను. తర్వాత ‘సాయి ప్రసాదం’ అని రాస్తాను. ప్రతీ అక్షరం సాయిబాబా ప్రసాదంగా భావిస్తాను. మా ఇంటి పేరు కూడా సాయిప్రసాదం అనే ఉంటుంది. ఇక ఏ పని చేసినా ఓర్పుగా, శ్రద్ధగా చేయడం అనేది ముఖ్యం. ఇదే విషయాన్ని సాయిబాబా సూక్తుల ద్వారా తెలియజేశారు. అందుకే పేజీకి ఒక మూలన ‘శ్రద్ధ– సబూరి’ అని రాసుకుంటాను. ఒక పాట ఎన్ని సార్లు రాసినా, ఎన్ని పేజీలు రాసినా.. ప్రతీ ఒక్క పేజీ మీద ఈ మూడు పదాలు తప్పనిసరిగా ఉంటాయి. మీలో ఆధ్యాత్మికత పెంపొందడానికి చిన్నప్పుడు ఇంట్లో అమ్మనాన్నలు చేసే పూజలు, తరచూ దేవాలయ సందర్శనలు దోహదపడ్డాయంటారా? మన సంస్కృతి, సంప్రదాయాలు ఆధ్యాత్మికత వైపు నడిపించే సాధనాలు. అవి నిన్నటి తరం నుంచి నేటి తరానికి, నేటి తరం నుంచి రేపటి తరానికి చేరుతుంటాయి. దైవానికి సంబంధించిన అంశాలు కూడా పెద్దవారి నుంచే పిల్లలు అందిపుచ్చుకుంటారు. మా అమ్మ (సరస్వతమ్మ) రాముడి భక్తురాలు. భద్రాచల రాముడికి మొక్కుకున్నాక నేను పుట్టానని, రాముడి భిక్ష అని భావిస్తూ నాకు ‘రామజోగయ్య’ అని పేరు పెట్టింది. అమ్మ ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి నేనూ కొన్ని అలవర్చుకున్నాను. సాహిత్యంపైన ప్రేమ అక్కడినుంచే వచ్చి ఉంటుందని నా భావన. అయితే, భగవతారాధనలో నిత్యం చేసే క్రతువుల కన్నా ఆధ్యాత్మికానందం ఎవరికి వారు మనసు లోతుల్లో నుంచి పొందాలి. ఇది వారి మానసిక పరిణతిని బట్టి ఉంటుంది. నా చిన్నతనంలో గుళ్ల వద్ద తరచూ కొన్ని భక్తి పాటలు చెవిన పడుతుండేవి. వాటిలో మనసులో బలంగా నాటుకుపోయినవి ‘శివ శివ శంకర.. భక్తవ శంకర శంభో హరహర మహాదేవ..,’, ‘రామనీలమేఘశ్యామ కోదండ రామా.. రఘుకులాద్రి శోమ పరంధామ సార్వభౌమ..’ అనే పాటలు. ఇవి చెవిన పడితే చాలు ఇప్పటికీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావం మనసును తట్టిలేపుతుంది. ఇక ‘పిబరే రామరసం..’ అనే కీర్తన ఏ రూపంలో, ఏ సందర్భంలో, ఎక్కడ విన్నా పరవశానికి లోనవుతుంటాను. ఇతర కవులు రాసిన పాటల పరవశం గురించి చెప్పారు. మరి మీరు రాసిన దేవుడి పాటల్లో మీకు బాగా నచ్చినవి.. రెండు పాటలు ఉన్నాయి. ‘సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి..’ అనే పాట నాకు చాలా ఇష్టమైనది. ఈ పాటకు జరిగిన కృషి, తపనను మర్చిపోలేను. ప్రతి పదమూ ఓ అద్భుతంగా అమరింది. ఈ పాట ద్వారా నాకు ఎక్కడలేని గుర్తింపు లభించింది. అంతకుముందు సినీ పరిశ్రమలోనూ, బయట రామజోగయ్యశాస్త్రిని చూసిన విధానం వేరు. ఈ పాట తర్వాత నాకో గుర్తింపు, ప్రత్యేకత లభించాయి. మరో పాట నాగార్జున నటించిన సాయిబాబా సినిమాలో ‘నీ పదముల ప్రభవించిన గంగా యమున.. మా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణ..’ అద్భుతం అనిపిస్తాయి. ఆ బాబాయే దయతలచి నా చేత ఈ పాట రాయించాడా అనిపిస్తుంది. దేవుడు మీకు అక్షరరూపంలో సరస్వతిని ఇచ్చాడు. అలాంటì అక్షరాన్ని కమర్షియల్ పాటలకు వాడటం గిల్ట్‌గా ఎప్పుడైనా భావించారా? ఎంతమాత్రమూ లేదు. ఎందుకంటే, భగవంతుని స్తుతించే కీర్తన అయినా, డ్యూయెట్, ఐటమ్ సాంగ్.. ఏదీ వేరు కాదు. ఇది దైవం నాకు ఇచ్చిన పని. నేటి తరానికి తగ్గట్టుగా ఉంటూనే విలువలు కోల్పోకుండా ఆ పరిధిలోనే నన్ను వరించిన పనులు చేస్తాను. నా ద్వారా ఎప్పుడూ చెడు రాదు. సాయి ప్రసాదం అని ఎప్పుడైతే రాసుకున్నానో అది భగవంతుని ప్రసాదంగానే భావించి భక్తిగా నా పనిని పూర్తిచేస్తాను. ఒక దశకు వచ్చాక.. అంటే ఆర్థికంగా స్థిరపడ్డాక ఎవరికైనా ఇక దేవుడితో పని లేదనిపిస్తుందా? అలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఆర్థికపరమైన విషయానికి, ఆధ్యాత్మికంగా దైవంతో కనెక్టివిటీ ఉండటానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఈ రెండూ వేరు వేరు విషయాలు. దేవుడు మనకు మంచి ఆలంబన. నా దృష్టిలో అయితే మంచి మిత్రుడు. మోటివేషనల్ స్పిరిట్. నా ఏకాగ్రతను ఇనుమడింపజేసే ఒక అంశం. నన్ను సరైన పద్ధతులు, కట్టుబాట్లలో ఉంచి పోషించే విషయం. నా కష్టనష్టాలు చెప్పుకునే కేంద్రస్థానం. ఇవన్నీ ఆర్థికంగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉండవు. కొంతమందికి దైవం మూర్తి స్వరూపంగా ఉంటాడు, కొంతమందికి భావనా స్వరూపంగా ఉంటాడు. అది వారి ఆలోచనా విధానం బట్టి ఉంటుంది. ఎవరెలా పూజించినా ప్రపంచాన్ని నడిపించే శక్తి ఉంది. ఆ శక్తికి అందరం ఎప్పుడూ అనుసంధానమై ఉండాల్సిందే! డబ్బులు ఉండటం, లేకపోవడం అనేది సమస్య కాదు. దేవుడితో మన సంబంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉందా లేదా అనేది తరచి చూసుకోవాలి. అలాగే, ప్రపంచంలో మనశ్శాంతిని మించిన సంపద లేదు. దేవుడితో ఎంత కనెక్ట్ అయి ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటాం. ఎంత ఎత్తులకు ఎదుగుతున్నా భగవంతునితో కనెక్టివిటీ శాశ్వతంగా ఉండాలి. మీరు ఎప్పుడూ నుదుటన బొట్టుతో కనిపిస్తారు. ఈ రంగంలోకి వచ్చాకనే ఇలా బొట్టు పెట్టుకోవడం ప్రారంభించారా? దీని వెనుక ఉన్న సందర్భం ఏంటి? పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవడం మనందరి అలవాటు. ఒకసారి ఇంట్లో ఏదో పూజ జరిగి బయటకు వెళ్లినప్పుడు బొట్టు పెట్టుకొని ఉన్నాను. కలిసినవారు బొట్టుతో బాగున్నానని చెప్పారు. అసలు విషయం ఏంటంటే నా నుదురు విశాలంగా ఉంటుంది. నుదురు మధ్యలో ఏదో ఒకటి ఉంచాలి. బొట్టు పెట్టుకుంటే బాగుంటుందనిపించింది. అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. మీ బాల్యంలో దేవుడు, ఇప్పుడు దేవుడు? ఈ రెండింటి మధ్య మీ ఆలోచనలు.. సంప్రదాయ కుటుంబంలో పుట్టినా, హేతుబద్ధమైన విషయాల పట్ల అవగాహనతో ఉండేవాడిని. ఎప్పుడూ నన్ను నేను సద్విమర్శ చేసుకుంటూ ఉండేవాడిని. ఈ ప్రక్రియ నా ఎదుగుదలకు బాగా దోహదపడింది. ఎప్పుడూ విరగబడి ఛాందసంగా పూజలు చేసింది లేదు. అలాగని అస్సలు పూజలు చేయకుండా లేను. అమ్మానాన్నలకు ఒక్కడినే కొడుకును. చిన్నప్పుడు అమ్మానాన్నలతో పాటు రాముడు, కృష్ణుడు, గణేషుడు .. అని పూజించినవారున్నారు. అయితే, నాదైన జీవితంలో ప్రవేశించాక మాత్రం ‘సాయిబాబా’ ఆలంబన అయ్యాడు. నాకు తెలియకుండానే నా జీవితంలో బాబాగారు ప్రవేశించారు. దేవతలందరిలోనూ ముందువరసలో బాబా ఉంటారు. అందరు దేవతలను ఆయనలో చూసుకుంటాను. పాట రాసే ముందు మంచి పదాలను ఇవ్వమని దేవుడిని తలుచుకుంటారా? పని ఇచ్చిన వారు.. అంటే పాట రాయమని చెప్పినవారు నాకు దైవ సమానులే! నాకు ఓ పనిని అత్యంత నమ్మకంగా అప్పజెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా ఆ పనిని చేయాలి. అదే నేను చేసే పూజ. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
లాలీ! ఓ లాలీ!!
పాట నాతో మాట్లాడుతుంది మోహన్‌బాబుగారి ఆఫీస్ నుండి ఫోన్ - ‘‘ఏయ్ సుద్దాలా! ఫ్రీ యేనా?’’ ‘ఇపుడా - రేపు ఎల్లుండి గురించా’ మనసులో, ‘‘చెప్పండి సర్’’ అన్నాను. ‘‘ఎల్లుండి నుండి వారం రోజులు తిరుమలపై సినిమా పాటల సిట్టింగ్... నీకోకే... కదా’’ ‘‘ఓకే సర్’’ - ఫోన్ కట్... చిత్రం ఝుమ్మంది నాదం. కీరవాణి - రాఘవేంద్రరావుల ‘రసమ్మేళనం’ తిరుమలపై సందర్భం చెప్పారు రాఘవేంద్రులు. ‘విదేశాల నుండి వచ్చిన కథానాయిక జోలపాటలపై రీసెర్చ్ చేస్తూంది. గైడ్ హీరో మనోజ్. ‘జోలపాట’ కావాలి. పసిబిడ్డల నిదురపుచ్చుతూ - పడుచు హృదయాలను నిద్రలేపేదిగా ‘పిల్ల తెమ్మెరలా - పిండివెన్నెలలా సుకుమార సుందరంగా ఉండాలి. మధ్యలో తెలంగాణ - సాగరతీర గ్రామాల జానపద మిళితంగా ఉండాలన్నారు. దర్శకేంద్ర పసిబాలుడు - రసహేలుడు - సినీరస విశ్వవిద్యాలయ చాన్స్‌లర్. స్థలం తిరుమల కొండ - మనసు మా అమ్మ పాడిన జోలపాటల జ్ఞాపకాలకు వెళ్లింది. ‘‘పడుచు హృదయాలను రస హృదయాలను నిద్రలేపేలా’’ దర్శకుని మాట... పల్లవిలా గుర్తుకొస్తుంది. తెల్లకాగితంపై పెన్ను సిద్ధంగా ఉంది. నేను అనే నా కవితాత్మ మనోజ్ కళ్లతో తాప్సిని చూస్తోంది. నా పాట... నాతో... ‘ఊయల - గాలి... పూలతూగుటూయల - పూల గాలుల కోయిల’ - ఇలా వెళ్లు తండ్రీ! అంది. నాలోని కవి పెదవుల కొసలపై ఆత్మవిశ్వాసపు చిరునవ్వుతో కాగితంపై పల్లవిని ఇలా అలంకరించాడు. ‘‘లాలి పాడుతున్నది ఈ గాలి - ఈ గాలి రాగాలలో నువ్వూయల ఊగాలి’’... ఇంతే రాసి దర్శకునికిచ్చా. ఆయన పెదవులపై వెలసిన వెన్నెల కన్నులలో వెలుగై తళుక్కుమంది. ఆ కాగితం మోహన్బాబుకందించారు. రసికతా కవితా భోజరాజులా ‘శెభాష్’ అన్నారు. కాగితం కీరవాణి ఆర్మోణియం పైకి వెళ్లింది. ‘చాలా బాగుంది అశోక్ తేజగారూ’ అని కాగితాన్ని చూస్తూ వేళ్లతో సంగీత మంత్ర నగరి తలుపులు తెరిచారు ఆర్మోణియంపై. మొదటి స్పర్శతోనే - పల్లవికి బాణీ... వచ్చేసింది. అక్కడున్న అందరి కరతాళ ధ్వనులే తాళాలుగా, లయ తప్పిన హృదయాలే లయలుగా పల్లవి పూర్తయింది. వెంటనే ఒక జానపద గుబాళింపు ఇవ్వాలి అనకాపల్లిలో నా మిత్రుడు సీతారాముడు ఎప్పుడో చెప్పిన జాలరీ గుండెల జాజిమల్లెల జానపద రాగాల మాల నా మేధస్సుకు ప్రాంప్టింగ్ ఇచ్చింది. కాగితంపై రాసిచ్చాను. ‘ఏలో యాల... ఏలో యాల హైలెస్సో ఐలపట్టి హైలెస్సా... బల్లా కట్టు హైలెస్సా అద్దిర బాబు హైలెస్సా... అక్కడ పట్టు హైలెస్సా సన్నజాజి హైలెస్సా... చీరాకట్టి హైలెస్సా సిన్నాదొచ్చి హైలెస్సా... కన్నుకొట్టె హైలెస్సా... జాలరీ జానపదుల బాణీ నేను, కీరవాణి పాడుకుంటూ ‘అలాగే దించాం’. ఆ రాత్రి ‘పసిపాపల ఎదుగుదల’ను అందంగా అందించమంటూ గాలి - పూల తీవ - వేళ్లు - బోసినవ్వు అంటూ నిద్రరాని నా కనురెప్పలపై ఊది చెప్పింది. గాలి కొసల లాలి - ఆ పూల తీవెకు వేలి కొసల లాలి - ఈ బోసి నవ్వుకు బుడిబుడి నడకలకు - భూమాత లాలి ముద్దు ముద్దు పలుకులకు - చిలకమ్మ లాలి ఉంగా ఉంగా సంగీతాలకు కోయిలమ్మ లాలి ఇంతవరకు రాసి, పిల్లల గంతులను చాలా అందంగా చందమామ చందంగా చెప్పాలని నా పాట నన్ను ఊరించింది. ‘చెంగు చెంగు గంతులకు చందమామలో దాగివున్న కుందేలమ్మ లాలి’ అని రాశా. ఇంక చరణంలో కీరవాణి - దర్శకుడు - మోహన్‌బాబుల హృదయాలను ముద్దుపెట్టేంత అందంగా చెప్పాలనే తపనలో ఉండగా, ‘ఈ లాలి’ ఎలాంటిదో చెప్పు అంది నా పాట నాతో. ‘నా లాలి నీకు పూలపల్లకీ... అలసిన కళ్లకి...సొలసిన కాళ్లకి’ అని రాశాక, ‘శెభాష్ తేజా’ అంది. ఆపైన తెలంగాణ జానపదం మా అమ్మ పాడే ‘ఒక పూలగుళుచ్ఛం’ లాంటి పద సంపెంగ గుత్తి గుర్తుకువచ్చింది. ‘‘ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ... ఏమేమి కాయొప్పునే గౌరమ్మ’’... ఇది కూడా తెలంగాణ జానపదులు ఎలా పాడతారో అలాగే పెట్టాం. ఇక రెండో చరణం... వెన్నముద్ద లాలి - చిన్నారి మేనికి గోరుముద్ద లాలి - బంగారు బొమ్మకి ఓనమాలు పలికితే - పలకమ్మ లాలి అని రాయగానే, ‘శెభాష్ తండ్రీ! పలకమ్మ లాలి బాగుంది. ‘పలుకులమ్మ లాలి’ పెట్టవా అంది. నా పాట బాలశిక్ష చదివితే పలుకులమ్మ లాలి - దినదినము ఎదుగుతుంటే - దినకరుని లాలి... అనగానే మోహన్‌బాబు ‘సూపర్’ అన్నారు. ‘పదుగురొచ్చి నిను మెచ్చితే కన్నులారా చూసే తల్లికడుపు తీపి లాలి’ అని రాశాను. ‘పుత్రోత్సాహంబు’ అన్న సుమతి పద్యం గుర్తుంచుకుని - పాట పూర్తయింది. ‘పడుకో తేజా’ అంటూ లాలి పాడి వెళ్లిపోయింది నా లాలిపాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
పులితోలు వలువాయె...
పాట నాతో మాట్లాడుతుంది నా ఎదురుగా ఓ సౌందర్యవతి. ‘అలంకారాల ఘలంఘలలతో విశేష విశేషణాలతో అలరిస్తున్న శ్రీనాథుని పద్య సుందరి లాగున్నావు ఎవరివమ్మా తల్లీ’’ అన్నాను. చేవ కలిగిన చేమకూర వేంకటకవి యంతటి ‘సినీ చేమకూర వేటూరి సుందరరామమూర్తి నా తండ్రి. నేను ‘భక్త కన్నప్ప’లో ‘కిరాతార్జునీయ గేయ’ కన్యకను.’ భక్త కన్నప్ప... సంగీతం - సత్యం, దర్శకులు - బాపు. చెప్పేదేముంది. రచన ముళ్లపూడి రమణ. బాపు-రమణలు వేటూరిగారికి కిరాతార్జునీయం ఘట్టం చెప్పగానే వేటూరి ‘అసాధారణ ధారణాధురీణుడు కదా’ వెంటనే శ్రీనాథుని హరవిలాసంలోని ఏడవ ఆశ్వాసంలో కిరాతార్జునీయం అటు నుంచి ఇటు - ఇటు నుండి అటు ఒక్కసారి సాక్షాత్కరించింది. ఇంక ఏ ఆధారం లేకుండా గాలి నుండి గాంధర్వ గీతాలను సృజించగలిగే వేటూరిలోని కవి పెదవులపై సాధికారికత చిరునవ్వు మెరిసింది. గీతానికి తెర లేపుతూ - తకిట తకతక తకిట చరిత పదయుగళ - మొదలైంది. పాట. మూలంలోని పద్యంలో ఏది ముట్టుకోవాలో దేన్ని వదులుకోవాలో వేటూరి కనుచూపు కొసలకు పెనుపాళి కొసలకు తెలిసిన విద్వత్తో శంకరుడు ఎరుకలవానిగా మారుతున్నాడు. వేటూరి పెనుచూపు శంకరుని తలను ఒక్కసారే నిశితంగా గుర్తు తెచ్చుకుంది. ‘తలపై నెలవంక’ను శ్రీనాథుని ‘వికట పాటల జటా మకుటికాభారంబు కరుకైన జుంజురునెరులు కాగ’ జుట్టు గురించి ఎందుకులే వదిలేశాడు ‘జారు సుధాధామ శకలావతంసంబు పెడకొప్పు పైనుండు పీకె కాగ’ - శ్రీనాథుడు నెలవంకను చుట్టపీకెలా మారిందన్నది వేటూరికి నచ్చలే. సినిమా కన్ను - సినిమా పెన్ను - అందం - ఆనందం పరమావధి అనుకుంటుంది. ‘నెలవంక తలపాగ నెమలి ఈకెగ మారె’ వేటూరి సీతకు రమణ - బాపులిద్దరు శెభాషనుకున్నారు. శ్రీనాథుడు వదిలిన ‘గంగ’ను వేటూరి అందుకున్నాడు పాటలో తన ముద్ర వేయాలని ‘తలపైన గంగమ్మ తలపులోనికి జారె ‘ఘనలలాటంబున గను పట్టు కనుచిచ్చు గైరిక ద్రవతిలకంబుగాగ’... ఇది తప్పనిసరి అనుకుని ‘నిప్పులు మిసే కన్ను నిదరోయి బొట్టాయె’ శ్రీనాథుడు వదిలిన బూదిని - పులితోలును ‘బూదిపూతకు మారు పులితోలు వలువాయె’ అంటూ ఎరుకలవానికి ఆహార్యం ధరింపజేశాడు. శ్రీనాథుడు పాములను పూసల సరులుగా మార్చిన పాదాలను వలదని శ్రీనాథుడు రాసిన శంకరుండు కిరాత వేషంబు దాల్చి యగజ చెంచెతయై తోడనరుగుదేరును వాక్యాలను. ‘ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా... తల్లి పార్వతి మారే తాను ఎరుకతగా’ మార్చాడు. శ్రీనాథుని ‘బాణినోంకార దివ్యచాపము ధరించి వచ్చె వివ్వచ్చు వరతపోవనము కడకు’లో ‘త్రిశూలం’ లేదని గ్రహించి ‘ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము’ అంటూ త్రిశూలాన్ని శ్రీనాథుని ఓంకార ధనువుగా కూర్చాడు వేటూరి - కవి కన్ను జల్లెడైన వడపోతలో త్రిశూలం దొరికింది వేటూరికి. శ్రీనాథుని మూలంలోని ‘తాటియంత విల్లు ధరియించినాడవు - తాడి ఎత్తు గాండీవముతో ముత్తాడి ఎత్తుగా’ ఆనాటి కవులకు ఎత్తు అయితే తాటిచెట్టు లేదా హిమాలయం. అలా కిరాతార్జునీయ ఘట్టాన్ని సినీగీతాల చరిత్రలో హిమాలయం ఎత్తులో నిలిపిన వేటూరికి కొందరు నిర్మాతల - దర్శకుల - కథానాయకుల సంగీత దర్శకుల కొల‘తల’ మేరకు - కురచగా అపసవ్య సాచిగా పదాలతో ‘నాటు కొట్టడమూ’ తెల్సు. ఏమైనా సినీ కవులకు ఏం తెలుసు? శ్రీనాథ పద్యం అని వెటకారించే మలపరాయుల కనుల నలక మకిలి - కెలికి తీసేలా. వెలికి తీసేలా రచించిన ఈ గీతం మీ సినీగీత రచయితలందరికీ గర్వంగా హత్తుకోదగిన సగర్వంగా తలనెత్తుకోదగిన సినీమణి మకుట గీతం అంటూ వేటూరి పాట వేవేల గీతమ్మల ముద్దూ నా రాముడే - ముద్దు సుందర రాముడేనంటూ కొమ్మ కొమ్మకో సన్నాయిగా మారిపోయింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
నా ప్రేమ పేరు నీలాకాశం...
పాట నాతో మాట్లాడుతుంది ‘‘దాదాపు ఎనిమిది దశాబ్దాల నుండి సినిమాపాట మనస్సులను రంజింపజేస్తూనే ఉంది. విసుగు, విరామం లేకుండా రసధారావ్రతం చేసున్నదేదైనా ఉందంటే అది సినీగీతం మాత్రమే. మొన్న కృష్ణశాస్త్రి... పింగళి... సినారె... సిరివెన్నెల... రామజోగయ్యశాస్త్రి... ఇలా... ఇలా...’’ ‘‘సినీగీతం వైపు న్యాయవాద బాధ్యత స్వీకరించినట్టు ఏకధాటిగా ఏకరువుపెడుతున్నావు ఎవరమ్మా’’ అన్నాను. నా తండ్రి రామజోగయ్యశాస్త్రి - ‘నేను ‘నేనంటే నాకు చాలానే ఇష్టం’ పాటను... చిత్రం ఊసరవెల్లి, సంగీతం దేవిశ్రీప్రసాద్’- అంది ఆ పాట నాతో. చిత్రంలో (జూనియర్ అనకూడదు) యన్.టి.ఆర్. కథానాయికపై తన ఇష్టం ఎంతో, ఎలాంటిదో చెప్పే సందర్భం... వందల సినిమాల్లో వందలసార్లు రాసి - రాస్తూ - రాయబోయే తప్పనిసరి పాటలలో ఒకటి. సినీ రచయితల తిప్పలు ఏంటంటే, అదే అదే పదే పదే చెప్పాలి. కొత్తగా అనుభూతుల పూగుత్తిగా చెబుతూనే ఉండాలి. విషయం అదే - నువ్వు - నేను. నీ కళ్లు - నా గుండె - నీ బుగ్గలు - నా ముద్దులు. నీ మీద నాకు ప్రేమ... విషయం అదే. ఇలాంటి సందర్భాల్లో జయించుకొస్తున్న తరతరాల సినీ గీత రచయితలకు సలాం పెదనాన్నా’ అంది. ‘‘సరే, ఏం జరిగింది బేటా’’ అన్నాను. పాట రాయడానికి తలపంకిస్తూ పెదవులతో రాని పదాలను రుచి చూస్తున్నాడు నా తండ్రి. అప్పుడు నేను... ‘‘నాన్నా! ఈ ప్రపంచంలో మనిషికి ఏదంటే ఇష్టం’’ అన్నాను. చల్లగా నవ్వుతూ పెద్ద కళ్లతో చూస్తూ... కొందరికి పూలు - కొందరికి సరస్సులు’’ అన్నాడు. ‘‘ఊహు! అన్నిటికన్నా...’’ ‘‘కొందరికి అమ్మ. ఇంకొందరికి నేస్తం’’ ‘‘ఊహూ’’ అప్పుడన్నాడు మా నాన్న రామజోగయ్య, ‘‘మనిషికి నిజానికి తనంటేనే తనకు ఎక్కువ ఇష్టం’’. ‘‘సూపర్బ్... ఇలా పాట మొదలెట్టు తండ్రీ!’’ అన్నాను. దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బాణీ స్మరిస్తూ దూసుకెళ్లింది నా తండ్రి కలం... ‘‘నేనంటే నాకూ చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం ఏ చోటనైనా ఉన్నా నీకోసం నా ప్రేమ పేరు నీలాకాశం’’ వరకు రాశాడు. కలం కాసేపు ఆగింది. నా ప్రేమే నీలాకాశమైనప్పుడు ఆకాశంలో ఉండేదేదీ ఆమెను బాధించనీయొద్దు అనుకుని... ‘‘చెక్కిళ్లు ఎరుపయ్యే సూరీడి చూపైనా నా చేయి దాటందే నిను తాకదే చెలి’’ శెభాష్ తండ్రీ!... కంటిన్యూ కంటిన్యూ... అంటూ ప్రోత్సహించాను నేను. వెంటనే చెక్కిళ్లకు ప్రాసగా ‘‘ఎక్కిళ్లు రప్పించే ఏ చిన్న కలతైనా నా కన్ను తప్పించి నిను చేరదే చెలీ’’ అద్భుతమైన పల్లవి ఆవిష్కరించింది. ఇంక తొలి చరణం.. ఆకాశం నుంచి పెనుచూపు ఆరంభమైంది కనుక, పల్లవి పంచభూతాల్లో నింగి - నిప్పు (సూరీడు) వచ్చింది మిగిలినవి గాలి - నేలా - అలా వెళ్లకూడదు మరోసారి సూచించా. థాట్ వస్తే బాణీకి అక్షరాల దుస్తులు వేయడం అరక్షణం మాత్రమే కదా! - నా తండ్రి రామజోగయ్యకు. ‘‘వీచే గాలి, నేనూ పోటీపడుతుంటాం. పీల్చే శ్వాసై నిను చేరేలా’’ తను గాలితో పాటు ఆమె ఊపిరి కోశాల్లో దూరి నులివెచ్చగా బజ్జున్నట్టు లేదూ. ఆ ఊహ తరువాత వాక్యం ‘‘నేలా నేను రోజూ సర్దుకుపోతుంటాం రాణీ పాదాలు తలమోసేలా’’ ఆమె పాదాల కింద - తాను - తన నుదురు తల - ఓహో - ‘నను భవదీయదాసుకి’ పద్యం పారిజాతాపహరణం స్ఫురించలేదూ!. కృష్ణుడు సత్య పాదాల సున్నితత్వం తెలపడం, తన తల జుట్టు ముళ్లు తాకి నీ పాదాలు కందిపోతాయి - అన్న కృష్ణామృతం గుర్తుకొస్తుంది కదా! వెంటనే... పూలన్ని నీసొంతం - ముళ్లన్ని నాకోసం ఎండల్ని దిగమింగే నీడనైవున్నా అలా అలా తొలి చరణం పూర్తిచేశాడు. ఇక రెండో చరణం ఎలా మొదలెట్టనూ... అనుకుంటున్నాడు నా తండ్రి. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
గాగా.. యువతను చేసెనొక గమ్మత్తు..!
లేడీగాగా ఓ అయస్కాంతం. అయస్కాంతానికి ఇనుప ముక్కలు అతుక్కొంటాయి.. ఆమె వాయిస్‌కు గ్రామీ అవార్డులు అతుక్కొంటాయి. అంతే తేడా! ఈ కుర్ర అయస్కాంతానికి అతుక్కొనేవి అవార్డులే కాదు... పాప్‌ను పిచ్చిగా అభిమానించే యువ హృదయాలు కూడా. తాజాగా గాగా ట్విటర్ ఫాలోవర్ల విషయంలో కొత్త రికార్డును నెలకొల్పింది. నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధికమంది ఫాలోవర్లను కలిగి ఉన్న ట్విటిజన్గా నిలిచింది. గాగా... సింగర్, సాంగ్ రైటర్, యాక్టివిస్ట్, రికార్డ్ ప్రొడ్యూసర్, బిజినెస్ ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, నటి, వేదాంతి. పాతికేళ్ల వయసుకే సంపాదించిన గుర్తింపులు ఇవి. పాశ్చాత్య యువతరానికి రోల్ మోడల్‌గా, భారతీయ యువతకు పరిచయస్తురాలిగా ఉన్న గాగా విషయాలు, విశేషాలు ఇవి... గాగా అసలు పేరు స్టెఫానీ జోన్నే ఏంజెలీనా జెర్మనొట్టా. ‘రేడియో గాగా’ అనే పాట స్ఫూర్తితో ఆమె తన స్టేజ్నేమ్ను ‘లేడీగాగా’ గా మార్చుకొంది. గాగా వాడే పెర్ఫ్యూమ్, లిప్‌స్టిక్, మేకప్కిట్స్ అన్నీ ఫేమస్సే. గాగా వల్లనే ఆ బ్రాండ్స్‌కు మంచి ప్రచారం వస్తోంది. వ్యక్తిగతంగా కూడా గాగా మేకప్ లేనిదే పర్సనల్ రూమ్ నుంచి బయటకు అడుగుపెట్టదట. ఆమె వినసొంపు వాయిస్ మాత్రమే కాదు.. మేని ఒంపులు కూడా ఫేమస్సే. ఫ్యాషన్‌లో ట్రెండ్‌ను ఫాలో కాకుండా ట్రెండ్‌ను సృష్టిస్తుంటుంది. తను వేసే ఔట్‌ఫిట్స్‌తో (దుస్తులతో) ఔరా అనిపిస్తుంటుంది. ప్రపంచ పాప్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా ఉన్న ఈ యువతి ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. గాగా ఎక్కడికి వెళ్లినా తనతో పాటు ఒక టీ కప్, సాసర్ను తీసుకెళ్తుంది. ఎందుకంటే.. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఆ కప్‌లో టీ తాగడం వల్ల ఇంటిదగ్గర ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెబుతుంది. తన స్టేజ్ షోలో ఆమె వేసుకుని వచ్చే డ్రస్ ప్రధాన ఆకర్షణ. ఆమె ఎలాంటి ఔట్‌ఫిట్స్‌తో వస్తుందనే విషయం గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అలా ఒకసారి డిఫరెంట్ డ్రస్సింగ్‌తో షికాగోలోని పబ్లిక్ ప్లేస్‌లోకి వచ్చిన గాగాను అశ్లీల వస్త్రధారణతో ఉందని అక్కడ నుంచి తరలించారు పోలీసులు! ట్విటర్ ఫాలోవర్ల విషయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది లేడీగాగా. ఈ పాప్ సింగర్‌ను ఈ విషయంలో బీట్ చేసే వారెవరూ కనుచూపు మేరలో లేరు. గాగాకు నాలుగు కోట్ల మంది ట్విటర్ ఫాలోవర్లున్నారు. ఫేస్బుక్ విషయంలో అమెరికాలోనే టాప్ స్థానంలో ఉంది గాగా. అమెరికా అధ్యక్షుడు ఒబామా అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ కన్నా గాగా ఫేస్బుక్ పేజ్కే ఎక్కువమంది సబ్స్క్రైబర్లుండటం గమనార్హం. గాగాకు దాదాపు రెండు కోట్ల మంది ఫేస్బుక్ ఫాలోవర్లుండగా, ఒబామాకు ఒకటిన్నర కోటి మంది మాత్రమే ఉన్నారు. పాప్ సింగర్‌గా సంపాదన విషయంలో గాగా టాప్ ఆఫ్ ది చార్ట్‌గా నిలుస్తోంది. ప్రతియేటా అత్యధిక వసూళ్లను సాధించిన పాప్ఆల్బమ్స్ల జాబితాలో గాగా ఆల్బమ్‌లే ముందు వరసలో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రభావాత్మకమైన సంగీతకారిణి హోదాలో ఉంది. చారిటీ విషయంలో కూడా గాగాకు మంచి గుర్తింపు ఉంది. తమ సంపాదనలో దానధర్మాలకు ప్రాధాన్యత ఇస్తున్న పాప్సింగర్ల జాబితాలో కూడా గాగా ప్రతియేటా తొలిస్థానంలోనే నిలుస్తోంది. గాగా పేరు ఒక మార్కెటింగ్ సూత్రం. పాశ్చాత్య యువతలో ఆమెపై ఉన్న వెర్రి అభిమానాన్ని అనేక వాణిజ్య సంస్థలు బాగా సొమ్ము చేసుకొంటున్నాయి. గాగా పేరుతో టూత్ బ్రష్‌లు కూడా వచ్చాయంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. గాగా మైనపు బొమ్మను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. -
జగనన్న రావాలన్నా... గీతరచయితతో చిట్‌చాట్