
కోల్‌కతాకు చెందిన సింగర్, సాంగ్ రైటర్ అమిక శైల్. తొమ్మిది సంవత్సరాల వయసులో ‘లిటిల్ చాంప్స్’ రియాలిటీ షోలో పాల్గొంది. ఫోక్, జాజ్, క్లాసిక్‌లో ‘వావ్’ అనిపించుకుంది. డిగ్రీ పూర్తయిన తరువాత తన కలను సాకారం చేసుకోవడానికి ముంబైకి వచ్చింది. ‘స్ట్రగుల్’ అంటే ఏమిటో అప్పుడే తెలిసింది. సినిమాల్లో పాడడానికి చేసే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.
హిందుస్థానీ క్లాసిక్ మ్యూజిక్‌లో అమికకు మంచి పట్టు ఉంది. అవకాశాలు వచ్చే వరకు ఖాళీగా కూర్చోవడం ఎందుకని మ్యూజిక్ టీచర్‌గా జాబ్‌లో చేరింది. ఎట్టకేలకు ‘వెడ్డింగ్ యానివర్సరీ’ సినిమాతో బ్రేక్ వచ్చింది. ఎన్నో టీవీ సీరియల్స్‌కు టైటిల్ సాంగ్స్ పాడింది. ఎన్నో రియాల్టీ షోలలో పాల్గొంది. ‘సంగీతం అనేది నాకు అభిరుచి కాదు శ్వాసలాంటిది.
సంగీత సాధనకు ఎన్ని గంటలైనా సరిపోవు. యాంత్రికంగా, మొక్కుబడిగా కాకుండా ప్రశాంత చిత్తంతో సంగీత సాధన చేయాలి’ అంటున్న అమిక నటిగా కూడా రాణిస్తోంది. ‘పవర్‌ఫుల్ డైలాగులో చెప్పడంలో. సరిౖయెన భావోద్వేగాలు ప్రదర్శించడంలో నాలోని సింగర్ గురువులా మార్గదర్శనం చేస్తోంది’ అంటుంది అమిక శైల్.
Comments
Please login to add a commentAdd a comment