అమెరికన్ సింగర్, సాంగ్‌రైటర్, నటి వోలివియ రోడ్రిగో డెబ్యూ సింగిల్ ‘డ్రైవర్స్ లైసెన్స్’తో సంగీతప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. వోలివియకు స్ట్రాంగ్ యంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇరవై సంవత్సరాల రోడ్రిగోకు యూత్ పల్స్ తెలుసు. ‘పాట అనేది పక్షిలాంటిది. అది ఎప్పుడు వచ్చి మన భుజం మీద వాలుతుందో తెలియదు.
ఇవ్వాళ ఎలాగైనా సరే ఒక పాట చేసేయాలి అని కూర్చొని విఫలమైన సందర్భాలు ఎన్నో. టూరింగ్, రైటింగ్, రికార్డింగ్‌లను ఇష్టపడే రోడ్రిగో టూర్‌లో ఉన్నప్పుడు రాయకూడదు అనుకుంటుంది. కానీఅందమైన జలపాతాన్ని చూస్తున్నప్పుడో, చిరుగాలి సితార సంగీతం వినిపించినప్పుడో ఒక పాట అప్పటికప్పుడే పుట్టవచ్చు!
పాటలు రాసే, పాడే నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడూ మెరుగుపరుచుకోవాలి. ప్రతి రోజూ మనకు ఏమీ తెలియని ఒక కొత్త రోజే’ అంటున్న వోలివియ రోడ్రిగో బిల్‌బోర్డ్ గ్రేటెస్ట్ పాప్ స్టార్స్ 2023 జాబితాలో చోటు సంపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment