
‘‘ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నా బర్త్‌డే సందర్భంగా నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు మంచిర్యాల జిల్లాలో 2022 మొక్కలు నాటుతున్నందుకు హ్యాపీ’’ అని పాటల రచయిత తైదల బాపు అన్నారు. నేడు తన బర్త్ డే సందర్భంగా తైదల బాపు మాట్లాడుతూ– ‘‘విద్యార్థి దశ నుంచే పాటలు రాసేవాణ్ణి. 1998లో హైదరాబాద్‌కు వచ్చి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారికి నా పాటలు వినిపిస్తే, బాగున్నాయన్నారు.
(చదవండి: దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?)
దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారి ‘6 టీన్స్’ చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’, ‘అధినేత’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా దాదాపు 236 సినిమాల్లో 500లకి పైగా పాటలు రాశాను. 2019లో ‘జాతీయ కళారత్న’ అవార్డును అందుకున్నాను. రచయితల సంఘం రజతోత్సవంలో చిరంజీవి, రాఘవేంద్రరావుగార్ల చేతులమీదుగా విశిష్ట రచనా పురస్కారం అందుకున్నాను. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment