Nature Cure
-
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్‌లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్‌గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్‌గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
పకృతి నిలయం
ఇల్లంతా మొక్కల మయం... ఇంటి చుట్టూ వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలు పక్షులకు ఆవాసంగా.. అనుకూలంగా.. ప్రకృతి ప్రేమికుడు రాము..కాంక్రీట్ జంగిల్లో చెట్లు నరికి బహుళ అంతస్తుల మేడల నిర్మాణం చేపడుతున్నారు. నగరంలో చెట్ల కన్న అద్దాల భవనాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. పచ్చని మొక్కలు, చెట్లు చూడాలంటే ఏ పల్లెటూరుకో.. నగర శివారుకో.. లేదా రిసార్ట్స్కో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటిది అతని ఇల్లే పచ్చని మొక్కలతో ఉంది. ఎటు చూసిన మొక్కలతో పచ్చగా కని్పస్తాయి. బాల్కనీ, టెర్రస్లోనే కాదు. బెడ్రూం, మెట్లు, హాల్లో, పూజ గది ముందు, బాత్రూంలో, కిచెన్‌లో పచ్చని మొక్కలు దర్శనమిస్తాయి. అరే ఈ ప్రాంతంలో కూడా మొక్కలు పెంచవచ్చా అన్నట్లు ఉంటుంది ఆ ఇల్లు. అతనే ఆంజనేయనగర్‌కు చెందిన ప్రకృతి ప్రేమికుడు రాము. – మూసాపేట తని అసలు పేరు పత్తిరెడ్డి రామానుంజన్రెడ్డి. కానీ అందరూ ప్రకృతి రాము అని పిలుస్తారు. అలాగే గుర్తుపడతారు. పూర్తి పేరు చాలా మందికి తెలియదు. అతని ఇల్లు చూసి పేరు అడిగితే చెట్లు, పక్షులంటే ఇష్టం కాబట్టి ప్రకృతి రాముగా పిలుస్తారేమో అనుకుంటారు. కానీ కొన్ని రోజులు ప్రకృతి సూపర్ మార్కెట్ నడిపి సేంద్రియ ఉత్పతులు విక్రయించడంతో ప్రకృతి రాముగా పేరు స్థిరపడింది. అయితే సహజంగానే ప్రకృతి అంటే మక్కువ. తన ఇంటి పేరు కూడా ప్రకృతి నిలయం అని పెట్టుకోవడం ప్రకృతిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది.పల్లె వాతవరణం తలపించేలా..పక్షులు అధికంగా రావాలని వాటి కోసం ప్రత్యేకమైన చెట్లు పెంచుతున్నారు. రామచిలకలు, కోయిలలు, పావురాలు, పల్లెటూరులో కని్పంచే పిట్టలు, రంగుల పిచ్చుకలు, సీజనల్ పక్షులు ఆ ఇంటిపై వాలతాయి. పక్షుల కోసం నీరు, గింజలు కూడా ఏర్పాటు చేస్తారు. సహజంగా తినాలని వాటి కోసం జొన్న కంకులు తీసుకొచ్చి చెట్లకు కడతారు. ఆ మొక్కలపై పక్షుల గూళ్లు కూడా కని్పస్తాయి. ఉదయం పక్షుల కిలకిలరావాలతోనే నిద్రలేస్తారు. పక్షులతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తుంటారు. పక్షులకు ఆవాసంగా..ఇంట్లో ఉన్న మొక్కలు.. పక్షులకు ఆవాసంగా ఉంటాయి.. జామ, దానిమ్మ, మామిడి, ఉసిరి, నేరేడు వంటి పండ్ల మొక్కలతో పాటు చెరుకు, బొప్పయి, నిమ్మ చెట్లు ఉన్నాయి. పక్షులకు అవసరమైన జొన్న, వరి మొక్కలు సైతం ఏర్పాటు చేశాడు. పూలమొక్కలైన కనకాంబరం, సన్నమల్లె, జాజి మల్లె, లిల్లి, మందారంలో 5 రకాలు, బొడ్డు మల్లె, ఐదు రకాల గులాబీ పూలు వంటి పూల మొక్కలు. టమాట, వంకాయ, పచ్చి మిరప వంటి కూరగాయలతో పాటు పుదీనా, కొత్తిమీర, పాలకూర, మెంతి, బచ్చలి వంటి ఆకు కూరలు కూడా ఉంటాయి. పేపర్ పూలు వంటి షో మొక్కలు అనేకం ఉన్నాయి. ఇల్లూ ప్రత్యేకమే...ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కొద్ది స్థలం కూడా వదలకుండా కట్టుకుని కిరాయిలకు ఇచ్చుకుంటాం. కానీ అతని కుటుంబానికి సరిపడ డబుల్ బెడ్రూం, హాల్, ఓపెన్ కిచెన్‌తో పాటు గెస్ట్ రూంలు కూడా ఏర్పాటు చేసి మొక్కలకే ఎక్కువ స్థలాన్ని కేటాయించాడు. పెంట్‌హౌస్ మాదిరిగా రూంలు ఉండి, ముందు భాగం మొత్తం మొక్కలు ఉంటాయి. ఉదయం లేచి మొక్కల మధ్య కూర్చొని టీ తాగేందుకు, టిఫిన్ చేసేందుకు అరుగులు ఏర్పాటు చేశారు. టెర్రస్‌పై సాయం సంధ్య వేళ మొక్కలు కదులుతూ గాలి వీస్తుంటే ఎక్కడో ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది. -
Yellow Babu : ప్రకృతి కూడా పసుపు పార్టీ సరుకేనా?
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు రాజకీయ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్., బిజెపి ల నుండి పలువురు నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇలా చేస్తే ప్రకృతి ఊరుకోదని.. తీవ్ర పరిణామాలు తప్పవని గతంలో రేవంత్ రెడ్డి ఓ ఎల్లో మీడియా అధినేతతో కలిసి స్టూడియోలో కూర్చుని సిద్ధాంతీకరించారు. మరి ఇపుడు రేవంత్ రెడ్డి ఇలా BRS పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? ప్రమాదం ఏమీ ఉండదా? అని పొలిటికల్ ఎన్విరాన్ మెంటలిస్టులు ప్రశ్నిస్తున్నారు. పొరుగు పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదట. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని అనుకోవడం వల్లనే దివంగత వై.ఎస్.ఆర్. పై ప్రకృతి ప్రకోపించిందట. దాని కారణంగానే ఆయన మరణించారని ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా లో ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. ఇలా అభిప్రాయ పడ్డ రేవంత్ రెడ్డి.. ఏబీఎన్ రాధాకృష్ణ ఇద్దరూ కూడా చాలా చాలా మేధవులు. కాకపోతే ఇద్దరికీ కొద్ది పాటి సంస్కారం కూడా లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పండితులు. దివంగత వై.ఎస్.ఆర్. హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన వారి గురించి ఎవ్వరూ కూడా హేళనగా మాట్లాడరు. కానీ ఈ ఇద్దరూ కూడా వై.ఎస్.ఆర్. మరణానికి ఆయన టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలనుకోవడమే కారణమన్నట్లు.. అందుకే ప్రకృతి ఆయన్ను శిక్షించింది అన్నట్లు తీర్మానించారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి అత్యంత ఇష్టమైన గురువు చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 23 మంది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కేసులు పెడతామని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి టిడిపిలో చేర్చుకున్నారు. మరి ఈ ఘటనపై ప్రకృతికి కోపం ఎందుకు రాలేదట? వై.ఎస్.ఆర్. టి.ఆర్.ఎస్. ఎమ్మెల్యేలను చేర్చుకుందామా వద్దా అని ఆలోచన చేస్తేనే పగ బట్టేసిన ప్రకృతి చంద్రబాబు నిస్సిగ్గుగా 23 మందిని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చినా ప్రకృతి ఎందుకు ఊరుకున్నట్లు? కొంపదీసి ప్రకృతి కూడా ఎల్లో బ్యాచ్ లో చేరిపోయిందా? ఎల్లో మీడియా తరహాలో టిడిపి అధినేత ఏం చేసినా ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్ధి అయిన వై.ఎస్. ఆర్. తనను ఆశ్రయించిన వారిని తన పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటేనే ప్రకృతికి కోపం వస్తుందా? అన్నది రేవంత్ రెడ్డితో పాటు..రాధాకృష్ణకూడా సమాధానం చెప్పాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే చంద్రబాబు పురమాయిస్తే ఇదే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి కరెన్సీ కట్టలతో వెళ్లి బేరసారాలాడారు. మరి ఆ ఘటన పట్ల ప్రకృతికి అభ్యంతరాలేవీ ఉండవా? చంద్రబాబు వారి అనుచరులు ఎలా వ్యవహరించినా ప్రకృతి చూసి పరవశించిపోతుందా? అన్నది కూడా రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు వివరించాలి. ఈ ఒక్క విషయమే కాదు..చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు పీకలదాకా అప్పులు చేసి రాష్ట్ర ఖజానా దివాళా తీయించి గద్దె దిగేటపుడు 100కోట్లు మాత్రమే మిగిల్చి పోయారు. అపుడు ఏపీ అద్బుతంగా ఉందని భజన చేసింది ఎల్లో మీడియా. బాబుతో పోలిస్తే చాలా తక్కువగా అప్పులు చేసిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం రాష్ట్రాన్ని దివాళా తీయించేస్తున్నారంటూ గగ్గోలు పెట్టే రాతలు రాసింది. మనోడు చేస్తే సంసారం..ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఎల్లో మీడియా పైత్యపు రాతలు.. ఆ భావజాలంతో ఉండే వారి పైత్యపు కూతలు కొత్త కాదు. సరే చంద్రబాబు నాయుడి ప్రకృతికి చుట్టం కాబట్టి ఆయన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా రాజ్యాంగ విరుద్ధంగా టిడిపిలో చేర్చుకున్నా ప్రకృతి ఏమీ అనలేదు. కానీ ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రేవంత్ రెడ్డి మాత్రం ప్రకృతి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఆయన్ని అభిమానించే వారు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బి.ఆర్.ఎస్. నుంచి ఇద్దరు ఎంపీలను ఒక ఎమ్మెల్యేనీ రేవంత్ రెడ్డి పార్టీ చేర్చుకుని కండువాలు కప్పింది. మరో మాజీ మంత్రి మల్లారెడ్డిని డి.కె.శివకుమార్ దగ్గరకు పంపి బేరాలాడించింది. ప్రకృతి ఏపీలోనే కాదు కర్నాటకపైనా నిఘా పెడుతుంది మరి. అందుకే అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదంటున్నారు విజ్ఞులు. - సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం: సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్‌బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. (చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు) -
"పక్షిజల" : పక్షుల పట్ల ఆసక్తే ప్రకృతి ప్రేమికురాలిగా మార్చింది!
పచ్చటి ఊరు వదిలి కాంక్రీట్ జంగిల్లోకి అడుగుపెట్టిన శుభా భట్‌కు బెంగళూరులోని ‘ఐఐఎస్సీ’ క్యాంపస్ రూపంలో ప్రకృతి ప్రపంచం దగ్గరైంది. ఎన్నో పక్షులు నేస్తాలు అయ్యాయి. ‘పక్షులను ప్రేమించడానికి వాటి శాస్త్రీయ నామాలతో పనిలేదు’ అని హాస్యానికి అన్నా శుభాభట్ విషయంలో అది నిజం. ఎన్నో పక్షులకు సంబంధించి శాస్త్రీయ నామాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోయినా వాటిని ప్రేమించింది. పక్షులను చూస్తున్నంతసేపూ తనకు శుభ సమయమే. శాస్త్రీయ కోణం కంటే అనుభూతులు, భావోద్వేగాల కోణంలో రెండు వందల జాతుల పక్షులకు సంబంధించి తన పరిశీలనలను ‘పక్షి జల’ పేరుతో ఫొటో డాక్యుమెంటేషన్ చేసింది శుభా భట్... పెళ్లయిన తరువాత బెంగళూరు మహానగరంలోకి అడుగు పెట్టింది శుభా భట్. పచ్చని పల్లెటూరి నుంచి వచ్చిన తనకు వాహనాల రణగొణధ్వనులు తప్ప పక్షుల కిలకిలారావాలేవీ వినిపించేవి కాదు. దీంతో ఇంటి నాలుగు గోడల మధ్య నేషనల్ జాగ్రఫీ చానల్ చూడడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) క్యాంపస్‌లోకి అడుగు పెట్టడం మళ్లీ పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించింది శుభా భట్‌కు. ఆమె భర్త నవకాంత్ భట్ పరిశోధకుడు. ఐఐఎస్సీ క్యాంపస్‌లోకి ఎన్నో పక్షులు వచ్చిపోతుంటాయి. వాటిలో ఎప్పుడూ వచ్చే పక్షులతో పాటు అరుదైన అతిథుల్లాంటి పక్షులు కూడా ఉంటాయి. దాహార్తితో ఉన్న పక్షుల కోసం తన ఇంటిముందు మట్టిపాత్రలో నీళ్లు పెట్టి దూరంగా కూర్చునేది. దురదృష్టవశాత్తు ఒక్క పక్షి కూడా వచ్చేది కాదు. క్యాంపస్‌లోనే మరో చోటికి మకాం మార్చినప్పుడు కూడా ఇంటిముందు మట్టి పాత్రలలో నీళ్లు పెట్టి కూర్చొనేది. ఈసారి మాత్రం అదృష్టం తలుపు తట్టింది. కాకులు, పిచ్చుకలు... రకరకాల పక్షులు వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. ఈ ఉత్సాహంతో మరిన్ని మట్టిపాత్రలు ఇంటి చుట్టూ పెట్టేది. పేరు తెలిసిన పక్షులతో పాటు బొత్తిగా అపరిచితమైన పక్షులూ వచ్చి నీళ్లు తాగి వెళ్లేవి. అవి నీళ్లు తాగే దృశ్యం శుభకు అపురూపంగా అనిపించేది. నీటికి, పక్షులకు మధ్య ఉండే సంబంధాన్ని గురించి లోతుగా ఆలోచించేలా చేసేది. ఒకరోజు ఒక పక్షి చెట్టు కొమ్మల్లో నుంచి రాలిపడుతున్న నీటిబిందువులలో ఆనందంగా జలకాలాడుతున్న దృశ్యం చూసిన తరువాత చెట్లపై కూడా నీళ్లు పోయడం అలవాటు చేసుకుంది. మొత్తానికైతే శుభ ఉండే ఇల్లు పక్షులకు నచ్చిన ఇల్లు అయింది. ‘ఇక్కడకి వస్తే మనకు ప్రమాదమేమీ లేదు’ అనే నమ్మకం వాటికి కలిగింది. కొన్ని సంవత్సరాల క్రితం కశ్మీర్‌కు చెందిన అరుదైన కశ్మీర్ ఫ్లైక్యాచర్ శుభ కంటపడింది. కర్ణాటక గడ్డపై అరుదైన కశ్మీర్ పక్షిని వీడియో రికార్డ్ చేసిన ఘనత దక్కించుకుంది శుభ. ఫొటోగ్రాఫర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు శుభ. అయితే రకరకాల పక్షులు నీళ్లు తాగుతున్న అందమైన దృశ్యాలు కనువిందు చేస్తున్న రోజుల్లో కెమెరాను చేతుల్లోకి తీసుకుంది. ‘పక్షి జల’ పుస్తకంతో రచయిత్రిగా కూడా మారింది. ఈ పుస్తకాన్ని ఐఐఎస్సీ ప్రెస్ ప్రచురించింది. ‘పుస్తకం రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాటనీ, బయోలజీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రాకపోయినా ఈ పుస్తకం రాశానంటే కారణం ప్రకృతిపై నాకు ఉన్న ప్రేమ. దీంట్లో నా పరిశీలనలు, భావాలు, అనుభవాలు కనిపిస్తాయి. పక్షి జల చదివిన వాళ్లు ఎవరైనా తమ ఇంటి పరిసరాలలో పక్షుల దాహార్తిని తీర్చడానికి, వాటి జలకేళిని దర్శించడానికి నీటితో నిండిన మట్టిపాత్రలు ఏర్పాటు చేస్తే ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరినట్లే’ అంటుంది శుభ. మనది కాని ప్రపంచంలోకి తొంగిచూడాలంటే అద్భుతశక్తులేవీ అవసరం లేకపోవచ్చుగానీ ఆసక్తి మాత్రం ఉండాలి. శుభా భట్‌కు ఆసక్తి అనే శక్తి ఉంది. ఆ ఆసక్తే ఆమెని పక్షుల ప్రపంచంలోకి వెళ్లేలా చేసింది. (చదవండి: పురిటి కోసం పక్షులు ఎంచుకున్న ప్రాంతం, విదేశాల నుంచి వస్తుంటాయి) -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
జీవితంలో పరిగెడుతూ ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయాం
ప్రస్తుత పోటీప్రపంచంలో మనమందరం పరిగెడుతున్నాము. పిల్లలు చదువుల కోసం, ఉద్యోగస్తులు సంపాదన కోసం, పెద్దవాళ్లు ఆరోగ్యం కోసం ఇలా పరిగెడుతూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించడం మర్చిపోయాం. పెరుగుతున్న ఎండలు, అకాల వర్షాలు, వణికిస్తున్న చలి ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్న వాతావరణం గూర్చి మాట్లాడుకుంటాం కానీ ఆ వాతావరణం వలన పర్యావరణం, జీవవైవిధ్యంలో వచ్చే మార్పులను గమనించము. మానవ మనుగడకు పర్యావరణ సమతుల్యత చాలా ముఖ్యం. ఈ సమతుల్యతను నిర్వహించడంలో జీవవైవిధ్యం ముఖ్య పాత్ర పోషిస్తూ, పర్యావరణ వ్యవస్థలోని మార్పులకు ముఖ్య సూచికగా నిలుస్తుంది. మన చుట్టూ సాధారణంగా కనిపించే మొక్కలు, చెట్లు, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు జీవవైవిధ్యంలో ఒక భాగం. వీటిని ప్రతిరోజూ చూస్తుండే మనం, చాలా అరుదుగా గమనిస్తూంటాం. చూడటానికి గమనించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. గమనించిన ప్రతి వివరము ఎక్కువ కాలం గుర్తుంటుంది. ప్రకృతిలోని జీవవైవిధ్యమును గమనించడం వలన పిల్లలకు, పెద్దలకు చాలా ఉపయోగములు ఉన్నవి. పక్షులను గమనించడం, పక్షి కూతలను విని ఆనందించడం మనుషుల మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం కనబరుస్తుందని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలలో వెల్లడైనది. ఆల్బర్ట్ ఐంస్టీన్ 1949లోనే పక్షులు, తేనెటీగలలోని గమ్యాన్ని గుర్తించే సామర్ధ్యం తెలుసుకొనడం భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. విమానాల నుండి అట్టపెట్టెల వరకు ప్రకృతి నుండి ప్రేరేపింపబడిన వస్తువులు, పరికరములు, వాహనాలు మనం నిత్యం చూస్తుంటాం, ఉపయోగిస్తుంటాం. ప్రస్తుత విద్యావ్యవస్థ విధానాలు పిల్లలను ప్రకృతి నుండి దూరం చేస్తుంది. తరగతి గదులలో నేర్పించే చదువుకు ఉన్న ప్రాధాన్యత, ప్రకృతి పరిసరాలలోని జీవవైవిధ్యం గమనించడంలో కనిపించడంలేదు. పల్లెల్లో మారుతున్న జీవనవిధానాలు, నగరీకరణతో వస్తున్న మార్పుల వలన సహజమైన పర్యావరణ వ్యవస్థలు కనుమరుగవుతున్నవి. ప్రకృతి ఆధారిత అభ్యాసాన్ని, పర్యావరణ విద్యను విద్యావ్యవస్థలో ఏకీకృతం చేయడం వలన పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావం కనిపిస్తుంది. పరిసరాలలోని పక్షులు, ఋతువులు చెట్లు, మొక్కలలో ఋతు ప్రభావిత మార్పులు , సీతాకోకచిలుకలు, వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే చిమ్మెటలు ఇలా జీవవైవిధ్యంలోని అనేక ప్రాణులు, ఆ ప్రాణుల మధ్య సంబంధాలు, వివరములను పిల్లలు గమనించడం వలన ఒత్తిడి తగ్గి వారిలో సృజనాత్మకత మెరుగుపడుతుంది, విమర్శనాత్మకంగా ఆలోచించే గుణం పెంపొందుతుంది . సాంకేతిక విద్యతో పాటు పిల్లలకు ఇటువంటి అవకాశములు కల్పించడం వలన వారికి వాతావరణ మార్పులు, జీవవైవిధ్యమునకు కలుగుతున్న నష్టం, కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలపై అవగాహన పెరిగి ఆ దిశలోని సవాళ్ళను ఎదుర్కొని శాస్త్రజ్ఞులుగా,బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. ఇది మనకు మన తరువాత తరాలకు అత్యంత అవసరం. ఎదుగుతున్న పిల్లలకు ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన జీవితం అందించాల్సిన పెద్దలు కూడా పని ఒత్తిడికి తద్వారా వచ్చే మానసిక రుగ్మతలకు మినహాయింపు కాదు. ఇంగ్లాండ్ , నెదర్లాండ్స్ , అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో పెద్దవారిలో , పింఛనుదారులలో వచ్చే ఒత్తిడి, ఒంటరితనం ఇతర మానసిక సవాళ్ళను అధిగమించడానికి వ్యాయామంతో పాటు పక్షివీక్షణ కూడా తరుచుగా చేస్తుంటారు. ఇది మన వ్యవస్థలో చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. ఉపాధ్యాయులకు ప్రకృతి, జీవవైవిధ్యమునకు సంభందించిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. పర్యావరణ విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పిల్లలలో మంచి మార్పు తేవడంలో ముఖ్యపాత్ర పోషించగలరు. పిల్లలకు, పెద్దలకు జీవవైవిధ్యంతో పరిచయం వలన పర్యావరణంఫై అవగాహన పెరిగి సహజ వనరులను పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కానీ ఈ పరిచయానికి కావాల్సిన వనరులు తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. మదనపల్లె లోని రిషి వాలీ స్కూల్ పక్షులు గూర్చి అవగాహన పెంపొందించడానికి ఆర్నిథాలజీ (పక్షి శాస్త్రము) కోర్సు అందిస్తున్నది. అలాగే ఎర్లీ బర్డ్ (early-bird.in) ప్రాజెక్ట్ నుండి పక్షులకు సంబంధించిన కరదీపికను/చేపుస్తకమును ఉచితముగా పొందవచ్చును. పిల్లలకొరకు పక్షులకు సంబంధించిన ఆటలు,పోస్టర్లు కూడా ఎర్లీ బర్డ్ ఉచితముగా అందిస్తున్నది. జీవివైవిధ్యంపై అవగాహన పెంపొందించుట కొరకు బొంబాయి నాచురల్ హిస్టరీ సొసైటీ (bnhs.org) వివిధ ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నారు. అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ ఆన్లైన్లో (https://academy.allaboutbirds.org/learning-games/) ఆటలతో పక్షులను పిల్లలకు పరిచయం చేస్తున్నారు. మొక్కలు, చెట్లపై ఆసక్తి ఉన్నవారు సీజన్ వాచ్ (https://www.seasonwatch.in) కార్యక్రమములో ఉచితముగా పాల్గొని అవగాహన పెంచుకోవచ్చు. ఇలా మన ఇంటినుండే ప్రకృతి, జీవవైవిధ్యంఫై అవగాహన పెంచుకుని తోటివారితో పంచుకునే సాంకేతికత, వనరులు మనకు చాలా అందుబాటులో ఉన్నవి. వీటిని ఉపయోగించుకుని మనకు, మన సమాజానికి ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించడం చాలా అవసరం. --- రాజశేఖర్ బండి -
ప్రకృతి వనం... ఆక్సి‘జనం’
సాక్షి, మేడ్చల్ జిల్లా: నగరీకరణ శరవేగంగా పెరుగుతోంది. దీంతోపాటే కాలుష్యమూ పెచ్చుమీరుతోంది. దీంతో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలతోపాటు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న మానసిక ఒత్తిళ్లు సరేసరి. వీటితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు చక్కటి సాంత్వన కల్పిస్తున్నాయి ప్రకృతి వనం, లంగ్స్ స్పేస్. హరితహారంలో భాగంగా ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌తోసహా శివారు పట్టణాలు, సెమీఅర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే లక్షలాది మొక్కలు నాటిన సర్కారు పల్లె, పట్టణ ప్రకృతి వనాలను పెంచుతోంది. వీటిలో వాకింగ్ పాత్‌లు, చిల్ట్రన్ కార్నర్స్ ఏర్పాటుచేయడంతోపాటు ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాటుచేస్తోంది. 80 లక్షల వాహనాలు... ఎన్నో పరిశ్రమలు గ్రేటర్ పరిధిలో అత్యంత రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. సుమారు 80 లక్షల మేర ఉన్న వాహనాలు వెదజల్లుతున్న పొగతో ‘సిటీ’జన్ల ముక్కుపుటాలు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పలుప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగలబెట్టడంతో కాలుష్య తీవ్రత మరింత పెరుగుతోంది. వీటికితోడు పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాలు పొగచూరుతున్నాయి. ఫలితంగా పీల్చే గాలిలో సూక్ష్మధూళికణాలు చేరి సమీప ప్రాంతాల్లోని ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరుతున్నాయి. ఘనపు మీటరు గాలిలో సూక్ష్మధూళికణాల (పీఎం2.5) మోతాదు 40 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ పలు కూడళ్లలో అంతకు రెట్టింపు స్థాయిలో ధూళికాలుష్యం నమోదవుతోంది. పుర, పంచాయతీల్లో వనాలు పుర, పంచాయతీల్లో అర ఎకరం నుంచి 4 ఎకరాల పరిధిలో ప్రకృతి వనాలను ఏర్పాటుచేశారు. గ్రేటర్ శివారు (మేడ్చల్ జిల్లా + రంగారెడ్డి జిల్లా)లోని 29 పురపాలక సంఘాల్లో 595 పట్టణ ప్రకృతి వనాలున్నాయి. వీటిని పురపాలక సంఘాలు నిర్వహిస్తున్నాయి. అలాగే, 619 పంచాయతీల పరిధిలో 946 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించి ఎకరాకు 2,500 మొక్కల చొప్పున పెంచారు. లంగ్స్ స్పేస్ ఎక్కడెక్కడ? హైదరాబాద్ శివారుల్లో ఏడు అర్బన్ లంగ్స్ స్పేస్లున్నాయి. ►మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం ►దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం ►నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం ►బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాల్లో ►నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాల్లో.. ►నారపల్లి–పర్వతాపూర్ ఫారెస్టు బ్లాకులోని 60 ఎకరాల్లో.. ►కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు హైదరాబాద్‌లో ఏడాదికి సగం రోజులకుపైగా కాలుష్యం నమోదవుతున్న ప్రాంతాలు ►బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్క్, పంజగుట్ట, కూకట్పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్ మరిన్ని అభివృద్ధి చేస్తాం నగర శివారుల్లో పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, లంగ్స్ స్పేస్‌లను మరింత అభివృద్ధి పరుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ భూములను కూడా గుర్తిస్తున్నాం. పెరుగుతున్న జనాభా, నగరీకరణ నేపథ్యంలో వీటి అవసరం ఎంతో ఉంది. పెరుగుతున్న కాలుష్యం కట్టడికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. – డా.ఎస్. హరీశ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ స్వచ్ఛమైన గాలి.. ప్రకృతి వనాలు, లంగ్ స్పేస్‌లు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. కాలుష్యం బారి నుంచి రక్షిస్తున్నాయి. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్నాం. రోజంతా అక్కడే ఉండాలనిపిస్తుంది. – కె. ఆంజనేయులు, పోచారం గొప్ప ఉపశమనం.. నారపల్లి–పర్వతాపూర్‌లోని 60 ఎకరాల్లో ఉన్న అర్బన్ లంగ్స్ స్పేస్ పిల్లలతోపాటు పెద్దలనూ ఆహ్లాదపరుస్తోంది. నగరానికి సమీపంలో ఉండటం వల్ల ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు వస్తారు. ఆటపాటలతో అందరూ ఆనందంలో మునిగితేలుతారు. –పి. రవికిరణ్, పీర్జాదిగూడ -
అది మనందరి బాధ్యత – పాటల రచయిత తైదల బాపు
‘‘ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. నా బర్త్‌డే సందర్భంగా నా మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు మంచిర్యాల జిల్లాలో 2022 మొక్కలు నాటుతున్నందుకు హ్యాపీ’’ అని పాటల రచయిత తైదల బాపు అన్నారు. నేడు తన బర్త్ డే సందర్భంగా తైదల బాపు మాట్లాడుతూ– ‘‘విద్యార్థి దశ నుంచే పాటలు రాసేవాణ్ణి. 1998లో హైదరాబాద్‌కు వచ్చి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారికి నా పాటలు వినిపిస్తే, బాగున్నాయన్నారు. (చదవండి: దుబాయ్‌కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?) దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారి ‘6 టీన్స్’ చిత్రంతో గాయకుడిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘గర్ల్‌ఫ్రెండ్’, ‘ఇదే నా మొదటి ప్రేమలేఖ’, ‘అధినేత’, ‘ఆచారి అమెరికా యాత్ర’ ఇలా దాదాపు 236 సినిమాల్లో 500లకి పైగా పాటలు రాశాను. 2019లో ‘జాతీయ కళారత్న’ అవార్డును అందుకున్నాను. రచయితల సంఘం రజతోత్సవంలో చిరంజీవి, రాఘవేంద్రరావుగార్ల చేతులమీదుగా విశిష్ట రచనా పురస్కారం అందుకున్నాను. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రకృతే పరమౌషధం!
ఎన్నో రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని కాపాడిన మందు పెన్సిలిన్.. దాని తయారీకి మూలం ఓ ఫంగస్.. ఇప్పుడు కరోనా టెస్టుల కోసం వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్ విధానంలో వాడేది ఓ బ్యాక్టీరియా.. ఇవే కాదు.. మానవాళిని పట్టిపీడిస్తున్న రోగాలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపినదీ ప్రకృతే. అత్యంత ముఖ్యమైన ఔషధాల తయారీకి స్ఫూర్తినిచ్చినదీ ప్రకృతే.. ఇలా ప్రకృతి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన మందులు, వాటి ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా.. జంతువులు, మొక్కల నుంచి.. వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్లగానీ, మన జీవనశైలి వల్లగానీ ఎన్నో రకాల రోగాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటికి ఉపశమనం కోసం ఎన్నో ప్రయోగాలు, మరెన్నో పరిశోధనలతో మందులు తయారు చేస్తుంటారు. ఒక్కోసారి కొన్నిరకాల జంతువులు, చెట్లలోని రసాయనాల సమ్మేళనాలు నేరుగా రోగాలు, ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తుంటాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగానో, అనుకోకుండానో అలాంటి వాటిని గుర్తించి.. మానవాళికి అందుబాటులోకి తెచ్చారు. మధుమేహానికి మందు ఇచ్చి.. గిలా మాన్స్టర్.. నలుపు, నారింజ రంగుల్లో ఉండే ఒక రకమైన పెద్దసైజు బల్లి. అమెరికా, మెక్సికో దేశాల్లో ఉండే ఈ బల్లి లాలాజలంలో ఎక్సెండిన్–4 అనే హార్మోన్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టైప్–2 మధుమేహం చికిత్సలో వాడుతున్న ఎక్సెనటైడ్ ఔషధానికి మూలం ఆ హార్మోనే. టైప్–2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి, పేషెంట్లు బరువు తగ్గడానికి ఈ హార్మోన్ తోడ్పడుతుందని నార్త్ కరోలినా వర్సిటీ శాస్త్రవేత్తలు 2007లో గుర్తించారు. దానిని ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. కరోనాను గుర్తిస్తున్నది ఇదే.. థర్మస్ అక్వాటికస్ బ్యాక్టీరియా.. 1969లో అమెరికాలోని ప్రఖ్యాత ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్‌లో దీనిని గుర్తించారు. ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకుని ప్రొటీన్ల పునరుత్పత్తి చేయగల సామర్థ్యం ఈ బ్యాక్టీరియాకు ఉంది. దీనిని ఆర్టీపీసీఆర్ టెస్టులో ఉపయోగించినప్పుడు.. సంబంధిత వైరస్ల ప్రొటీన్లను గుర్తించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. హా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం.. ఇండియా, అమెరికా, బ్రిటన్, ఇటలీ, టర్కీ ఈ ఐదు దేశాల్లోనే ఏడాది మే చివరినాటికి ఏకంగా 100 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఫంగస్‌పై పోరు నుంచి.. కేన్సర్ చికిత్సకు.. పాక్లిటాక్సెల్.. కేన్సర్ చికిత్సలో ఉపయోగించే అత్యంత కీలకమైన ఔషధం. పసిఫిక్ యూ అనే చెట్టు బెరడులో లభించే ఈ రసాయన మిశ్రమాన్ని 1971లోనే గుర్తించారు. అది కేన్సర్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని 2015లో జరిగిన పరిశోధనల్లో తేల్చారు. దాదాపు అన్నిరకాల కేన్సర్లకు చేసే కెమోథెరపీ చికిత్సలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన అత్యవసర మందుల జాబితాలో ఈ పాక్లిటాక్సెల్ ఔషధం కూడా ఉండటం గమనార్హం. నిజానికి పసిఫిక్ యూ చెట్లు ఈ రసాయన సమ్మేళనాన్ని ఎందుకు ఉత్పత్తి చేస్తాయో తెలుసా.. తమపై ఫంగస్‌లు పెరిగి తెగుళ్లు కలిగించకుండా ఉండటం కోసమే. వాటి ఇమ్యూనిటీ మనకు ఔషధంగా మారింది. సూక్ష్మజీవులను నాశనం చేసే కప్ప మాగేనిన్.. ఆఫ్రికన్ క్లాడ్ రకం కప్ప చర్మంలో ఉండే ఓ ప్రత్యేకమైన ప్రొటీన్. చాలా రకాల బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. కొన్నేళ్ల కింద ఆ కప్పలపై పరిశోధనలు చేస్తున్న కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. వాటి శరీరంపై గాయాలైనా ఇన్ఫెక్షన్లు పెద్దగా సోకడం లేదని గుర్తించారు. దానికి కారణం ఏమిటని పరిశోధించి ‘మాగేనిన్’ ప్రొటీన్‌ను గుర్తించారు. ఇది సూక్ష్మజీవుల పైపొరను ధ్వంసం చేస్తోందని తేల్చారు. అయితే ఈ ప్రొటీన్‌ను మానవ వినియోగానికి అనుగుణంగా మార్చడం, వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మరెన్నో మందులు.. ►జ్వరం, నొప్పులతోపాటు మరెన్నో అనారోగ్య లక్షణాలకు ఉపశమనంగా వాడే ఆస్పిరిన్ అనే మందు విల్లో చెట్ల బెరడు, ఆకుల్లో ఉంటుంది. వందల ఏళ్లుగా ప్రజలు దానిని వాడుతూ వచ్చారు. 1850వ దశకంలో ఆస్పిరిన్‌ను కృత్రిమంగా తయారుచేశారు. ►మలేరియాకు మందుగా వినియోగించే క్వినైన్ అనే ఔషధం సింకోనా చెట్ల బెరడు నుంచి వస్తుంది. వందల ఏళ్లుగా దాన్ని వినియోగిస్తున్నారు. 1940వ దశకంలో శాస్త్రవేత్తలు క్వినైన్‌ను కృత్రిమంగా తయారు చేశారు. ►రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ‘స్టాటిన్స్’ను పలు రకాల ఫంగస్ల నుంచి విడుదలయ్యే రసాయనాల నుంచి అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల విలువ! మనం పండించే, పెంచే చెట్లు, జంతువులు వంటివి కాకుండా.. సహజ ప్రకృతి నుంచి మనం ఏటా లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను వాడేసుకుంటున్నాం. ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) అంచనాల ప్రకారం.. భూమ్మీద ఉన్న ప్రకృతిని రూపాయల్లో లెక్కిస్తే.. 92.5 కోట్ల కోట్లు (125 ట్రిలియన్ డాలర్లు) విలువ ఉంటుంది. ప్రకృతిని సంరక్షించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ఏటా రూ.35.4 లక్షల కోట్లు (479 బిలియన్ డాలర్లు) నష్టపోతున్నామని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరించింది. -
ప్రకృతికి ఫ్రెండ్
కాలేజీకి సెలవులు వస్తే యువత విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుండటం సహజమే. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రకృతి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంటాడు! చిన్నారులతో కలిసి మొక్కలు నాటుతుంటాడు. ప్రకృతి సంరక్షణపై గ్రామస్తులకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడి వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటాడు. జ్ఞానేశ్వర్‌ది సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామం. ప్రకృతిని పరిరక్షిస్తానని ప్రతిన బూని పాదరక్షలు లేకుండా ఎనిమిదేళ్లుగా పాదయాత్రలు చేస్తున్నారు! జ్ఞానేశ్వర్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో బీఈడీ చదువుతున్నారు. స్వగ్రామం మంజీరా నది పరివాహకంలో ఉండటంతో రోజూ నది అందాలు ప్రకృతి చూస్తూ పెరిగారాయన. 2017లో నది చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకడంతో మంజీరా నది మొత్తం ఎండిపోయిన దృశ్యమూ చూశారు. నదిలోని మొసళ్లు గ్రామాల్లోకి వచ్చేవి. పక్షులు మృతి చెందేవి. దీంతో చలించిపోయి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు. అందుకు బాలల్ని తన సైన్యంగా మలుచుకున్నాడు. చిన్నారులతో కలిసి వేసవి కాలంలో సీడ్‌బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వాటిని విసిరారు. వర్షాలు కురిస్తే అందులోని విత్తనాలు మొల కెత్తేవి. మొదట్లో చిన్నారులను తీసుకొని వెళ్తే వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు. తర్వాత్తర్వాత వాళ్లూ ముందుకు వచ్చారు. మొక్కలు నాటేందుకు చిన్నారులతో కలిసి వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లేవారు జ్ఞానేశ్వర్. దీంతో గ్రామస్తుల్లోనూ చైతన్యం వచ్చింది. చెట్లను పూజించడం, తామూ మొక్కలు నాటడం ప్రారంభించారు. ఒక్కో దఫా మంజీరా తీరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యంతో వెళ్తారు. అక్కడికే విద్యార్థులు భోజనం తెచ్చుకొని సాయంత్రం వరకు మొక్కలు నాటుతారు. జ్ఞానేశ్వర్ గత ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్, బీదర్‌లలో సైకిల్ యాత్ర నిర్వహించారు. నిరుడు దసరా సెలవుల్లో మంజీరా నది రక్షించాలని కోరుతూ నారాయణఖేడ్‌లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నదుల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ సిద్దిపేట జిల్లా నుంచి నారాయణఖేడ్ వరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాదయాత్ర చేపట్టారు. – రవి ముదిరాజ్ తాటికొండ, సాక్షి, మెదక్ డెస్క్ -
లాలిజో.. లాలీజో...
ప్రకృతిలోని మనిషి.. పొత్తిళ్లలోని బిడ్డలా పెరగాలి తప్ప ‘కృత్రిమ’ వర్ణాల కాలుష్యపు ఉయ్యాలలో ఊపిరి పీల్చుకుంటూ ఎదగకూడదు. బిడ్డ దరిదాపుల్లో సింథటిక్ క్లాత్ లేకుండా,సహజమైన దారపు పోగుల వస్త్రాలను వెయ్యడమూ పర్యావరణ పరిరక్షణే! అప్పుడిక బిడ్డకే కాదు.. భూగోళానికీ మన ఇల్లు ‘పొత్తిల్లు’ అవుతుంది. స్వచ్ఛమైన జోలపాట అవుతుంది. పాపాయికి పాలు పట్టి, ఉయ్యాలలో పడుకోబెట్టింది మృదుల. అప్పటి వరకు తల్లిని చూస్తూ తల్లిముఖాన్ని తాకడానికి గాల్లో చేతులూపుతూ బోసినవ్వులు చిందిస్తోంది. ఉయ్యాలలో పడుకోబెట్టి తను వెనుదిరిగిన మరుక్షణం నుంచే పాపాయి ముఖం మారిపోయింది. దిగులుగా, చికాగ్గా ముఖం పెట్టి గట్టిగా ఏడుపందుకుంది. ఎక్కువ సేపు ఏడిస్తే ఆస్త్మా ఎక్కువవుతుందేమోనని ఆదుర్దాగా వచ్చి బిడ్డను ఎత్తుకుంది మృదుల. అప్పటికే పాపాయి ముఖం ఎర్రగా కందిపోయింది. తల్లికి హత్తుకుని పోయి రెండు మూడు నిమిషాలకు ఏడుపు ఆపేసి మామూలయింది.‘‘ఉయ్యాలలో పడుకోబెడితే ఏడుస్తోంది. ఇప్పుడిప్పుడే బోర్లా పడుతోంది. మంచం మీద పడుకోబెట్టి నేను కిచెన్‌లోకి వెళ్తే కిందపడుతుందేమోనని భయమేస్తోంది’’ అన్నది మృదుల అత్తగారి వైపు చూస్తూ నిస్సహాయంగా. ‘‘పిల్లలు తల్లి ముఖం గుర్తుపట్టడం మొదలైతే అంతేలే... తల్లి కనిపించకపోతే ఏడుస్తారు’’.అని తేలిగ్గా అనేసింది మృదుల అత్తగారు. ‘‘ఉయ్యాల నచ్చడం లేదేమో’’ నసిగింది మృదుల. అదేమాట గట్టిగా అంటే ఆమెకు కోపం వస్తుందేమోనని. ‘‘పిల్లలు ఉయ్యాల్లో వేస్తే కంటినిండా నిద్రపోతారు. పొద్దున స్నానం చేయించి పాలు పట్టి ఉయ్యాల్లో వేస్తే మధ్యాహ్నం వరకు కదిలేవాళ్లు కాదు. ఈ పాప ఉయ్యాలంటేనే గిట్టనట్లు మరీ ఎక్కువ ఏడుస్తోంది. చిన్నగా అలవాటవుతుందిలే. మీ పుట్టింట్లో ఉయ్యాలే అలవాటు చేయకపోతిరి’’ అన్నదామె కొంచెం విసుగ్గా.మృదులకు తెలియనిది, అత్తగారికి అర్థం కానిది, పాపాయి చెప్పలేనిది ఒక్కటే.చీర ఉయ్యాలలో పాపాయికి ఊపిరాడడం లేదేమోనని మృదులకు చిన్న సందేహం వచ్చింది. ‘‘చంటిపిల్లలు ఉయ్యాల తొట్టికంటే చీర ఉయ్యాలనే ఇష్టపడతారు’’ అంటూ మృదుల సందేహాన్ని కొట్టి పారేసింది అత్తగారు.ఆమెతో వాదించడం ఎందుకులే అనుకుంటూ మృదుల పాపాయి ఒంటిని తడిమి చూసి మళ్లీ పడుకోబెట్టింది. పాపాయి ఒంటికి తరచూ ర్యాష్ వస్తోంది. డాక్టర్ ఇచ్చిన క్రీమ్‌లు రాసినప్పుడు తగ్గుతున్నాయి. మరో రెండురోజులకే మరోచోట పుట్టుకొస్తున్నాయి. పాపాయి పుట్టినప్పుడు ఏ కంప్లయింటూ లేకుండా హెల్దీగానే ఉంది. నెలలు నిండేకొద్దీ ఒక్కో సమస్య బయటపడుతోంది. ప్రకృతికి దూరమయ్యాం చంటిపిల్లలు చీర ఉయ్యాలను ఇష్టపడే మాట నిజమే. అయితే ఆ చీర ఉయ్యాల వేయాల్సింది కాటన్చీరతో మాత్రమే. సింథటిక్ క్లాత్ నుంచి గాలి ప్రసరించదు. సింథటిక్ క్లాత్‌తో ఉయ్యాల కట్టి పాపాయిని పడుకోబెడితే ఊపిరాడక ఏడుస్తారు. ఉయ్యాలకే కాదు, పాపాయి పక్కదుస్తులు కూడా మెత్తటి కాటన్‌వే వాడాలి. నేచురల్ కలర్స్ అద్దినవైతేనే ఆరోగ్యం. రసాయనిక రంగుల గాఢత వల్ల పసిఒళ్లు దద్దుర్లు తేలుతుంది. ఆర్గానిక్ కలర్స్ (సహజమైనవి)తో తయారైన పక్క దుస్తులకు వాడడం సాధ్యం కాకపోతే కనీసం తెల్లటి పక్కదుస్తులను వాడడం మంచిది. కృత్రిమత్వం కలిగించే హాని చంటిబిడ్డల మీద వెంటనే ప్రతిఫలిస్తుంది. చంటిపిల్లలలో ఎక్కువమంది ఆస్త్మా బారిన పడడానికి కూడా కెమికల్ కలర్సే ప్రధాన కారణం. పెద్దవాళ్లలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృత్రిమత్వపు ప్రతికూలతలు కొన్ని దశాబ్దాల తర్వాత గానీ బయటపడవు. మనిషి ప్రకృతికి దూరంగా పరుగులు తీస్తున్న ఫలితమే ఇదంతా అంటారు ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త పురుషోత్తమరెడ్డి. ‘‘సింథటిక్ ఫ్యాబ్రిక్, సింథటిక్ కలర్స్... మన ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా హాని చేస్తాయి. ఫ్యాబ్రిక్‌కు సింథటిక్ డై వేసేటప్పుడు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ యథేచ్ఛగా జరిగిపోతాయి. ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిని కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అరవై ఏళ్ల క్రితం మనదేశంలో సింథటిక్ కలర్స్ ఊసే లేదు, దుస్తులన్నీ నాచురల్ ఫైబర్‌తో నేచురల్ కలర్స్‌తో తయారైనవే ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వేగంగా జరిగిన పారిశ్రామికీకరణలో ఆర్గానిక్ ఉత్పత్తులకు బదులు రసాయన రంగులు, రసాయన ఉత్పత్తుల వాడకం పెరిగింది’’ అన్నారాయన. సహజమే సురక్షితం సహజమైన రంగులపై మన దేశంలో చైతన్యం తక్కువే. చేనేతను పరిరక్షించే ప్రయత్నం మాత్రం కొంత వరకు జరుగుతోంది. అంతే తప్ప సింథటిక్ వాడకాన్ని తగ్గించడం లేదు. యూరోపియన్లు మాన్‌మేడ్ ఫైబర్‌ను, మాన్‌మేడ్ కలర్స్‌ను స్వచ్ఛందంగా నిషేధిస్తున్నారు. సింథటిక్ రంగుల దుస్తులు వాడితే స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశముందని నిర్థారణ అయినప్పటి నుంచి వారి చూపు సహజరంగుల మీదకు మళ్లింది. నాచురల్ కలర్స్ వాడకం రోజురోజుకూ ఎక్కువవుతోందక్కడ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘నేచురల్ ఫైబర్‌ను, నేచురల్ కలర్స్‌నే వాడుదాం. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే స్లోగన్‌తో ఏ ఉద్యమమో పుట్టుకు రావాల్సిన పని లేదు. ఎవరికి వాళ్లం ఆచరిస్తే చాలు. ప్రకృతి, పర్యావరణం సమతులంగా ఉన్నప్పుడే మన జీవిక కూడా సమతుల్యంగా ఉంటుంది. అప్పుడు పాపాయి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ నూలుచీర ఉయ్యాలలో తల్లి పొత్తిళ్లలో ఉన్నంత హాయిగా నిద్రపోతుంది. బిడ్డతో పాటు బిడ్డ జనరేషన్ కూడా పర్యావరణహితంగా ఎదుగుతుంది. – వాకా మంజులారెడ్డి ఫ్యాక్టరీ దారం మనకు మార్కెట్లో దొరికే దుస్తుల్లో చాలా మటుకు కృత్రిమమైనవే. ఈ దుస్తుల్లో వాడే సింథటిక్ దారం... పొలంలో పండిన దారం కాదు. ఫ్యాక్టరీలలో రసాయనాల సమ్మేళనంతో చిక్కటి ద్రవాన్ని తయారు చేసి సన్నని చిల్లులున్న జల్లెడ నుంచి బయటకు తీస్తారు. ఇది గాలికి ఆరి సన్నని దారమవుతుంది. ఇలా తయారైన దారాలకు రంగులు కూడా రసాయనాలతో తయారైనవే అద్దుతారు. మనం మోజు పడి కొనుక్కునేది వీటినే. మెషినరీ మీద నడిచే టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి అయినప్పటి నుంచి ఆ పోటీ తట్టుకోలేక పత్తి, ఉన్ని నుంచి తయారైన నేచురల్ ఫైబర్‌కు కూడా కృత్రిమ రంగులనే వాడుతున్నారు. కంచి, ధర్మవరం వంటి బాగా పేరుమోసిన చేనేతల్లో మాత్రం సహజరంగులనే వాడుతున్నారు. మన రాష్ట్రంలో కలంకారీ అద్దకం పూర్తిగా సహజరంగుల సమ్మేళనంగా ఉండేది. ఇప్పుడు అందులో కూడా కొందరు కెమికల్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. నేచురల్ కలర్స్ ఖర్చు ఎక్కువ, దాంతో ఆ దుస్తుల ధర కూడా ఎక్కువగానే ఉంటోంది. మనకు సాధ్యమే నాచురల్ కలర్స్‌ను కాటన్ వంటి నాచురల్ ఫ్యాబ్రిక్స్‌కు మాత్రమే కాక నైలాన్, పాలియెస్టర్ వంటి ఫ్యాబ్రిక్‌లకు కూడా వాడవచ్చు. వీటి ధర నాచురల్ ఫైబర్‌కు నాచురల్ కలర్స్ వాడిన వాటి కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు సహజమైన రంగుల వాడకం క్రమంగా పెరుగుతోంది. వీటి ప్రాముఖ్యత తెలిస్తే బడ్జెట్ చూసుకుని ఖర్చు చేసే మధ్య తరగతి మహిళ కూడా సింథటిక్ కలర్ చీరలు రెండు కొనే బదులు ఒక్కటైనా సరే నాచురల్ కలర్స్ చీరనే కొంటుంది. సహజమైన ఫ్యాబ్రిక్స్ సహజ రంగుల తయారీలో చెట్ల ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు, వేళ్లు అన్నీ వాడతారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రంగునిస్తాయి. వీటితో తయారైన దుస్తులు వేసుకుంటే ఏ దుష్ప్రభావాలూ రావు. పైగా వాతావరణం కలుషితం కాదు. మన దేశంలో దాదాపుగా ప్రతిరాష్ట్రంలో సహజరంగులతో తయారయ్యే ఫ్యాబ్రిక్స్ అందుబాటులోఉన్నాయి. రాజస్థాన్‌లోనే వేల యూనిట్లున్నాయి. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ, హ్యూమన్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్. ప్రకృతిని సవాల్ చేయొద్దు మనది కలర్‌ఫుల్ కంట్రీ. ప్రకృతి ప్రధానమైన జీవనం సాగించే వాళ్లం. అడవిలో జీవించే వాళ్లు అడవిని తల్లిగానూ, నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్లు నదీమ తల్లి అని, సముద్రం మీద ఆధారపడి జీవించేవాళ్లు సముద్రాన్నే తల్లిగా పిలుచుకునే వాళ్లు. తల్లి అంటే పిల్లల అవసరాల మేరకు అన్నీ అందిస్తూ పోషించే ఒడి కనుకనే ఇలా పిలుచుకోవడం. మొదట్లో మనం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంటే పాశ్చాత్య దేశాలు ప్రకృతిని సవాల్ చేసేవి. పారిశ్రామిక విప్లవం, ప్రింటింగ్ ప్రెస్, కొత్త ఇన్వెన్షన్లు అన్నీ కలిసి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి.ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలన్న తపన వారిలో కనిపించేది. దాదాపుగా మూడువందల ఏళ్లకంటే ముందునుంచే వాళ్లు రసాయనాలతో మమేకమై జీవిస్తున్నారు. దాని పర్యవసానం కూడా ముందుగా అనుభవంలోకి వచ్చింది అక్కడే. 1960లలో అమెరికాలో ‘రేసెల్ కార్సన్’ అనే మహిళా శాస్త్రవేత్త డిడిటి ప్రభావాన్ని వివరిస్తూ రాసిన ‘ద సైలెంట్ స్ప్రింగ్’ ఆ దేశాల్లో విప్లవం తెచ్చింది. ఆ కదలికతోపాటు సింథటిక్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ కారణంగా స్కిన్ కేన్సర్ రావడం వంటి అనుభవాలతో ఇప్పుడు వారికి పర్యావరణహిత ఉత్పత్తుల మీద ఆసక్తి పెరిగింది. వాళ్ల అనుభవాల నుంచి మనమూ పాఠాలు నేర్చుకోవాలి. – డాక్టర్ పురుషోత్తమ రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త -
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
తెల్లవారు జామున ఒక చెట్టు కొమ్మల మీద పిచ్చుకలు కిచకిచలాడుతున్నాయి. మరో చెట్టు తొర్రలో నుంచి పాలపిల్ల కువకువలాడుతోంది. సూర్యుడు నేలను చూడడానికి చెట్ల ఆకుల మధ్య నుంచి దారులు వెతుక్కుంటున్నాడు! ఇదేమీ చీమలు దూరని చిట్టడవి వర్ణన కాదు, కాకులు దూరని కారడవి వర్ణన కూడా కాదు. ఒక ప్రొఫెసర్ విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదేశం. ఏళ్లుగా కరెంటే లేని నివాసం. మహారాష్ట్రలోని పుణె నగరంలో ఉంది బుధవారపేట. పెద్ద వ్యాపార కేంద్రం అది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ గూడ్స్ మార్కెట్‌కు ప్రసిద్ధి బుధవారపేట. ఆ బుధవారపేటలోనే ఉంది కరెంట్ లేని ఓ ఇల్లు. అది ఇల్లంటే ఇల్లు కాదు తోటంటే తోటా కాదు. చిన్న అడవిని తలపించే ప్రదేశం. అందులో ఎప్పుడైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లున్న ఓ కట్టడం. అందులో ఒంటరిగా నివసించే ప్రొఫెసర్ పేరు డాక్టర్ హేమా సనే. బాటనీ ప్రొఫెసర్‌గా రిటైరయ్యారామె. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే హేమ కరెంట్ దీపాలు వెలిగిస్తే పక్షులకు అసౌకర్యం కలుగుతుందని కరెంట్ లేకుండానే జీవిస్తున్నారు. ఇప్పుడామెకి 79 ఏళ్లు. ‘‘కరెంట్ లేని రోజులను చూశాను, అప్పుడు కూడా హాయిగానే జీవించాను. ఇప్పుడూ అంతే. కరెంట్ సౌకర్యం కోసం పక్షులను ఇబ్బంది పెట్టలేను’’ అంటారామె. ఏది నాది? ‘‘తిండి, దుస్తులు, నీడ మాత్రమే మనిషికి కనీసవసరాలు. ఇక ఇతర అవసరాలేవీ తప్పని సరి కానే కాదు. నాకు ఈ మూడు కనీస అవసరాలు తీరుతున్నాయి. కరెంట్ లేని కారణంగా నాకు ఎదురవుతున్న అసౌకర్యం ఏమీ లేదు. నిద్రలేచేటప్పటికి పక్షుల కిలకిలరవాలు వినిపించకపోతే అసౌకర్యానికి లోనవుతాను తప్ప కరెంటు లేనందుకు కాదు. ఈ ప్రదేశాన్ని అమ్మేస్తే చాలా డబ్బు వస్తుందనే సలహాలు నాకు చాలా మందే ఇచ్చారు. ఈ నేల నా ఆస్థి కాదు. ఇక్కడ నాకు తోడుగా ఓ కుక్క, రెండు పిల్లులున్నాయి. వాటికి తోడు ఓ ముంగిస కూడా ఉంది. ఎన్నో రకాల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద లెక్కలేనన్ని పక్షులున్నాయి. వాటన్నింటి ఆస్తి ఇది. నేను వాటి బాధ్యత చూసుకునే సంరక్షకురాలిని మాత్రమే. ప్రకృతి భూమిని ఏర్పరచింది పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ జీవించడానికే తప్ప మనిషి విపరీతమైన ఆకాంక్షల కోసం ఛిన్నాభిన్నం చేయడానికి కాదు. నన్ను చాలా మంది ఫూల్ అంటుంటారు కూడా. వాళ్లలా అన్నంత మాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేను నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తున్నాను. ఎవరికీ హాని కలిగించని రీతిలో జీవిస్తున్నాను కాబట్టి ఎవరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు’’ అంటారు హేమ నిష్కర్షగా. నిత్యాన్వేషణ నడుము వంగిపోయిన వయసులో ఆమె రోజూ తన అడవిలాంటి తోటంతా తిరుగుతారు. ఆమె సామిత్రీఫూలే పూనె యూనివర్సిటీ నుంచి బాటనీలో పీహెచ్డీ చేశారు. పూనెలోని గర్వారే కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. వృక్షశాస్త్రం– పర్యావరణం అంశం మీద ఆమె రాసిన అనేక పుస్తకాలు ప్రచురితమయ్యాయి. తన ఒంటరి జీవితాన్ని వృక్షశాస్త్ర అధ్యయనానికే అంకితం చేసిన హేమ ఇప్పటికీ కొత్త పరిశీలనలను గ్రంథస్థం చేస్తున్నారు. ఆ తోట మొత్తంలో ఆమెకు పేరు తెలియని పక్షి కానీ, చెట్టు కానీ లేవు. ప్రతి మొక్క, చెట్టు సైంటిఫిక్ నేమ్‌తో దాని లక్షణాలను వివరిస్తారు. ఇలాంటి విలక్షమైన జీవనశైలి ద్వారా సమాజానికి ఎటువంటి సందేశమూ ఇవ్వడం లేదని కూడా అంటారు డాక్టర్ హేమాసనే. అయితే అలా అడిగిన వాళ్లకు... ‘నీ జీవితంలో నీవు నడవాల్సిన దారిని నువ్వే అన్వేషించుకో’ అనే బుద్ధుని సూక్తిని ఉదహరిస్తారామె. – మంజీర -
ప్రేమికుడు
కూనిరాగం తీసుకుంటూ సతురా ఇంటి దారి పట్టాడు. సూర్యుడు అస్తమించనున్నాడు. అతను అనంతపూర్ వెళ్లి వస్తూ, తను ఉంటున్న ఊరికి మరీ దూరంగా లేడు. కేవలం ఆరు మైళ్లే ఇంకా నడవాల్సి ఉంది. ఝండ సాహి చేరుకుంటాడు. ఆహార పదార్థాలు గాని, ఇతర వస్తువులు గాని ఆ ఊరి వారికి దూరంగా ఉన్న బంధుగణానికి తీసుకెళ్లి అందజేస్తూ ఉంటాడు. ఆ సేవలకుగాను వారు ఇతడికి తృణమో పణమో ముట్టజెబుతూ ఉంటారు. అదే మహద్భాగ్యంగా భావిస్తుంటాడు. గత పదిహేనేళ్లుగా సతురా ఈ పనినే వృత్తిగా చేసుకున్నాడు. నిజానికి ఈ వృత్తి వల్ల ఆ ఊరి జనం అందరికీ ఇతను ప్రీతపాత్రుడయ్యాడు. చిల్లరపనుల విషయంలో కేంద్రబిందువు అయ్యాడు. సతురా ఆ ఊరి వారికీ వారి బంధువులకూ మధ్య వారధిలాంటి వాడు. అమాయకుడు, మృదుభాషి. ఏ చిన్న పనికైనా ముందుంటాడు. నమ్మకస్తుడు, బోళాశంకరుడు. ఎవరు ముందు పిలిస్తే వారి పనిని ముందు చేసి పెడతాడు.దుర్గాపూజ, హోలీ వంటి పండుగ సందర్భాల్లో అతడికి మంచి గిరాకీ ఉంటుంది. అందరూ తమ పిండివంటలూ, పళ్లూ బంధుమిత్రులకు అందించమని పురమాయిస్తుంటారు. వారి అభ్యర్థనలతో అతడు ఉక్కిరిబిక్కిరై మహదానందపడిపోతూ ఉంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ఊరి వారందరికీ తలలో నాలుకలా ఉంటాడు. సతురా ఆ ఊరి వారి బంధువులకు చిరపరిచయస్తుడు. అతడు వారిని మెచ్చుకునే విధానం కూడా అభూత కల్పనలా ఉంటుంది. ‘‘అయ్యా! ఫలానా మీ బంధువు చాలా గొప్ప మంచిమనసు గలవాడయ్యా! నాకు పిండివంటలతోనూ పదిరకాల కూరలతోనూ భోజనం పెట్టాడు. నిజంగా వారి ఇంటికి వెళ్లటం నా పూర్వజన్మ సుకృతం..’’ ఇలా సాగుతుంది అతడి వర్ణన.సతురాకు నలభయ్యేళ్లుంటాయి. పొట్టిగా త్వరగా కదులుతూ ఉంటాడు. అతడి కంఠస్వరం కొంచెం బొంగురుగా ఉంటుంది. జనం అతడిని మందమతిగా పరిగణిస్తుంటారు. మెతకతనం వల్ల చాలాసార్లు ఇబ్బందుల్లో ఇరుక్కుంటుంటాడు. కాని మంచితనంతో చాకచక్యంగా బయటపడుతూ ఉంటాడు. ఎంత దూరం, ఏ ప్రాంతం వెళ్లినా తనను పంపించిన వారిని కూడా గొప్ప అతిశయోక్తులతో స్తోత్రం చెయ్యడం మరచిపోడు. గత పదిహేనేళ్లుగా ఆ ఊరి ప్రజలందరికీ ఎంతో చేరువగా ఉన్నాడు. కాని వారెవరికీ అతడి గత జీవితం గురించి ఏమీ తెలియదు. అతడి స్వభావం కూడా లోపల్లోపల అతత్యంత గంభీరమైనది. ఎవరికీ అంతు చిక్కనిది, చొరశక్యం కానిది. ఎవరూ అతడి వ్యక్తిగత వివరాల జోలికెళ్లరు. ఒకవేళ అతడి కుటుంబ గురించి ఎవరైనా ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పలేక తడబడిపోతుంటాడు. అతనిలో ఒక శూన్యం ఆవరించినట్లవుతుంది. కళ్లలో నీరు ఉప్పొంగి చెక్కిళ్ల మీదుగా ప్రవహిస్తుంది. ఎదుటివారికి దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆ స్థితిలో ప్రశ్నించిన వారే సతురా పట్ల సానుభూతి చూపిస్తారు. అంతలోనే అతడు అక్కడి నుంచి ఖిన్నవదనంతో, విషాదమైన చూపులతో నిష్క్రమిస్తాడు.సతురా స్వగ్రామం సునాపూర్. పదిహేనేళ్ల కిందట సొంత ఊరినీ ఇంటినీ బంధువులనీ విడిచి వచ్చేశాడు. సునాపూర్‌లో అతడిది ప్రధాన్ కుటుంబం. మంచి స్థితిపరులూ మర్యాదస్తులూ కావడం వల్ల ఆ ఊర్లో అందరూ వారిని గౌరవంగా చూస్తారు. అతడి తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సాంతియా, చిన్నవాడు సతురా. ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పెళ్లయి అత్తవారింటికి వెళ్లింది. కుమార్తెకూ సాంతియాకూ పెళ్లి చెయ్యడానికి ముసలాయన బాగా అప్పులు చేశాడు. కాని తన మరణానికి ముందే అప్పులన్నీ తీర్చేశాడు. కొడుకులిద్దరికీ కలిపి ఒక ఎనిమిదెకరాల మాగాణి భూమి మిగిల్చిపోయాడు. తండ్రి చనిపోయాక అన్ననూ వదినెనూ సతురా భయభక్తులతో చూసుకునేవాడు. తల్లిదండ్రులుగానే భావించేవాడు. వారి మాటను ఏనాడూ జవదాటి ఎరుగడు. వదినెకు కూడా పిల్లలు కలగలేదు. కాబట్టి ఆమె మరిదిని గారాబంగా చూసుకునేది. తండ్రి చనిపోయిన ఏడాది తర్వాత సతురాకు పెళ్లయింది. ఆమె అద్భుత సౌందర్యరాశి. కాబట్టి కొద్ది కాలంలోనే అందరి మన్ననలూ పొందింది. అందరి మనసులనూ గెలుచుకుంది. కాని ఆశ్చర్యకరంగా పెళ్లయిన నెలరోజులకే ఆమె కన్నవారింటికి చేరుకుంది. ఆమె తన వారందరితోనూ భర్త తన పట్ల సుముఖంగా లేడని చెప్పడం ప్రారంభించింది. అతడికి అన్నా వదినెలే ప్రాణమని, భార్యను పట్టించుకునే పోకడే లేదని ప్రచారం చేసింది. సూటిగా చెప్పాలంటే సతురాతో కాపురం చెయ్యడానికి ఆమె తిరస్కరించింది. అతడితో ఉండటం కన్నా చావే నయమని తేల్చి చెప్పింది. అప్పటి నుంచి సతురా ప్రపంచం తల్లకిందులైంది. హాయిగా సాగే అతడి జీవనస్రవంతి కల్లోల సముద్రంగా మారిపోయింది. ఆరునెలల తర్వాత సతురా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వధువు తులసి, అనుకూలంగానే ఉండేది. ఒక నూతనోత్తేజంతో జీవితంలో ఒక అధ్యాయాన్ని ప్రారంభించాడు. బతుకు గులాబీల బాటగా మారింది.కాని పెళ్లయిన నాలుగు నెలల తర్వాత సంసార జీవితంలో మరో విస్ఫోటం జరిగింది.ఒకరోజు మొక్కజొన్న తోటలో బాగా శ్రమించిన సతురా ఇంటికి చేరాడు. అప్పటికే అతడు అలసి హారతి కర్పూరమైపోయాడు. మిట్టమధ్యాహ్నం. పశువులశాలలో గెడ్డపారను విడిచిపెట్టాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. మధ్య ద్వారాన్ని దాటి వెళ్లబోతున్నాడు. తన అన్న గది తలుపులు వేసి ఉండటాన్ని గమనించాడు. అప్పటికే వదినె తన కన్నవారింటికి వెళ్లి ఉంది.లోపలి నుంచి గుసగుసలు వినపడుతున్నాయి. ఒక గొంతు అన్నది, రెండో గొంతు తన భార్య తులసిది. ఒక్కసారిగా అవాక్కయి ఆగిపోయాడు. హతాశుడైపోయాడు. తల తిరగడం మొదలుపెట్టింది.‘‘నీకేమీ భయం లేదు. ఈ సంపదంతా నాదే. ఈ ఇల్లూ ఈ ఆస్తీ అన్నీ నావే. ఆ ఆడంగి వెధవ ఊరు వదిలి పోయేట్టు చేస్తాను’’ తన అన్న తన భార్య తులసితో అంటున్నాడు. ‘‘మనిద్దరి ఈ సంబంధం అతడికి తెలిస్తే?’’ తులసి అనుమానం వ్యక్తం చేస్తోంది. ‘‘తెలీదు. ఆ శుద్ధ బుద్ధావతారానికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా నోరు మూసుకోక తప్పదు. లేకపోతే వాణ్ణి తంతాను.. లేక..’’‘‘లేక?’’ ఆమె అడుగుతోంది.‘‘నిద్రలో ఉండగా వాడి తల నరికేస్తాను. ఈ ఊర్లో నన్ను అడిగేవాడెవ్వడు?’’ తన అన్న స్పష్టంగా చెప్పాడు.సతురాకు ఆ కుట్రలోని తీవ్రత, ప్రమాదస్థాయి అర్థమయ్యాయి. అతడి వెన్నెముకలో భరించలేని భయోత్పాతం ఉప్పెనలా వచ్చింది. తన అన్న అన్నంత పనీ చేయగలడు. అన్న పట్ల సతురాకున్న గౌరవ భావం పటాపంచలైంది. కళ్లవెంబడి నీరు ప్రవహించింది.ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కట్టుబట్టలతో ఇల్లు విడిచి బయల్దేరాడు. మైళ్ల కొద్దీ ప్రయాణం చేశాడు. చివరికి ఈ ఝండసాహి గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ ఊరు అతడి స్వగ్రామం సునాపూర్ నుంచి ముప్పయి మైళ్ల దూరంలో ఉంటుంది. మధ్యలో కొండలూ వాగులూ ఉంటాయి. గత పదిహేనేళ్లుగా ఈ ఊళ్లోనే స్థిరపడిపోయాడు.గడుస్తున్న కాలం అతడి జుత్తు నెరిసిపోయేట్టు చేసింది. ఇల్లు వదిలిన నాటి నుంచి అన్నగాని, దగ్గరి బంధు మిత్రులుగాని సతురా గురించి విచారించలేదు.ఎక్కడున్నాడని వాకబు చెయ్యలేదు. అసలు పట్టించుకోనేలేదు. ఇదీ అతడి గతం.ఇప్పుడు సాయంకాలమైంది. సతురా ఊరి చివర ఉన్న తన నిరాడంబరమైన పూరిగుడిసెకు చేరుకున్నాడు.బరువులు భుజాన మోసే వెదురు కావడి బద్ద ఒక పక్కన చేరవేశాడు. లోపలి వైపు చూస్తూ ఇలా పిలిచాడు: ‘‘ఓయ్ ప్రియతమా! తలుపు తెరు. నేను పూర్తిగా అలసిపోయాను. ఎంత పని చేశానో తెలుసా? ఎన్ని ఊళ్లు తిరిగానో తెలుసా? వింటున్నావా?’’లోనుంచి జవాబు రాలేదు.కొంచెం ఆగి అతడే అన్నాడు: ‘‘ఎందుకు మాట్లాడవు? నీకేమైనా జ్వరంగా ఉందా? అయ్యో! నడిచి నడిచి నొప్పెడుతున్న నా మోకాళ్లను మర్దన చేస్తావనుకున్నానే? పోనీలే నీకు ఒంట్లో బాగాలేదు కనుక మరి నేను అరవను.’’తలుపు తాళం తీసి లోనికి ప్రవేశించాడు. దీపాన్ని ముట్టించాడు. తన సంచిలోంచి నాలుగు మట్టి గాజులు తీశాడు. సంతోషంతో ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు: ‘‘చూడు! ఈ గాజులెంత నాజూకుగా ఉన్నాయో! నీకు నచ్చాయా లేదా? చెప్పు మరి. నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అరె! ఎందుకు మాట్లాడవు? ఓహో! జ్వరంగా ఉండి మాట్లాడలేకపోతున్నావా? సరేలే! మరి నిన్ను ఇబ్బంది పెట్టను. నీరు తేవాలి. పొయ్యి ముట్టించాలి. ఆ తర్వాత నీ సంగతి చూస్తాను. ముందు ఈ గాజులు నీ చేతికి తొడుక్కో...’’సరిగా అదే సమయంలో నారీ మాస్టరు ఇంటి నుంచి అదేపనిగా పిలవసాగాడు: ‘సతురా! సతురా! ఓయ్ సతురా!’’చేతిలో ఒక మట్టి కుండతో సతురా గుడిసె బయటకు వచ్చాడు. ‘‘ఓయ్! సతురా! నీ రహస్యం ఈరోజే తెలిసింది. ఈ విషయం నాతో మాట మాత్రంగానైనా ఎప్పుడూ అనలేదు. పోనీలే. పెళ్లి చేసుకుని మంచి పనే చేశావు. ఇప్పుడు నువ్వు ఒంటరివాడివి కావు. నాకొక్క విషయం అర్థం కావడంలేదు. అసలు పెళ్లి ఎప్పుడు జరిగిందో చెప్పనేలేదు.’’ నారీ మాస్టరు అంటున్నాడు.సతురా అతని మాటలు జాగ్రత్తగా విన్నాడు. మౌనంగా తల దించుకున్నాడు. పూర్తి నిస్సహాయుడిగా నిలుచుండిపోయాడు.నారీ మాస్టరు ఊరుకోలేదు. మళ్లీ గుచ్చి గుచ్చి అడిగాడు:‘‘నా ప్రశ్నకు జవాబు చెప్పవేం? సతురా! పెళ్లెప్పుడు చేసుకున్నావు? చెప్పడానికి సిగ్గుపడుతున్నావా?’’ రెట్టిస్తున్నాడు.పొరుగునే ఉన్న బిసియా జెనా అనే ఆయన నారీ మాస్టరు వద్దకు వచ్చాడు. ‘‘ఏంటి విషయం?’’ అని అడిగాడు.‘‘ఏంలేదు బిసియా! సతురా పెళ్లి సంగతి.. అతడెప్పుడు పెళ్లి చేసుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతే. మరేమీ లేదు..’’‘‘మాస్టారూ! సతురా పెళ్లి చేసుకున్నాడని మీకెందుకనిపించింది?’’ బిసియా అడిగాడు.‘‘నేను ఇంటి బయటి నుంచి భార్యతో అతడి సంభాషణ విన్నాను. గాజులు తొడుక్కొమ్మంటున్నాడు. సుస్తీగా ఉన్నది కనుక వచ్చి సేవ చేస్తానని ఊరడిస్తున్నాడు. నిజంగా సంతోషకరమైన జంట.’’ నారీ మాస్టరు మెచ్చుకున్నాడు.సతురా బయట నిర్జీవంగా నిలుచున్నాడు. బిసియా ఇంటి లోపలికి ఆమెను చూడటానికి మాస్టర్ని తీసుకెళ్లాడు. అనారోగ్యంతో ఉన్నామోను మాస్టరు ఆసక్తి చూపలేదు. కాని బిసియా ఒత్తిడి చేశాడు. మాస్టరు అయిష్టంగానే అంగీకరించి వెళ్లాడు. సతురా బయటనే ఉండిపోయాడు.నారీ మాస్టరు అసుర సంధ్య, అర్ధకాంతిలో మంచం మీద దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ఆకృతిని చూశాడు. బిసియా దుప్పటి తొలగించాడు. ఆ దృశ్యాన్ని చూసి మాస్టరు అచేతనుడయ్యాడు. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. ఆ ఆకృతి స్త్రీ కానేకాదు. పల్లె రైతులు వ్యవసాయ సమయంలో వినియోగించే తాటాకు గొడుగు. మనిషి ఆకారంలో ఉన్నది. దుప్పటి కప్పడంతో మనిషి నిద్రపోతున్నట్టుంది. బయట సతురా వెక్కివెక్కి ఏడవడం మాస్టరుకు వినిపించింది. ఒక ఉద్వేగంతో మాస్టరు అతడిని నెమ్మదిగా పిలిచాడు. కాని సతురాని ఓదార్చడం సాధ్యం కాలేదు. పదిహేనేళ్ల కిందట అతని నిజ జీవితం కకావికలమైంది. ఇప్పుడు అతడు పదిలంగా కాపాడుకుంటున్న కల్పనాలోకం కూడా ఇతరులకు తేటతెల్లమై ఛిన్నాభిన్నమైంది. నారీ మాస్టరు సునాపూర్‌లో గర్భవతిగా ఉన్న తన కుమార్తెకు పిండివంటలు అందచెయ్యవలసిందిగా సతురాని కోరాడు. సతురా ఇల్లు వదిలిన తర్వాత ఆ ఊరివైపు చూడలేదు. అతనికి భార్య తులసి తలపులు దెయ్యంలాగ వెంటాడుతున్నాయి. ఆమె తన అన్నతో అన్న మాటలు గుండె మీద సుత్తితో కొడుతున్నట్టే ఉన్నాయి. అయిష్టంగానే సునాపూర్ వెళ్లడానికి అంగీకరించాడు. ఊరు చేరే సరికి సాయంకాలమైంది. గ్రామం అతడిని సాదరంగా ఆహ్వానించలేదు. తను పుట్టి పెరిగిన ప్రదేశంలో ఈరోజు అతడికి గుర్తింపు లేదు. సగం మనస్సుతో ఏదో అంతర్మథనంతోనే ఆ ఊళ్లో అడుగుపెట్టాడు. ఆకస్మికమైన సతురా రాక ఆ గ్రామస్తులకు చర్చనీయాంశమైంది. ఎన్నో ప్రశ్నలు వేశారు.అతని అన్నకూ భార్యకూ గల వ్యవహారం అందరికీ తెలుసుననీ, అందుకే చంపించి ఉంటాడని అనుకున్నామనీ చెప్పారు. ఇంకా చాలా చెప్పారు. సతురా అందరి మాటలనూ ఓపికగా వింటూనే నారీ మాస్టరు కుమార్తె ఇంటికి నేరుగా చేరుకున్నాడు. ఆ ఇంటి ముసలామె కబుర్లు వినడంలో మునిగిపోయాడు. ఆమె చాలా అంశాలను స్పృశించింది.సాంతియా తులసిని ఏవిధంగా ఉంపుడుగత్తెగా చేసుకున్నదీ, సతురాను అన్న చంపించినట్లు ఊళ్లో పుకార్లను గురించి చెప్పింది. సాంతియా ఇద్దరు భార్యలతో తొమ్మండుగురు సంతానాన్ని కనడాన్ని గ్రామస్తులు చీదరించుకున్నారని వివరించింది. మూడు సంవత్సరాల కిందటే చివరి బిడ్డను ప్రసవించలేక తులసి చనిపోయిందని సమాచారమిచ్చింది. ముసలామె ఇంకా చెప్పసాగింది: సతురా ఇల్లు వదిలిన తర్వాత పరిస్థితులు దిగజారిపోయాయి. సాంతియా వాతరోగంతో మంచం పట్టాడు. ఇద్దరు భార్యలూ ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్లు. వరదలూ కరువుల వల్ల నష్టం వాటిల్లింది. గంపెడు కుటుంబాన్ని పోషించడానికి సాంతియా అప్పుల్లో కూరుకుపోయాడు. కొంత భూమినీ అమ్మివేశాడు. ఒకప్పటి ప్రధాన్ కుటుంబం ఇప్పుడు సర్వనాశనమైంది.సతురా ఈ విషయాలన్నీ రెప్పవెయ్యకుండా విన్నాడు. నిజానికి అతడికి ఇక్కడి ఈ అంశాలపైన ఏమాత్రం ఆసక్తి లేదు. కాని అన్న ఆరోగ్యస్థితి తెలిసిన తర్వాత అతడి కోపమంతా చల్లారిపోయింది. అతడిని కలుసుకోవడానికి పరుగెత్తాడు.సాంతియా ఏడుస్తూ సతురాను ఆలింగనం చేసుకున్నాడు. ‘‘తమ్ముడా! నేను మహాపాపిని. నిన్ను నేనే చంపించానని జనం ఆడిపోసుకున్నారు. ఇంతకాలం ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? చెప్పు.’’సతురా మాట లేకుండా నిలుచున్నాడు.వదినె కూడా ఎంతో ఆర్ద్రతతో స్వాగతించింది. గద్గద స్వరంతో పిల్లల దయనీయ స్థితిని వివరించింది. సతురా ఒక్క క్షణం గతాన్ని మరచిపోయి విలపించాడు. ఆ స్థితిలో సతురా వెంటనే ఝండాసాహికి తిరుగుముఖం పట్టలేకపోయాడు. అక్కడే ఉండిపోయాడు. అన్నకు మంచి వైద్యం ఏర్పాడు చేశాడు. మిగిలి ఉన్న భూమి వ్యవసాయ పనులు తనే చేపట్టాడు. కాని ఒక్కోసారి చెప్పుకోలేని వేదనని అనుభవించేవాడు. తనకంటూ ఏమీలేని ఒక శూన్యం అతడిని బాధించేది. తులసి పిల్లల పట్ల ప్రేమకన్నా ద్వేషమే ఎక్కువ కలుగుతున్నది గ్రహించాడు. ఒక్కోరోజు రాత్రి ఒంటరితనపు యాతనతో అతడు తల్లడిల్లిపోయేవాడు. గుండెలో చెలరేగిన అలజడి వల్ల అతడికి నిద్ర పట్టేదికాదు. పరుపు మీద ప్రాణమున్న దుంగలా దొర్లేవాడు. ఈ విధమైన అశాంతితో కొద్దిరోజులు గడిపాడు. సాంతియాకు అంచెలంచెలుగా నయమైంది. ఇప్పుడు తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు.సతురా నిద్రలేని కళ్లను చూసి ఒకరోజు వదినె అడిగింది. ‘‘మరిదీ! నువ్వు బాధపడుతున్నట్టుగానూ నిద్రలేమితో ఇబ్బందిపడుతున్నట్టుగానూ ఉంది. ఎందుకలా ఉన్నావు? ఝండసాహిలో నీ భార్య వదిలి వచ్చినందువల్లనేనా? చెప్పవయ్యా!’’సతురా పెదాలపై ఒక నిర్జీవమైన నవ్వు కదలాడింది. ఆ మరుసటి రోజు అతడు వరిపొలంలో తన పనులన్నీ ముగించుకున్నాడు. తన వెదురు కావడి బద్దను అందుకుని భుజాన వేసుకున్నాడు. బయల్దేరబోతుంటే సాంతియా అడిగాడు: ‘‘సతురా! ఎక్కడికెళుతున్నావు?’’‘‘ఝండాసాహి’’‘‘ఎందుకు?’’సతురా సమాధానం చెప్పలేదు. నిజానికి అతని వద్ద సమాధానం లేదు. చలనం లేకుండా నిలుచున్నాడు. సాంతియా, అతడి భార్య విచారించారు. వారించారు. పిల్లలు కూడా వారి పినతండ్రి చేతులు పట్టుకున్నారు.సతురా వారికి భరోసా ఇచ్చాడు. ‘‘విచారించవద్దు. నేను తిరిగి వస్తాను. నేనిప్పుడు నారీ మాస్టరును కలవాలి. ఆయన పని మీదనే నేనిక్కడికి వచ్చాను. తిరిగి సరైన సమయంలో వెళ్లకపోతే అతడు ఆందోళన చెందుతాడు. ఇప్పుడు మాత్రం వెళ్లక తప్పదు. ఆమె కూడా జ్వరంతో బాధపడుతోంది.’’ ‘‘ఎవరామె? జ్వరంతో బాధపడుతున్నదెవరు?’’ వదినే అడిగింది.సతురా జవాబు చెప్పలేదు.‘‘అయ్యో! ఆమె బాధపడుతోంది. నన్ను వెళ్లనివ్వండి’’ అని మాత్రమే అనగలిగాడు.అన్నా వదినా మారు మాట్లాడలేకపోయారు.‘‘నేను వెళుతున్నాను. మరి సెలవు’’ సతురా వదిన పాదాల వద్ద వంగాడు.లేచి తటాలున బయటకు వచ్చాడు. త్వర త్వరగా అడుగులు వేశాడు. ఒడియా మూలం : రజనీకాంత మొహంతి అనువాదం: టి.షణ్ముఖరావు -
పచ్చని కాపురం
పెళ్లిని కొందరు హంగు ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే, మరికొందరు మంచి సందేశాన్ని ఇచ్చేదిగా తమ పెళ్లి ఉండాలనుకుంటారు. అయితే ఇటువంటి పచ్చటి వివాహాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ వివాహం అంతా అడుగడుగునా పాడి పంటలే, ప్రకృతి ఉత్పత్తులే! అలెప్పీ జిల్లా హరిపాద్ గ్రామానికి చెందిన వాణికి వ్యవసాయమంటే ప్రీతి. వ్యవసాయంలో డిగ్రీ సాధించడం కోసం పెద్ద పోరాటమే చేసింది. విజిత్‌కి మాత్రం భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. కెరీర్ గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ఇంట్లోవారి ఒత్తిడి మేరకు ఇంజినీరింగ్‌లో చేరిపోయాడు. అయితే విజిత్‌కి స్కూల్ రోజుల నుంచి ప్రకృతి మీద మక్కువ ఎక్కువ. పర్యావరణానికి సంబంధించిన క్యాంపులకు స్కూల్ తరఫున వెళ్లేవాడు. దానితో కాలేజీలో చేరాక ఈ ఇష్టం రెట్టింపయ్యింది. స్నేహితులతో కలిసి మొక్కలు నాటేవాడు, కాలేజీ క్యాంపస్‌లో కూడా మొక్కలకు అంట్లు కట్టేవాడు. ‘‘నేను నా జీవితంలో ఇద్దరిని ఎన్నటికీ మరచిపోలేను. శివప్రసాద్ సర్, మోహన్‌కుమార్ సర్. వీరిద్దరూ ఇప్పుడు లేరు. పర్యావరణ గురించి వారిద్దరూ మాకు బాగా అర్థమయ్యేలా చెప్పేవారు. వారి కారణంగా ఈ అంశంలో ఎన్నో విశేషాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి చదివాను. నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి వారే కారణం’’ అంటాడు విజిత్. తొలి పరిచయం క్యాంపులు జరుగుతున్న సమయంలోనే విజిత్, వాణిలు మొదటిసారిగా కలుసుకున్నారు. ఒక ప్రత్యేక కారణంగా ఇద్దరూ టచ్‌లో ఉండేవారు. మొక్కలు నాటే సమయం, విత్తనాలు నాటడం, అంట్లు కట్టడం సమయాలలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యంతో పాటు అనుబంధం ఏర్పడింది. ‘‘ఈ సందర్భంగానే వాణి నాకు చేరువైంది. చాలా చోట్ల ఇద్దరం కలిసి మొక్కలకు అంట్లు కట్టేవాళ్లం’’ అని గుర్తు చేసుకుంటాడు విజిత్. ఆ తర్వాత వాణి బి.ఎస్. (అగ్రికల్చర్) పూర్తి చేసింది త్రిచూర్‌లోని వాటర్‌షెడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఉద్యోగం వచ్చింది. విజిత్ అదానీలోని ఎలక్ట్రిసిటీ బోర్డులో సబ్‌స్టేషన్ ఆపరేటర్‌గా చేరాడు. తరచుగా వారు క్యాంపులలో కలుస్తుండడం వల్ల వాళ్ల బంధం పటిష్టమయింది. వాణి విజిత్లు పాండిచేరి విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సి. ఇకాలజీ చేయాలనుకున్నారు. ‘‘అయితే అనుకోకుండా వాణి తండ్రికి అనారోగ్యం చేయడంతో.. వాణి కాలేజీ మానేసి.. తల్లిదండ్రులను, నాయనమ్మను చూసుకోవాలసి వచ్చింది. వాణి కుటుంబంలో అందరికీ వ్యవసాయానికి సంబంధించిన పరిజ్ఞానం మాత్రమే కాదు ఆయుర్వేద మూలికల గురించి కూడా తెలుసు. అందువల్ల వారికి సేవలు చేస్తూనే ఆమె తమ సొంత పొలంలోనే వ్యవసాయం చేయడం ప్రారంభించింది’’ అని తెలిపాడు విజిత్. వాణితో పాటు అతడు కూడా ఆ కోర్సుకి స్వస్తి పలికాడు. ఉమ్మడి వ్యవసాయం ఈ క్రమంలో కొందరు స్నేహితులతో కలిసి, నాలుగు ఎకరాల పొలంలో ఇద్దరూ వ్యవసాయం ప్రారంభించారు. వాణి వ్యవసాయ సలహాలు ఇచ్చేది. ‘‘ఇది నా జీవితానికి నాంది. వ్యవసాయం పట్ల నేను అంకితభావంతో పనిచేయడానికి తొలి అడుగు పడింది. కాలేజీ రోజులలో చేసిన విధంగానే మొక్కలు నాటటం ప్రారంభించాం’’ అంటాడు విజిత్. ఇద్దరూ సేంద్రియ ఎరువులతో, పర్యావరణ హాని జరగకుండా వ్యవసాయం చేశారు. ఇరుగుపొరుగు వారు రసాయన ఎరువులు వాడి పంట నష్టపోయారు. కానీ వీరి పంట మాత్రం కళకళలాడింది. పురుగు పట్టకుండా సహజ ఎరువులు ఉపయోగించారు. హైబ్రీడ్ విత్తనాలు కాకుండా సహజ విత్తనాలు ఉపయోగించి బెండ, బీన్స్, కంద, వంగ, అరటి, మామిడి వంటి రకరకాల పంటలు పండించారు. మొత్తం ఐదువేల చెట్లు మొక్కలను పెంచారు. అంతేకాదు వారి భూమిలోనే చిన్నచిన్నగా పది చెరువులు తవ్వించారు. ఇరుగుపొరుగు వారంతా వీరి దగ్గరే కూరగాయలు కొనడం ప్రారంభించారు. అంతేకాదు ఎవరికి కావలసినవి వారు కోసుకునే సౌకర్యం కల్పించారు వీరు. సేంద్రియ సంప్రదాయం అజిత్.. వాణితో అన్ని విషయాలు చర్చించేవారే కాని, ఏనాడూ వివాహం గురించి సీరియస్‌గా మాట్లాడుకోలేదు. వాణి స్వయంగా ప్రపోజ్ చేసినప్పుడు కానీ అతడు తన ప్రేమను వ్యక్తం చేసే సాహసం చేయలేకపోయాడు. అప్పుడే వివాహంతో పాటు, పెళ్లివిందు ఎలా ఏర్పాటు చేయాలా అని ఆలోచించారు. వారి ఆలోచన ఈ రోజుల్లో సాధారణమే కావచ్చు కాని, పది సంవత్సరాల క్రితం అది విలక్షణమైనదే. ఏమిటి విలక్షణం అంటే.. పెళ్లి పిలుపులు, పెళ్లి దుస్తులు, పెళ్లి పందిళ్లు, పెళ్లి వంటలు, పెళ్లి విందులు.. అన్నీ సహజమైన ప్రకృతి ఉత్పత్తులతో సంబంధం ఉండేలా చేయాలన్నది! అలాగే చేశారు అదర్శ దంపతులుగా నిలిచారు. – జయంతి -
మట్టి స్నానం..మహా ప్రక్షాళనం
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక పోకడలకు వంటబట్టించున్ననగరం.. ఆరోగ్యం, జీవనశైలి విషయాల్లోనూ పాతవిధానాన్నే అనుసరిస్తోంది. అత్యాధునిక, విలాసవంతమైన సదుపాయాలు, వెరైటీ ఆహార పదార్థాలు ఒకవైపు కట్టిపడేస్తున్నప్పటికీ చాలామంది నిరాడంబరమైన జీవన విధానం వైపే మొగ్గుచూపుతున్నారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబుటులోకి వచ్చినా దీర్ఘకాలిక రోగాలకు, అసలు రోగాలే రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంలే నగర వాసుల్లో అనూహ్యంగా ఆరోగ్య స్పృహ పెరిగింది. బిర్యానీలు, చికెన్ కబాబ్‌లు, పిజ్జాలు, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌ను ఇప్పుడిప్పుడే దూరం పెడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిరుధాన్యాల ఆహారం తప్పనిసరైంది. మధ్య తరగతి, ఆ పైవర్గాలే కాదు.. సాధారణ ప్రజలు సైతం తమ ఆహారంలో మార్పులు చేసుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే.. మరోవైపు వివిధ రకాల రుగ్మతల కోసం పొందే వైద్య చికిత్సల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అత్యవరమైతే తప్ప అల్లోపతిని ఆశ్రయించేందుకు విముఖత చూపుతున్నారు. ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. మధుమేహం, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, వివిధ రకాల చర్య వ్యాధులు, స్పాండిలైటిస్, సయాటికా వంటి జీవన శైలి వ్యాధులకు ప్రకృతి వైద్యాన్నేప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. ప్రకృతిలో వేస‘విహారం’.. నిప్పులు చెరిగే ఎండల నుంచి ఉపశమనాన్ని పొందేందుకు చాలా మంది చాలా రకాల పద్ధతులను ఎంపిక చేసుకుంటారు. ఆహార విహారాల్లో మార్పులు చేసుకుంటున్నారు. చల్లటి ప్రదేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతారు. కానీ వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొనేందుకు ఇప్పడు చాలామంది ప్రకృతి వైద్యం బాటలో నడుస్తున్నారు. అమీర్‌పేట్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రి కొద్ది రోజులుగా సందర్శకులు, రోగులతో కిటకిటలాడుతోంది. వారం నుంచి 15 రోజుల పాటు ప్రకృతి వైద్య చికిత్సలను పొందేందుకు జనం బారులు తీరుతున్నారు. ఇప్పటికే చిరుధాన్యాల బాట పట్టిన నగరవాసులు ఆ బాటలోనే ప్రకృతి వైద్యం వైపు సాగుతున్నారు. దీంతో 184 పడకలతో వైద్యసేవలను అందించే నేచర్‌క్యూర్ ఆస్పత్రి ప్రతిరోజు 30 నుంచి 40 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకొని ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు. మరో వంద మందికి పైగా ఆస్పత్రిని సందర్శించి ప్రకృతి వైద్యం గురించి తెలుసుకుంటున్నారు. ఏయే జబ్బులకు ఎలాంటి చికిత్సలు లభిస్తాయనే విషయంపై అవగాహన చేసుకుంటున్నారు. ప్రకృతి వైద్యంతో పాటు, యోగ, ప్రాణాయామపైనా ఆసక్తి చూపుతున్నారు. అమీర్‌పేట్‌లోని ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో అనేక రకాల జబ్బులకు చికిత్స చేస్తున్నారు. ఏసీ, నాన్ ఏసీ గదులు, కాటేజీలు, సాధారణ వార్డులు సైతం ఇక్కడ ఉన్నాయి. వ్యాధుల తీవ్రత మేరకు వారం నుంచి 15 రోజుల పాటు ఈ చికిత్సలు ఉంటాయి. అందుకు అనుగుణంగా రూ.5000 నుంచి రూ.25 వేల వరకు ఫీజులున్నాయి. మట్టి స్నానం..మహా ప్రక్షాళనం శరీరంలోని మలినాలన్నింటినీ తొలగించి, స్వేదగ్రంధులను విశాలం చేసి సరికొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని అందించే మట్టిస్నానం మరో ప్రత్యేకత. భూమిలో మూడు అడుగుల లోతు నుంచి సేకరించిన నల్లరేగడి మట్టిని ఈ చికిత్సకు ఉపయోగిస్తున్నారు. వంటి నిండా మట్టి పూసి అవసరమైన చోట మట్టి ప్యాచ్‌లు వేస్తారు. తర్వాత కనీసం 20 నిమిషాలు ఎండలో ఉంచుతారు. ‘మట్టిలోని పుష్కలమైన ఖనిజాలు శరీరానికి పటుత్వాన్ని, మృదుత్వాన్ని అందజేస్తాయని, శరీరం ప్రక్షాళనమవుతుంద’ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భవాని తెలిపారు. ఆహారం అమృతమయం ఎలాంటి మందులు, ఇంజెక్షన్లు, శస్త్ర చికిత్సలు లేని ప్రకృతి వైద్యవిధానంలో ఆహారమే పరమ ఔషధం. అందుకే శరీరంలోని విష పదార్థాలను తొలగించే సూర్యాహారం, అమృతాహారాన్ని ఈ వైద్యంలో అందజేస్తారు. ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు వంటివి సూర్యాహారంగా, పళ్లు, ఎండుఫలాలు, తేనె, చెరకురసం, బెల్లం అమృతాహారంగా అందజేస్తారు. చికిత్స అనంతరం దైనందిన జీవితంలో ఎలాంటి ఆహార నియమాలను అనుసరించాలనే దానిపై అవగాహన కల్పిస్తారు. ఎప్పుడు, ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలో తెలియజేసే యుక్తాహారం, మితాహారం పద్ధతులు కూడా ప్రకృతి చికిత్సలో భాగమే. వీటితో పాటు మర్ధన చికిత్సలు, అరిటాకు స్నానం, సూర్యచికిత్స, యోగ, ప్రాణాయామ, ఫిజియోథెరపీ వంటి వివిధ రకాల వైద్య,ఆరోగ్య పద్ధతులతో రోగికి స్వస్తత చేకూరుస్తున్నారు. -
కోయిల! వేప!మల్లి! మామిడి! ఎవరు గొప్ప?
కొత్తరాగమున కుహూకుహూమని మత్తిలి కోయిల కూయగా... కొమ్మలో కోయిలా కూయంటదే...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది...గున్నమామిడి కొమ్మమీద గూళ్లురెండున్నాయి... ఒక గూటిలోన రామచిలకుంది... ఒక గూటిలోని కోయిలుంది... కోయిల పాట బాగుందా... కొమ్మల సిరి బాగుందా... ఏవమ్మోయ్ కోయిలమ్మా! నీ మీద వచ్చిన పాటలు వింటూ కూర్చున్నావు. యేమంత మిడిసిపాటుతో నెల రోజుల ముందు నుంచే పాడటం ప్రారంభించావు. అంత గొప్పలు ఎందుకు నీకు? నువ్వు పాడటానికి ఓ సమయం సందర్భం లేదా...అంటూ మావి చిగురు కోకిలను ఎకసెక్కాలాడటం ప్రారంభించింది.బాగానే ఉంది నువ్వు చెప్పేది. నీ చిగుళ్లు ముందుగా రాబట్టే కదా నేను ముందుగా వాటిని తిని, గొంతు సవరించి, కుహూకుహూ అని కూయటం ప్రారంభించాను... అని గడుసుగా సమాధానం చెప్పింది కోకిల.నా చిగుళ్లు తింటేనేగా నీకు గొంతు అంత తియ్యగా స్వరం పలికేది. నేను చిగురించకపోతే నీ పాటకు తావెక్కడ. నా గొంతు తియ్యగా ఉందా. నీ చిగుళ్లు తియ్యగా ఉంటాయని ఎవరో చెప్పడంతో తిన్నాను. ఆ వగరుకి నాకు గొంతులో దురద వచ్చి, ఆ దురద పోగొట్టుకోవడానికి ఇలా అరుస్తున్నాను. అదే మీరంతా తీయని పాట అంటున్నారు. అంతేఅయితే ఆ ఘనత అంతా నాదే. నా వగరు చిగుళ్ల వల్లే నీకు తీయని కంఠస్వరం వచ్చింది. నీకు దురద పెడితే మాకెందుకు, దురద పెట్టకపోతే మాకెందుకు. ఇంతకీ మా సంగతి పక్కన పెట్టు, నువ్వు అంత ముందుగానే ఎందుకు పూత పూశావు. నీ అవసరం ఉన్న రోజు వచ్చేసరికి పూత కాస్తా పిందెలు అయిపోతావు. మమ్మల్ని అనే ముందు నిన్ను నువ్వు ఓ సారి చూసుకుని మమ్మల్ని వేపుకు తినకమ్మా వేప తల్లీ!నా సంగతి సరే. ఆ గున్నమామిడి సంగతి చూడండి... మిమ్మల్ని అనే హక్కు నాకు లేదు. అందుకే మౌనంగా ఉంటున్నాను. పిందెగా ఉండవలసిన నేను అప్పుడే కాయలు, పండ్ల రూపంలోకి మారిపోతున్నాను. ఇలా ఎందుకు జరుగుతోందంటావు చెరుకు తల్లీ!కాలమహిమ! ఋతువులకు అనుగుణంగా పంటలు పండే రోజులు మారిపోయాయి. పోనీలే... ముందు నుంచే మనల్ని రుచి చూస్తారు కదా. వాళ్లకి ఆనందం కలిగిస్తున్నాం కదా. కానీ ఈసారి నేను ఎందుకో అంత తియ్యగా ఉండేలా కనిపించట్లేదు. మన మల్లి తల్లి మాత్రం అప్పుడే పరిమళాలను ఘుమాయించేస్తోంది. గుభాళించి ఏం లాభం. ఒకప్పుడు నా పూలతో జడలు కుట్టించుకుని, అద్దం ముందు నిలబడి, ఫొటోలు తీయించుకోవడం చిన్నపిల్లలందరికీ ఒక సరదా. మరి ఇప్పుడో! అందరూ జుట్లు విరబోసుకునేవాళ్లు, పూలు పెట్టుకోవడానికి మొహమాట పడేవాళ్లూనూ. నాకు మాత్రం తాచుపాము జడలలో చుట్టలా చుట్టుకుని నల్లటి కురులలో తెల్లగా మెరవడం చాలా ఇష్టం. కనీసం కొందరైనా నన్ను అక్కున చేర్చుకుంటున్నారులే. అంతటితో తృప్తి చెందుతున్నాను.సరే మనలో మనం మాట్లాడుకుంటూ అసలు విషయం మర్చిపోయాను. ఈ రోజు మనందరం కలిసి ఒక విషయం గురించి చర్చించుకోవాలి. మన తెలుగువారి కొత్త సంవత్సరాదికి ఉగాది అని ఎందుకు పేరు పెట్టాలి. మనతోటే కదా ఉగాది వచ్చేది. కోయిల కూస్తేనే కదా వసంతం వచ్చేది. మామిడి, చెరకు, వేపపూత, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం కలిస్తేనే కదా పచ్చడి. మరి మనలో ఎవరో ఒకరి పేరు మీద ఈ పండుగను పిలుచుకోవచ్చుగా. ఆమని అంటారేకాని, కోమని అనచ్చుగా. కనీసం అందులో మన కోయిల పేరులోని మొదటి అక్షరమైనా ఉంటుంది. లేకపోతే ఆమిడి అనొచ్చు, వేపని అనొచ్చు, మల్లిమ అనొచ్చు. ఏదో ఒక పేరు పెట్టి మనల్ని గౌరవించుకోవచ్చు కదా. ఏదీ కాకుండా ఉగాది అని పేరు పెట్టారు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేనేమో. అందరి కంటె పెద్దదయిన మామిడి...మిత్రులారా! మీకొక విషయం చెబుతాను వినండి. ఈ పండుగకు కోయిల పేరు పెట్టామనుకోండి. మిగతా వారికి కోపం వస్తుంది. మనమందరం ప్రకృతి మాత సంతానం. మనలో ఏ ఒక్కరు అలిగినా ఆ తల్లికి బాధే కదా మరి. అందుకే ఆలోచించి, మనమెవ్వరం బాధపడకుండా ఈ పేరు పెట్టి ఉంటారు. అయినా ఉగాది అనే పేరు ఎంత బాగుందో కదా! ఇంకో విషయం కూడా ఆలోచించు. ఈ పండుగ ఆరు రుచులతో పాటు కోయిల, మల్లెల సమ్మేళనం. ఏ ఒక్కరికో సంబంధించినది కాదు కదా. అందుకే ఉగాది అయ్యింది. – డా. వైజయంతి పురాణపండ -
పురుగును చంపిన మనిషి!
ఒకపక్క కీచురాళ్ల రొద.. ఇంకోపక్క ఝుమ్మంటూ తూనీగలు.. పచ్చటి గరిక, గడ్డిలో ఎర్ర ఎర్రటి ఆరుద్రలు! చిమ్మచీకట్లో పచ్చటి వెలుగులు జిమ్ముతూ మిణుగురులు! వాన చినుకుకు తడిసిన మట్టిలోంచి ఆత్రంగా బయటకొస్తూ.. వానపాములు! అగ్గిపెట్టెల్లో దాచుకుని మురిసిపోయిన బంగారు పురుగులు పేడ పురుగులు.. ఉసిళ్లు...తేనెటీగలు..అబ్బో చెప్పుకుంటూ పోతే.. పురుగుల పేర్లు సహస్రం దాటేస్తాయి! కానీ.. ఇదంతా ఒకప్పటి మాట! ప్రకృతి గత వైభవం! పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొన్నేళ్లకు.. ఈ భూమ్మీద పురుగన్నది లేకుండా పోతుంది. సోవాట్.. పురుగుల్లేకపోతే మనకేమిటి నష్టం? ఈ భూమ్మీద ఉండే 700 కోట్లపై చిలుకు మనుషుల కంటే పురుగుపుట్ర బరువు 17 రెట్లు ఎక్కువ అని! సముద్రాలు, చెరువుల్లోని జలచరాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ క్రిమి కీటక సామ్రాజ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ విషయం చాలా కాలంగా వింటున్నదే అని అంటున్నారా.. అయితే ఇదిగో తాజా వార్త. కొన్ని దశాబ్దాల్లో ఉన్న కీటకాల్లో కనీసం 40 శాతం కనిపించకుండా పోతాయని హెచ్చరిస్తోంది తాజా అధ్యయనం ఒకటి. బయలాజికల్ కన్సర్వేషన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ప్రమాదం ఒక్క తేనెటీగలకే పరిమితం కాలేదు.. సీతాకోకచిలుకలు, పేడ పురుగులు కూడా వినాశనం అంచుల్లో ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ఈ చిన్ని జీవాల పాత్రను గుర్తించకపోయినా.. కాపాడుకునే ప్రయత్నం చేయకపోయినా.. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదముందని స్పష్టం చేస్తోంది. గత 40 ఏళ్లలో జరిగిన 73 వేర్వేరు పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. భూమ్మీది మొత్తం పురుగుల బరువు ఏటా 2.5% చొప్పున తగ్గుతోందని.. అమెరికా సహ అనేక దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇది ప్రపంచ సమస్యే అన్నది సుస్పష్టం. కారణాలేమిటి? కీటక జాతుల నాశనానికి 4 కారణాలు ఉన్నా యని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందుగా చెప్పుకోవాల్సింది... ఆవాస ప్రాంతాల నష్టం. అడవులు, చెట్లు.. పచ్చిక బయళ్లు.. వంటివి తగ్గిపోవడం, భూములను వ్యవసాయానికి వాడుకోవడం ఎక్కువ కావడం వంటివన్న మాట. రెండో కారణం.. వ్యవసాయం లో కీటకనాశినుల వాడకం పెరగడం. శిలీంధ్రాల కోసం ఫంగిసైడ్, చిన్న చిన్న పురుగుల కోసం పెస్టిసైడ్స్, కీటకాల కోసం ఇన్సెక్టిసైడ్స్.. ఇలా వేర్వేరు పేర్లతో వాడుతున్న రసాయనాలు భూమిని.. పరిసరాల్లోని పురుగులను నాశనం చేసేశాయన్నది నిర్వివాద అంశం. ఇప్పటివరకూ నశించిపోయిన కీటకాల్లో 8 శాతం కీటకనాశినుల కారణంగానే అని అధ్యయనం చెబుతోంది. ఎరువులు, పారిశ్రామిక వ్యర్థాలు మూడో కారణమైతే.. మారిపోతున్న వాతావరణం ఇంకో కారణమని తేల్చింది. వీటితోపాటు.. ఇన్వెసివ్ స్పీషీస్ (ఇతర ప్రాంతాల్లోకి ప్రవేశించి.. సహజ శత్రువులు లేనికారణంగా విచ్చలవిడిగా పెరిగే జీవజాతులు), పరాన్నజీవులు, వ్యాధులూ కీటకాల సంతతి తగ్గిపోయేందుకు దోహ దపడుతున్నాయి. మరి ఏం చేద్దాం? నశించిపోతున్న కీటకజాతిని రక్షించుకునేందుకు మనుకున్న సులువైన ఉపాయం సేంద్రీయ ఆహారం వాడకాన్ని ఎక్కువ చేయడమే. పరిసరాల్లో వీలైనన్ని ఎక్కువ జాతుల మొక్కలను పెంచితే.. అవి కాస్తా కీటకాలకు ఆవాసంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ వీటిఅవసరమేమిటి? కీటక జాతులు తగ్గిపోతుండటం పర్యావరణానికి జరుగుతు న్న నష్టానికి సూచిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. వానపాములనే తీసుకుంటే.. మట్టిని తిని అవి విడిచే వ్యర్థాలు భూమిని సారవంతం చేస్తాయి. వీటిమాట ఇలా ఉంటే.. మిగిలిన పురుగులు కీటకాలు.. ఆహార పిరమిడ్‌లో అట్టడుగున ఉంటూ.. మిగిలిన పక్షులు, జంతువులకు ఆహారంగా మారతాయి. పరపరాగ సంపర్కం ద్వారా పూల పుప్పొడిని, విత్తనాలను సుదూర ప్రాంతాలకు విస్తరించడంలోనూ వీటి పాత్ర చాలా ముఖ్యం. ఇలాంటి పర్యావరణపరమైన సేవలన్నింటికీ విలువ కడితే.. అది ఏటా కొన్ని కోటానుకోట్లకు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి కీలకమైన పురుగులు నాశనమైపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడం ఖాయం. కన్యా శాస్త్రవేత్త డినో మార్టిన్స్ మాటల్లో చెప్పాలంటే.. ‘కీటకాల్లేపోతే.. ఆహారమే లేదు... అంటే మనుషులే లేరు’. -
అపానాన్ని క్షయం చేసిన సాయి
ఎంతో ఎత్తుకి ఎక్కిన వ్యక్తికి ఎలా ఇదీ అదీ అనే భేదం లేకుండా అన్ని వస్తువులూ ప్రకృతిలో కనిపిస్తాయో, అలాగే తనదైన తపస్సు శక్తిలో ఎంత ఎత్తు సాధించాలో అంత ఎత్తుకీ ఎదిగిన సాయినాథునికి సర్వసిద్ధులూ లభించాయి. ఆ కారణం చేతనే పంచభూతాలు తనకి వశమయ్యాయి. తనకి వశమయ్యాయి కదా! అని శ్రీమద్రామాయాణంలో రావణునిలాగా ఆ పంచభూతాలకీ వ్యతిరేకదిశలో కాకుండా అనుకూల దిశలోనే సానుకూలంగా సాయి ప్రవర్తించాడు కాబట్టే, ధర్మబద్ధమైన ఆయన ప్రవర్తనకి అనుగుణంగా పంచభూతాలు ఆయనకి లోబడిపోయాయి. ఆ నేపథ్యంలో క్రమంగా పృథ్వి అప్ తేజస్సు అనేవి ఎలా లోబడ్డాయో ఉదాహరణపూర్వకంగా తెలుసుకున్నాక వాయువులోని ప్రాణవాయువు వశమైన తీరుని కూడా సోదాహరణంగా అర్థం చేసుకున్నాక అపానమనే వాయువు ఆయనకి ఎలా వశమయ్యిందీ తెలుసుకుందాం! ఈ వాయువు గొప్పదనం హృది ప్రాణో గుద్వేపానః సమానో నాభిసంస్థితః ఉదానః కంఠదేశస్థః వ్యాస స్పర్వశరీరగః అని శ్లోకం. హృదయంలో ఉండేది ప్రాణవాయువు. గుదంలో ఉండేది అపానవాయువు. కంఠంలో నిలిచి ఉండేది ఉదానవాయువు. నాభి(బొడ్డు)లో ఉండేది సమాన వాయువు. ఎక్కడ ఏ వాయుశాతం తగ్గిందో గమనించుకుంటూ ఆ వాయువు ఎంత పరిమాణంలో తగ్గిందో అంతనీ పూరించి – ఏ ప్రదేశంలో ఎంత వాయువుండాలో అంత స్థాయిలోనూ, అంత పరిమాణంలోనూ, ఆయా వాయువు ఉండేలా చేసే లక్షణమున్నదీ ప్రాణవాయువులాగా కంఠంలో మాత్రమే, సమానవాయువులాగా నాభిలోనే కాకుండా, శరీరం నిండుగా సంచరిస్తూనే ఉండేది వ్యానవాయువు అని ఈ శ్లోకానికర్థం. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా శ్మశానానికి దగ్గరగా, పెద్ద భవంతిలో ఉంటే అతడ్ని ఎలా తక్కువగా అనుకుంటారో ఆయన చిరునామా చెప్పబోయినా శ్మశానం దగ్గర.. అని ఎలా చెప్తారో అలాగే అపానమనే వాయువు ఎంతో గొప్పదే అయినా అది ఉండే ప్రదేశం గుదం అయిన కారణంగా దాన్ని తక్కువగా లెక్కిస్తారు. హేయంగా పరిగణిస్తారు. మరి నిజంగా ఇది నీచమూ, హేయమూ అయిన వాయువే అయిన పక్షంలో సర్వులూ ఆరాధించే పరమాత్మకి మహా నైవేద్యాన్ని పెట్టే సందర్భంలో కూడా ‘ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహా...’ అంటూ ఈ వాయువుని ఎందుకు చెప్తారు? ఈ తీరుగా ఆలోచించినప్పుడు మాత్రమే ఏది అపార్థమో మనకి అర్థమయ్యే అవకాశముంటుంది. అందుకే కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ‘పురాణవైర గ్రంథమాల’ అనే ఒక గ్రంథాన్ని రచించి పురాణాన్ని ఎలా వంకరదృష్టితో అనుమానిస్తూ దాని ‘లో విశేషాన్ని’ అర్థం చేసుకోవాలో తెలిపారు. సరే! ఆ విషయాన్ని అలా ఉంచి అపానమనే వాయువు గొప్పదనాన్ని తెలుసుకుని, దాన్ని ఎలా సాయినాథుడు అదుపు చేసి ఎవర్ని ఎలా రక్షించాడో చూద్దాం! మనకి శరీరంలో నవ రంధ్రాలున్నాయి. మొదటిది త్వక్– అంటే చర్మం. చర్మానికుండే ప్రతి వెంట్రుక కిందా ఒక చిల్లుంటుంది. దాన్నే రోమరంధ్రం అంటారు. ఈ కోట్లసంఖ్యలో ఉండే చిల్లుల్లో నుండి అపానమనే వాయువు, శరీరంలో దాక్కుని, వ్యాధిని కల్గించడానికి సిద్ధంగా ఉంటూ ఏ మాత్రమూ కనిపించకుండా దాగిన క్రిముల్నీ కీటకాలనీ స్వేదం(చెమట) రూపంలో బయటికి పంపించేస్తూ ఉంటుంది. అందుకే చెమట పట్టేలా శ్రమచేయాలంటారు వైద్యులు.రెండువది చక్షువు– అంటే కన్ను. పగలంతా దుమ్ములో ధూళిలో ఉంటాం కాబట్టి వాటి వల్ల నేత్రాలకి వ్యాధి రాకుండా ఉండేలా చేస్తుంది అపానమనే వాయువు తెల్లని ఓ పదార్థాన్ని (ఉదయానే లేచి శుభ్రం చేసుకుంటాం. ‘పుసి’ అంటారు దాన్నే) బయటికి పంపించేస్తూ.మూడవది శ్రోత్రం– అంటే చెవి. గులిమి అనే పేరుతో అశుభ్ర పదార్థాన్ని బయటికి పంపించేది ఈ వాయువే. వ్యాధి వచ్చిన సందర్భంలో చీముని పంపించేది కూడా ఇదే. అలాగే (జిహ్వ) నాలుక ఉపరితలం మీద ‘పాచి’ అనే అశుభ్రపదార్థాన్నీ (ఘ్రాణ) ముక్కు నుంచి జలుబు చేసినప్పుడు నీటినీ, అలాగే అశుభ్రపదార్థాన్నీ(చీమిడి) వీటితో పాటు రెండు విసర్జకావయవాల నుండీ వేగాలనీ (మలమూత్రాలనీ) స్త్రీలకైతే నెలసరి రజస్సునీ బయటికి పంపించేది ఈ వాయువే.తినరాని పదార్థాన్ని తానులోపల ఉన్న వ్యక్తి నోటి నుంచి వమన (డోకు–వాంతి) రూపంగా నెట్టేసేదీ, వాయునాళంలోనికి పొరపాటున ఆహారపు మెతుకు వెళ్లినట్లయితే పెద్దతుమ్ము రూపంలో (నలభై కిలోమీటర్ల వేగం ఎంతగా ఉంటుందో) పెద్ద వేగంతో ఆ పదార్థాన్ని బయటికి నెట్టేసేదీ ఇదే వాయువు.మన ఇళ్లలో కుళాయిలన్నింటిలోనూ నీరు నిలువ ఉన్నప్పటికీ ఎలా గాలి వెళ్లడం కోసం ఒక గొట్టాన్ని మేడ మీద ఉండే నీటి తొట్టికి అమర్చి ఆ గాలితోపుడు కారణంగా కుళాయి తిప్పగానే నీటిని కిందికి వచ్చేలా అమరికని చేసామో, అలాగే శరీరం నిండుగా పుట్టుకతో లభించిన రక్తాన్ని మొత్తం అన్ని అవయవాలకీ ప్రసరణం జరిగేలా చేసి వ్యక్తిని రక్షిస్తున్నది కూడా ఈ వాయువే. ఇలా ఈ వాయువు గురించిన గొప్పదనాన్ని ఎంతైనా వ్రాయవలసింది ఉంది ఉంటుంది. ఇంత గొప్పది ఈ వాయువైన కారణంగానే భగవద్గీతలో కృష్ణుడు కూడా ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ – ప్రాణ అపానాలనే వాయువుల కారణంగానే ప్రతి జీవీ తింటున్న ఆయా ఆహారపదార్థాలని వండటం నాకు సాధ్యమౌతోందని తెలియజేశాడు. అంతటి అపానమనే వాయువు సాయినాథునికి ఎలా అదుపులో ఉంచ వీలయిందో ఉదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం! అనన్యచింత పూనా జిల్లాలో జున్నార్ తాలూకాలో నారాయణ అనే గ్రామంలో భీమాజీ పాటిల్ అనే ధార్మికుడు ఉండేవాడు. ఎప్పుడూ వ్రశాంత చిత్తంతో చిరునవ్వు ముఖంతో ఉంటూ ఉండేవాడు. తనకి ఎంతో ధనం ఉన్నా అహంకారం లేకుండా ప్రవర్తించేవాడు. అతిథి సత్కారాలు చేసేవాడు. బంధువుల్ని ఆదరించేవాడు. ఎవరైనా సాయమడిగితే కాదు, లేదు, కూడదనకుండా పాత్రత ఎరిగి దానం చేస్తూ ఉండేవాడు. అన్నసంతర్పణలు చేస్తూ ఉండేవాడు. అందరూ కూడా ఇంతటి ఉత్తముడు చిరకాలం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఉండేవారు.రోజులన్నీ ఒకేలా గడిస్తే భగవంతుడెక్కడున్నాడంటూనూ, అంతా తన ప్రతిభే అనుకుంటూనూ, పూర్వజన్మలూ, పాపాలూ ఈ జన్మలో అనుభవించడాలూ.. ఇదంతా ఓ కట్టుకథే అనుకుంటూనూ ఉంటారుగా లోకజనం. అందుకేనేమో 1909లో పాటిల్‌కి అకస్మాత్తుగా దగ్గు ప్రారంభమైంది. ఏవో మందులూ మాకులూ వాడారు. ప్రయోజనం లేకపోయింది సరికదా దీపాన్ని అలా వత్తిని పెంచి ప్రకాశాన్ని మరింత చేసినట్లుగా రోజురోజుకీ వ్యాధి తీవ్రమై అది క్షయవ్యాధిగా నిర్ధారింపబడింది. దగ్గుధ్వనిని కుటుంబసభ్యులు కూడా తట్టుకోలేకపోతుండేవారు. కఫం, రక్తం కూడా నోటి నుంచి పడుతూ ఉంటే భరించలేకపోయేవారు. నోటి నుంచి ఉమ్మి నురుగలు నురుగలుగా పడుతూంటే, అది కూడా దుర్వాసనతో పడుతూ ఉంటే కుటుంబసభ్యుల అసహనాన్ని గమనిస్తూ పాటిల్ మెల్లగా మంచానికే అతుక్కుని ఉండాలని భావించి అలాగే మంచాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కనే ఒక మట్టికుండని పెట్టుకుని ఈ వాంతి రక్తం ఉమ్మినంతా దాంట్లో పడేలా జాగ్రత్త పడేవాడు.కుటుంబసభ్యులు వైద్యుల్ని సంప్రదించారు. ఆంగ్ల, హోమియో, యునానీ, గిరిజన, ఆయుర్వేద... ఇలా అన్ని రకాల వైద్యాలూ పూర్తయ్యాయి కానీ ఏ ఒక్కటీ గుణాన్ని ఇయ్యలేదు. ఇది ఏ మాత్రమూ తగ్గే వ్యాధి కాదని వైద్యులయితే చెప్పలేదు గానీ, పాటిల్‌కి తన అనుభవం మీద అర్థమవుతూ వచ్చింది.జ్యోతిష్కులెందరో వచ్చి ఆ గ్రహప్రభావం, ఈ గ్రహ నీచ దృష్టీ అంటూ ఈ హోమాలూ, ఆ యాగాలు, మరో యజ్ఞాలు, దానాలూ, జపాలూ, శాంతులూ... ఇలా చేయించి చేయించి తొందరలో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. ఎవరేమి చెప్పినా పాటిల్‌కి అర్థమైంది తనకొచ్చిన వ్యాధి లొంగేది కానే కాదని.ఇక సోది చెప్పించడాలు.. దృష్టి(దిష్టి) తీయడాలూ.. భూతవైద్యచికిత్సలు... వంటి తాంత్రిక వైద్యాలు కూడా చేయించారు కుటుంబ సభ్యులు. అయినా ఏ ఫలితమూ లేదు.‘పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే’ పూర్వజన్మలో జన్మల్లో చేసిన పాపమే ఈ జన్మలో వ్యాధిగా పరిణమించి అనుభవించేలా చేస్తుందని పెద్దలు చెప్పిన మాటలు చెవిలో గింగిర్లాడసాగాయి పాంటిల్కి.పాటిల్ గొప్పదనమేమంటే.. వైద్యులంతా మా శక్తిమేరకి వైద్యం చేసాం! అని వెళ్లిపోతుంటే.. మీలో దోషం లేదు. అనుభవించాల్సిన యోగం నాకుంది’ అని పలికేవాడే తప్ప ధనం ఖర్చుపెట్టించారనీ, అసమర్ధులనీ వాళ్లని గురించి ఒక్కమాటని వాళ్ల సముఖంలోగానీ పరోక్షంగా గానీ అనకపోవడమే. అలాగే జ్యోతిషులతో కూడా మీరు చేయగలిగిందంతా ఆ భగవంతుడ్ని మెప్పించడానికే చేశారు. ఆ భగవంతుడు నా పట్ల కరుణ చూపకపోతే మీ దోషమేముంది? అని అన్నాడే తప్ప ఒక్కమాటని చులకన చేస్తూ అననేలేదు పాటిల్. ఇక తాంత్రిక వైద్యులతోనూ ఆ ప్రక్రియలని పాటించినవారితోనూ కూడా ఒక్కమాటని వ్యతిరేకిస్తూ పలకలేదు సరికదా నా విషయంలో ఫలించలేదనే భావంతో ఇతరులకి ఈ చికిత్సని చేయడం మానకండి. ఏ పుట్టలో ఏ పాముందో? ఎవరికి తగ్గుతుందో? తప్పక కొనసాగించండి మీ వైద్యవిధానాన్ని! అనే అన్నాడు.అందుకే పాటిల్‌ని ఎరిగున్నవారూ, చికిత్సలు చేసినవారూ, జ్యోతిష్యులూ, బంధుమిత్రులూ, ఆప్తులూ, శ్రేయోభిలాషులూ ఇలా అందరూ కూడా పాటిల్‌కి ఈ తీరు వ్యాధిని రప్పించిన భగవంతుడెంత నిర్దయుడంటూ భగవంతుడి గురించే మనసులో మరోలా ఆలోచించుకున్నారు–అనుకున్నారు.వ్యాధివచ్చాక దాదాపుగా ప్రతిరోజూ ఓ రెండుగంటలపాటే నిద్రపోయే పాటిల్‌కి ఓ రోజు రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. అప్పటివరకూ ఏదో ఒక రోజున వ్యాధి నుంచి బయటపడగలననే నమ్మకం ఉండేది గానీ ఆ రాత్రి తనకి ఓ దృఢనిశ్చయం కలిగింది. తప్పక తొందర్లో అంటే రోజుల్లోనే మరణిస్తానని. అందుకే తనకెవరూ దిక్కులేరనే భావంతో (అనన్య చింత అంటే ఇదే) భగవంతుడ్నే ధ్యానించసాగాడు మౌనంగా దుఃఖంతో, నిర్వేదంతో, అందరికీ మంచినే చేసే తనకీ కష్టం ఎందుకు కలిగిందా? అనే సమాధానం తెలియని ప్రశ్నతో.అంతే! ఆకాశంలో చిమ్మచీకటిలో ఒక్కసారిగా మెరుపు కనిపించి మొత్తం పరిసరాలని కళ్లకి కట్టినట్లు చూపించినట్లుగా ఓ ఆలోచన తట్టింది. తనకి బాగా మిత్రుడైన ‘నానా’ నిరంతరం సాయి సేవలో తరిస్తూ ఉండే నానా(నానా సాహెబ్/నారాయణ గోవింద ఛాందోర్కర్) మనసులో మెదిలాడు. తన బాధని ప్రతి అక్షరం వివరించే తీరులో ఉత్తరం రాసి నానాకి పంపించాడు చిట్టచివరి ఉపాయంగా.నానాకి పాటిల్ రాసిన ఉత్తరంలోని ప్రత్యక్షరమూ పాటిలే దుఃఖంతో పూడిపోయిన కంఠస్వరంతో మాట్లాడుతూ చెప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఆ మనోబాధకి తట్టుకోలేకపోయాడు నానా. దానికి కారణం పాటిల్ అజాతశత్రుత్వం, దయాదాన ధర్మగుణం, సంపూర్ణ సజ్జన లక్షణం, సంస్కార సంప్రదాయధోరణీ.. ఇలాఒకటేమిటి? అన్నీ అతనిలో ఉండటమే.పరిష్కారం!నానా వెంటనే ఉత్తరాన్ని రాసాడు పాటిల్! నీకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అనుభవపూర్వకంగానూ వాస్తవజ్ఞానంతోనూ అనేక సాక్ష్యాధారాలతోనూ రాస్తున్నాను నీకు. మనకి ఒకే ఒక పరిష్కారం సాయినాథుడ్ని ఆశ్రయించడమే. రుణాన్ని తీర్చలేకపోతే ఒక భయం, పిల్లలు ఆరోగ్యవంతులూ లేదా విద్యావంతులూ కాకపోతే ఒక భయం, భార్య అనుకూలవతి కాకపోతే ఒక భయం ఇలా అనేక తీరుల భయాలు ఉంటాయి వ్యక్తులకి. అందరికీ అన్నీ ఉండవుగానీ పైవాటిలో ఏదో ఒకటో రెండో ఉండి తీరుతాయి. అయితే ఈ పై చెప్పుకున్న భయాలన్నీ ఇప్పుడో మరొకప్పుడో తీరే భయాలే అయినా అన్నింటికీ మించినదీ ఎప్పటికీ తీరనిదో మృత్యుభయం ఒక్కటే. నీ ఉత్తరం ఆసాంతం చదివాక నీ ప్రత్యక్షరంలోనూ నీకున్న ఆ భయమే గోచరించింది నాకు. సాయిలోని గొప్పదనమేమంటే ఆయన ఆ భయాన్ని పూర్తిగా తొలగించగల సమర్ధ వైద్యుడు. ఒక్కసారి ఇక్కడికొచ్చి ఆయన పాదాలని గట్టిగా పట్టుకుని ‘అన్య«థా శరణం నాస్తి..’ అని నీకు నువ్వుగా హృదయపూర్వకంగా ప్రార్థించు. నేను నీకు ఆ సర్వసమర్థ సాయినాథ దర్శనం వెంటనే లభించేలా చేయగలను. మానవమాత్రుడు కాని ఆయన దర్శనానికి వెంటనే రా!’ అని. పెద్దవరదలో కొట్టుకుపోతున్నవానికి బలమైన చెట్టుకొమ్మ లభించినట్టుగా, చెప్పలేనంత వేసవి వేడిమికి గురౌతున్న వ్యక్తికి ఎదురుగా ఒక పాకా అక్కడే ఓ చెరువూ కనిపించినట్టుగా ఒంటరిగా భయం భయంతో ప్రయాణిస్తున్న బాటసారికి తీర్థయాత్రకి వెళ్తున్న భక్తజనసమూహం తోడైనట్లుగా అనిపించి తాను జీవించగలననే ధైర్యం వచ్చేసింది నానాకి.అప్పటివరకూ ఏనాడూ సాయినాథుని గురించిన ఊహే లేని పాటిల్‌కి ఎప్పుడెప్పుడు సాయిని దర్శించి ఆయన పాదాల మీద పడి వేడుకోవాలా? అనే ఆత్రుత పెరిగిపోసాగింది. ధనవంతుడు తలుచుకుంటే అసాధ్యమేముంది సుఖప్రయాణానికి వెతుక్కోవాల్సినదేముంటుంది ప్రయాణానికి?అనుకున్నట్లుగానే షిర్డీ చేరుకున్నాడు పాటిల్. అతడ్ని తెచ్చిన బండి షిర్డీలోని మసీదు వాకిలి దగ్గర నిలబడింది. ఏ మాత్రమూ నడవలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న పాటిల్‌ని నలుగురు మనుషులు మంచం మీద పడుకోబెట్టి సాయినాథుని దర్శనం కోసం మెట్లెక్కి తెచ్చారు. బాబా సమక్షంలో ఉంచారు. నానా ఈ పాటిల్‌ని సాయికిపరిచయం చేయబోతుంటే శ్యామా పాటిల్ గురించి చెప్ప ప్రారంభించాడు.సాయి పాటిల్‌ని చూస్తూనే ‘శ్యామా! ఇదేమైనా నీకు బాగుందా చెప్పు? ఇలాంటి దొంగల్ని నా దగ్గరికెందుకు పట్టుకోచ్చావ్? నా కెందుకు ఇలాంటివి అంటగడతావు? అంటూ వెళ్లిపోబోతుంటే పాటిల్ నేలబారుగా ఉన్న మంచం నుంచి ముందుకి జరిగి తన తలని సాయి పాదాలకి ఆనేలా ఉంచి... ‘సాయినాథా! ఈ దీనుడ్ని రక్షించు! నువ్వే నాకు రక్ష–రక్షణ! నిస్సహాయుడ్ని! ఈ జీవిని కాపాడు!’ అని పరమదీన ఆర్ద్రకంఠంతో వేడుకున్నాడు. సాయి అతడ్ని పూర్తిగా చూసాడు పరిశీలనగా.ఒక్క క్షణం ఆగి ‘బేటా! ఈ ఫకీరు దయలేనివాడు కాడు. ఈ ద్వారకామాయిదర్శనం సర్వదుఃఖాలనీ పొగొట్టే దివ్యశాంతినికేతనం. వ్యథ పడకు. నువ్విక్కడే షిర్డీలో భీమా బాయి ఇంట్లో ఉండు! భయాన్ని విడిచెయ్! రెండు మూడు రోజుల్లో నీకు ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది. ఎంతటి లోతైన కష్టసముద్రంలో పడిపోయినా, దుఃఖాల బురదలో తలతో సహా కూరుకుపోయి చూచేవారికి ఏమీ కనిపించకపోయినా ఈ ద్వారకామాయి ఆ వ్యక్తిని ఉద్ధరించి తీరుతుంది! వెళ్లు!’ అన్నాడు. మన మాటల్లో ఆ జరిగిన వృత్తాంతాన్ని చెప్పుకోడానికి రెండు నిమిషాల సమయం పట్టింది గానీ, పాటిల్పైని రాయడం శ్యామా పరిచయం చేయబోవడం సాయి తిరస్కరించడం... ఈ సంఘటన మొత్తం జరగడానికి గంటకిపైగా సమయం పట్టింది. పాటిల్‌కి తాను జీవించగలననే సంపూర్ణ ధైర్యం– సాయినాథుణ్ణి చూడటం, ఆయన తనని దీవిస్తూ పలకడం వంటి వాటి కారణంగా వచ్చింది.మరో కారణం కూడా ఉంది పాటిల్‌కి ధైర్యం కలగడానికి. పాటిల్‌కి ప్రతి ఐదునిమిషాలకే వాంతిరావటం దాంట్లో రక్తం పడుతూ ఉండటం ఆ దృశ్యాన్ని చూస్తూ అతను జీవితధైర్యాన్ని కోల్పోతూ ఉండటం జరుగుతూ ఉండేది. అయితే సాయి దర్శనానికొచ్చాక ఈ గంటపైన గడిచిన సమయంలో ఒక్క వాంతి రానూ లేదు. వాంతి వచ్చే సూచన కూడా అతనిలో కలగలేదు. దాంతో పాటిల్ మంచి ధైర్యం ఆశాకలిగాయి జీవితంపట్ల.సాయి చెప్పినట్లు భీమాబాయి ఇంట్లోనే ఉన్నాడు పాటిల్. సాయి అన్నట్లే పాటిల్ అనారోగ్యం మూడురోజుల్లో పూర్తిగా తొలగిపోయింది.ఎలా నయమైంది?అపానమనే వాయువుకున్న లక్షణం శరీరంలో అనవసరంగా ఉన్న పదార్థాన్ని బయటికి నెట్టివేయడం అని అనుకున్నాం కదా! బయటికి నెట్టివేయగల శక్తి ఉన్న అపానమనే వాయువుకి ఆ వాయువుని నెట్టివేయకుండా తనలో దాచుకునే శక్తి కూడా ఉంటుంది గదా!ఆ కారణంగా ఎప్పుడు అపానమనే వాయువు ద్వారా రక్తంతో కూడిన వాంతి బయటికి వెళ్లిపోవలసిన పరిస్థితి కల్గినా సాయి కృపాకటాక్షం ద్వారా ఆ రక్తంతో కూడినవాంతి బయటికి వచ్చేదే కాదు. కనీసం బయటికి వచ్చే సూచన కూడా కనపడలేదు. వాంతి అవుతుందేమో అనే మనోభయం కూడా పాటిల్‌కి కలగలేదు.అంటే సాయి ఏం చేసాడన్నమాట? తన కున్న అపానమనే వాయువు మీద ఉండే అధికారంతో ఆ వాయువుని అదుపు చేసి లోనున్న వాంతిని బయటికి రాకుండా చేయడమే కాక, మిగిలిన రంధ్రాల నుండికూడా ఆ వాంతి రాకుండా ఉండేలా అదుపుచేసాడు సాయి. ఇదీ అపానమనే వాయువుమీద సాయికున్న అధికారమంటే! అలాగని ప్రతిసారీ అలా వాయువులని నిరోధించలేదు సాయి. అంటే ఆ అవకాశాన్నిదుర్వినియోగపరచలేదనేది దీనినుంచి గ్రహించాల్సిన విషయమన్నమాట! ఇలాంటి అధికారాన్ని వినియోగించిన మరి రెండు చోటులని కూడా తెలుసుకుని అంతరార్థాన్ని తెలుసుకుందాం! – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
మాల్ లోపాలు
అనడానికి ‘మాల్’ లోపాలు అంటున్నాం కానీ.. నిజానికైతే ఇది మగవాళ్ల లోపం! పాలకోసం ఏడ్చేబిడ్డ.. పాలిచ్చి ఏడుపు ఆపాలని ఆరాట పడే తల్లి.. మాల్లో ఉన్నామా.. మగవాళ్లున్న చోట ఉన్నామా అని చూసుకుంటారా?! బహిరంగ ప్రదేశాలలో స్తన్యం ఇవ్వడం ఏమిటనిఘీంకరించే పురుష ప్రపంచం..ఈ ప్రకృతి అనివార్యతను ఎన్ని జన్మలకు అర్థం చేసుకుంటుంది? ఇంకెన్ని జన్మలకు.. తల్లి పాలివ్వడానికి అనువైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది? పాపాయి ఏడుస్తుంది. ఏడుస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకుని స్తన్యమిస్తుంది తల్లి. ‘‘ఇప్పుడే కదా పాలిచ్చావ్! మళ్లీ ఇంతలోనే ఏడుపా’’ అని అడిగే భర్తకు సమాధానమివ్వదు తల్లి. భర్తను ఓ చూపు చూసి బిడ్డను గుండెలకు హత్తుకుంటుంది. ఎందుకంటే సమాధానం ఇచ్చినా అతడికి అది అర్థం కాదు. బిడ్డ ఏడిచింది పాలకోసం కాదు తల్లి సాన్నిహిత్యం కోసం అని తెలుసుకునే అవకాశం పురుష జన్మకు ఉండదు కాబట్టి. ‘‘తిరిగి ఇంటికి వచ్చే వరకు సరిపోయేటట్లు ఫ్లాస్కులో పాలు పెట్టుకో. తీరా వెళ్లినప్పటి నుంచి ఏడుపు మొదలు పెడితే ఇబ్బంది’’.. అని భార్యను హెచ్చరిస్తాడు ఓ భర్త. బిడ్డతో బయటకు వెళ్లాల్సిన పని పడినప్పుడు. ‘‘చుట్టూ మనుషులు తిరుగుతుంటే ఇక్కడ పాలివ్వడమేంటి. అయినా బాటిల్లో ఉన్న పాలు తాగించవచ్చు కదా’’ అని చిరాగ్గా అంటాడు మరో భర్త. కేన్ల కొద్దీ పాలు ఎదురుగా ఉన్నా సరే... తల్లి పాలిస్తే తప్ప పిల్లలు ఊరుకోరని ఈ మగవాళ్లకు తెలిసేదెప్పటికి! తాము తల్లి దగ్గర పాలుతాగిన జ్ఞాపకాలేవీ వాళ్లకు గుర్తుండే అవకాశం, గుర్తుకొచ్చే అవసరం వారి జీవితంలో ఉండదు. మగవాళ్లు తీర్చిదిద్దిన ప్రపంచం కూడా మగవాళ్లలానే ఉంటుంది కనుక మగ దృష్టితో మాత్రమే వారేదైనా చూడగలరు. ఓ బిడ్డకు తనకు కావాలనిపించినప్పుడు తల్లి దగ్గర పాలు తాగే హక్కును కలిగించని, అలాగే.. బిడ్డకు పాలు అవసరమైనప్పుడు ఏ ప్రదేశంలోనైనా పాలిచ్చే హక్కును స్త్రీలకు కల్పించని సమాజ నిర్మాణం ఇది. ఒక్కమాటలో మగవాళ్ల కోసం మగవాళ్ల చేత మగవాళ్లు నిర్మించుకున్న సమాజం. అందుకే ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన బిడ్డతల్లి తన ఏడు నెలల పాపాయికి పాలివ్వడానికి టాయిలెట్లోకి వెళ్లాల్సి వచ్చింది. తలచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. అలాంటిది ఆ తల్లి మనసు ఎంతగా గుక్కపట్టి ఏడ్చి ఉంటుంది! పాల కోసం ఏడ్చే పాపాయిలా. కలకత్తా కాళి ఇంతటి అమానుషానికి వేదిక కోల్‌కతాలోని సౌత్ సిటీ మాల్. ఆ షాపింగ్‌మాల్‌కి ఓ కొత్త తల్లి తన ఏడు నెలల పాపాయితో వచ్చింది. ఆ మాల్లో మల్టీనేషనల్ కంపెనీల షోరూమ్‌లున్నాయి. ఐస్‌క్రీమ్ కార్నర్లున్నాయి. ఒక ఫ్లోరంతా విశాలమైన ఫుడ్‌కోర్టు ఉంది. స్మోకింగ్ జోన్ కూడా ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ చంటిబిడ్డకు పాలివ్వడానికి పదడుగుల స్థలం మాత్రం లేదు. బిడ్డకు అవేవీ తెలియదు. తల్లిపాలిచ్చే వరకు ఏడుపు ఆగదు. బిడ్డ ఏడుస్తుంటే తల్లికి మనసు పిండేసినట్లవుతుంది. ఓ కార్నర్లో బెంచి మీద కూర్చుని పాలివ్వబోతే మాల్ సిబ్బంది ఒప్పుకోలేదు. ‘‘ఇక్కడ కూర్చోకూడదు. టాయిలెట్లోకి వెళ్లి పాలిచ్చుకోండి’’ అని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి అదే పని చేసింది. ఆ తర్వాత ఆమె తన ఆవేదనను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో మాల్ తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు మాల్ నిర్వాహకులు స్పందించిన తీరు మరింత అమానుషంగా ఉంది. ‘‘మీ బిడ్డకు మీరు ఎక్కడైనా పాలిచ్చుకోవచ్చు. కానీ మా మాల్కి వచ్చిన ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చూసుకోవడం మాకు ముఖ్యం’’ అనే అర్థంలో పోస్టు పెట్టింది. అప్పుడు ఆ మహిళలోని తల్లి కలకత్తా కాళి అయింది. భౌతికంగా ఉగ్రరూపం దాల్చి దండెత్తలేదనే కానీ, సుతిమెత్తని ప్రశ్నలతో మాల్ నిర్వాహకుల తీరును ఎండగట్టింది. పాల కోసమే అనేముంది? బిడ్డ ప్రతిసారీ ఆకలి, దాహంతో ఏడవదు. జనసమ్మర్థం ఉన్న చోట కొత్త గొంతులు వినిపించినప్పుడు ఆందోళనకు గురవుతుంది. తల్లి పొత్తిళ్లలోకి వెళ్లాలని కోరుకుంటుంది. తల్లి పాలిస్తూ దగ్గరకు తీసుకుంటే తనకు కొండంత భద్రత ఉందనే భరోసాతో ఏడుపు ఆపుతుంది. పిల్లలకు పాలిచ్చే గదిని ఏర్పాటు చేయడం మాల్‌కు సాధ్యమయ్యే పని కాదనేదే మీ ఉద్దేశమైతే అదే విషయాన్ని గమనికగా ఓ బోర్డు పెడితే సరిపోయేది. నాలాంటి తల్లులు మీ మాల్‌కు రాకుండా ఉంటారు. సమాజంలో చంటిబిడ్డల తల్లులు ఎప్పుడూ ఉంటారు. ఇది మొదలు కాదు, చివరా కాదు. స్మోకింగ్ జోన్కంటే బిడ్డ పాలు తాగడానికి ఫీడింగ్ జోన్ ముఖ్యమైన అవసరం కాదా?.. అంటూ మాల్ నిర్వాహకులకు శరాలు సంధించింది. ఫీడింగ్ జోన్ ఎందుకుండదు? కన్నతల్లి కడుపు రగిలి సంధించిన ఈ ప్రశ్నలు మగవాళ్ల ‘ఏక దృష్టి’ని సరిచేస్తాయా? చేస్తే మంచిదే. ఒక వ్యవస్థ నిర్మాణంలో మహిళ కూడా ఉంటే మహిళల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సూచనలు చేస్తుంది. మహిళ భాగస్వామ్యం లేని సమాజంలో ప్రతి నిర్మాణమూ మెన్ఫ్రెండ్లీగానే ఉంటుంది. బార్ రూములుంటాయి, స్మోకింగ్ జోన్లుంటాయి తప్ప ఫీడింగ్ జోన్లుండవు. ఈ సంఘటనతో ఆలోచన రేకెత్తి.. ఇకపై రాబోయే మాల్ నిర్మాణాల్లో ఫీడింగ్ జోన్ ఉంటుందేమో చూడాలి. మగవాళ్లకు మహిళల అవసరాలు స్ఫురించకపోవడాన్ని తప్పు పట్టలేం కానీ, ఎదురుగా అవసరం కనిపిస్తున్నా సరే, మూర్ఖంగా ప్రవర్తించడాన్ని మాత్రం క్షమించలేం. తల్లిపాల ఆవశ్యకతను తెలియచేస్తూ ఉద్యమాలే నడుస్తున్నాయి. అది బహిరంగ ప్రదేశమైనా, పార్లమెంట్ సమావేశమైనా సరే.. తల్లి పాలు అవసరమైన క్షణంలోనే ఆ బిడ్డకున్న ‘పాలు తాగే హక్కు’ను తీర్చాల్సిన బాధ్యత బహిరంగ ప్రదేశాలకూ ఉంది. ఈ హక్కును సాధించుకోవడానికి బిడ్డకు చేతనైన ఆయుధం ఏడుపు ఒక్కటే. అందుకే బిడ్డ ఏడుపును గౌరవించాలి. తల్లికి ఆ క్షణంలోనే పాలిచ్చే ‘అనువు’ కల్పించాలి. – మంజీర -
ఉప‘యోగా’లెన్నో..
ధ్యానంతో దర్జాగా ఆరోగ్యం దీర్ఘకాలిక వ్యాధులు, చెడు వ్యసనాలు మటుమాయం యోగాశ్రమాలకు, ప్రకృతి వైద్యానికి పెరుగుతున్న ఆదరణ ఆహారమే ఔషధం.. వంటిల్లే వైద్యశాల ఖమ్మం : మనుషులకు ఏదైనా జబ్బు చేస్తే.. ఆ వ్యాధి బారి నుంచి బయట పడేందుకు ఆధునిక ఔషధాలు ఎన్ని తయారు చేస్తున్నా.. మరో కొత్త వ్యాధి పుట్టుకొస్తూనే ఉంది. కొన్ని జబ్బులు నిపుణులైన వైద్యులకే అంతుపట్టడం లేదు. పట్టుమని పదేళ్లు రాకముందే ఎన్నో ఆరోగ్య సమస్యలు.. కానీ మన పూర్వీకులు సునాయాసంగా 100 సంవత్సరాలు బతికేవారు. పండు వయసులోనూ పల్లెం నిండా అన్నం తినేవారు.. పదిమైళ్లయినా అవలీలగా నడిచేవారు. వారి కంటి చూపు సన్నగిల్లలేదు.. పంటి నొప్పి రాలేదు.. వీటన్నింటికి కారణం.. ప్రకృతి.. ఆహారపు అలవాట్లే.. వంటగదే వైద్యశాలగా ఉండేది.. కలుషితం కాని ఆహార పదార్థాలు.. ఆకుకూరలు... ప్రకృతిలో లభించే పండ్లు, కాయలు తినేవారు. కష్టపడి పనిచేసేవారు.. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. మరి ఇప్పుడు.. పదేళ్ల పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు, కాళ్ల నొప్పులు.. సన్నగిల్లిన కంటిచూపు.. మూడు మెట్లు ఎక్కితేనే ఆయాసం.. అందుకే ప్రకృతి వైపు పయనిద్దాం అంటోంది నేటి తరం. యోగాలు.. ఆసనాలు.. ప్రకృతి వైద్యంతో మంచి ఫలితాలు ఉంటున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమన దొరుకుతుందని చెపుతున్నారు. ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత మన సొంతం. తమ చుట్టూ ఉన్న ఆకులు, అలాలు, మట్టి, నీరు, సూర్యరశ్మి, గాలిలోనే సర్వ రోగ నివారణ మందులు ఉన్నాయని.. వాటిని సక్రమ పద్ధతిలో వినియోగించుకుంటూ యోగా చేస్తే సంపూర్ణ ఆర్యోగవంతులుగా ఉండవ చ్చని పలువురు అంటున్నారు. దీంతో యోగాశ్రమాలు, ప్రకృతి వైద్యశాలలు జిల్లాలో నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకృతి వైద్యం గురించి ప్రపంచానికే చాటిచెప్పిన భారతీయులు.. ప్రాచీన కాలం నుంచే ప్రపంచ దేశాలకు దీటుగాా వర్తక వ్యాపారాలు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, వైద్య రంగంలోనూ భారతీయులు ముందుండే వారని చరిత్ర చెబుతోంది. క్రీస్తుపూర్వం 2500-1800 సంవత్సరాల మధ్య విరసిల్లిన సింధూ నాగరికతలోనే భారతీయులు యోగా, ఆవిరి స్నానాలు ఆచరించినట్లు హరప్పా, మొహంజోదారో పట్టణాల్లో బయటపడిన ఆధారాలు చెపుతున్నాయి. అలాగే చరకుడు రాసిన చరకసంహిత, గౌతమబుద్ధుడు, ఆచార్య నాగార్జునుడు, కపిలుడు వంటివారు రాసిన గ్రంధాలతోపాటు క్రీస్తుపూర్వం 300-200 కాలంలో పతంజలి రాసిన యోగసూత్రలో తెలిపిన విషయాలు, ఆరోగ్య సూత్రాలు ప్రపంచాన్నే అబ్బుర పరిచాయి. మన పూర్వీకులు రాసిన గ్రంధాలు, వారు ఆచరించిన విధానాలను చైనా, జపాన్, బూటాన్, కంబోడియా, శ్రీలంక వంటి దేశాల ప్రజలు ఇప్పటికీ ఆచరించడం గమనార్హం. కాగా, దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇటీవల ప్రకృతి చికిత్సల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆసనాలు, యోగాతో గల ప్రయోజనాలను తెలుకుంటున్నారు. యోగాతో లాభాలేమిటి..? ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలని కోరుకుంటారు. మానసిక, శారీరక ఆనారోగ్యానికి యోగా, ప్రకృతి వైద్యంతో మంచి ఫలితాలు ఉంటాయని యోగా గురువులు అంటున్నారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి, ఆహార నియమాలను సమన్వయం చేయడమే అన్ని రకాల సమస్యలకు పరిష్కారమని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, థైరాయిడ్, పక్షవాతం, గుండెజబ్బులు, నరాల బలహీనత, మొలలు, గ్రంధుల సంబంధిత వ్యాధులు ప్రకృతి వైద్యంతో నయం చేయవచ్చంటున్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని చెపుతున్నారు. అవయవాల నియంత్రణ లోపం, అహారపు అలవాట్లలో తేడాల వల్లే వ్యాధులు వస్తుంటాయని, వీటి నుంచి విముక్తి పొందేందుకు కండరాలు, అవయవాల్లో కదలిక తేవడానికి యోగా ఉపకరిస్తుందని అంటున్నారు. ప్రకృతి వైద్యం వైపు పయనం ఇంగ్లిష్ మందులు వేసుకుని విసిగిపోయిన వారు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పయనిస్తున్నారు. దంపుడు బియ్యం, పచ్చి కూరగాయలు తినడంతో పాటు అన్ని రకాల ఔషధ మొక్కలను ఇంటి ఆవరణలో, పెరట్లో పెంచుతున్నారు. పూదిన, కొత్తిమీర, తులసి ఆకు, బొప్పాయి వంటివి స్త్రీల సంబంధింత వ్యాధులకు బాగా పని చేస్తాయని యోగా నిపుణులు అంటున్నారు. అలాగే అల్సర్‌కు కలమంద రసం, బీపీకి టమాటా జ్యూస్, రక్తహీనత, క్యాన్షర్, నరాల బలహీనతలకు గోదుమగడ్డి రసం, ఎముకల అరుగుదల నివారణకు నువ్వులు, తోటకూర, ఖర్జూరా, తమలపాకు, కిడ్నీలో రాళ్లు కరిగించుటకు కొండపిండి ఆకు చూర్ణం, బొప్పాయి, ఉలువచారు.. ఇలా ప్రతీ వ్యాధికి ప్రకృతి వైద్యం ఉందని వారు వివరిస్తున్నారు. జిల్లాలో రోజూ లక్షమందికి పైగా యోగా.. జిల్లాలో పసి పిల్లల నుంచి పండు ముదుసలి వరకు యోగా వేసేవారు రోజుకు లక్ష మందికి పైగానే ఉంటారని ఆయా కేంద్రాల నిర్వాహకులు చెపుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, మధిర.. ఇలా అన్ని ప్రాంతాల్లో యోగా కేంద్రాలు, ఇతర ఆశ్రమాలు, ధ్యాన మందిరాలు 200 పైగా ఉన్నాయి. వీటిలో యోగా, ప్రకృతి వైద్య నియమాలు తెలుసుకున్నవారు స్వయంగా ఇళ్లలో వేయడంతో పాటు ఇతర కుటుంబసభ్యులకు కూడా నేర్పుతున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగా, ప్రకృతి వైద్యం మనపూర్వీకుల నుంచి సక్రమించిన వరం. ఆలస్యంగానైనా మన జిల్లాలో యోగా పట్ల ప్రజలకు ఆసక్తి పెరగడం సంతోషకరం. యోగా వేస్తూ, ప్రకృతి నియమాలు పాటించి, ఆహారపు అలవాట్లలో మెలకువలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం అవుతుంది. - కె.వై. రామచంద్రరావు, ప్రకృతి వైద్యులు -
ప్రకృతి వైద్యం రోగం నయం
ఆల్వాల్‌కు చెందిన జగదీశ్వర్‌కు పక్షవాతం వచ్చింది. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళితే వారం రోజులకే లక్ష రూపాయల బిల్లు చేతిలో పెట్టారు. సరే... జబ్బు నయం అయ్యిందా అంటే అదీ లేదు. నేచురోపతితో ఫలితం ఉంటుందని దగ్గర బంధువు చెప్పడంతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 లోని రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్‌లో చేరాడు. పది రోజుల్లోనే ఎవరి సహాయం లేకుండా నడుస్తున్నాడు. దీనికి ఆయనకు అయిన ఖర్చు ఐదు వేలు. జీడిమెట్లకు చెందిన సుమిత్ర కొద్దిసేపు నడిచినా, మాట్లాడినా ఆయాసం కమ్మేసి నిస్సాహాయస్థితిలోకి వెళ్తుంది. పలు ఆస్పత్రులు తిరిగి రూ. 70 వేల వరకు ఖర్చు చేసింది. ప్చ్...ప్రయోజనం లేదు. తెలిసిన వారి ద్వారా అదే రెడ్‌క్రాస్‌లో చేరింది. నాలుగు రోజుల తరువాత సోమవారం సాధారణ మనిషిలా డిశ్చార్జ్ అయ్యింది. అందుకు ఆమెకు అయిన ఖర్చు మూడు వేలు. ఇవి జగదీశ్వర్, సుమిత్రల జీవితాల్లో ఎదురైన అనుభవాలు. వీరిద్దరికే కాదు... నిత్యం ఎందరికో రెడ్ క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ సెంటర్ ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యానికి చిరునామాగా నిలుస్తోంది. బంజారాహిల్స్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వైద్యం కోసం వస్తుంటారు. ప్రకృతి చికిత్సకు సమాంతరంగా యోగా శిక్షణ ఇస్తూ నగరవాసుల ఒత్తిడిని దూరం చేసే కేంద్రంగా విరాజిల్లుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2 (ఎల్వీ ప్రసాద్ మార్గ్)లో 1994 సెప్టెంబర్ 15న అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా ప్రారంభమైన యోగా అండ్ నేచర్‌క్యూర్ సంస్థ పేద ప్రజలకు సంజీవనియే అయ్యింది. 30 పడకల వసతితో అటు ఇన్ పేషెంట్స్‌కు, మరోవైపు ఔట్ పేషెంట్స్‌కు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రకృతి చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. చికిత్సలివే... డైట్ థెరపీ (ఆహార చికిత్స): ఫలానా జబ్బుతో వచ్చిన వారికి ఎలాంటి పోషకాహారం ఇవ్వాలి. ఏది తింటే వారికి త్వరగా క్యూర్ అవుతుందనే అంశాలను పరిగణనలోకి ఈ థెరపీని అందిస్తారు. ముఖ్యంగా పండ్లు, గ్రీన్ వెజిటెబుల్స్ అందిస్తుంటారు. మసాజ్ థెరపీ (మర్ధన చికిత్స): ట్యూబర్క్యులసిస్, ట్యూమర్ ఆఫ్ ది స్పైన్, ఆస్టియోమిలిటీ తదితర వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్స ద్వారా ఇన్ఫెక్షన్, ఇన్‌ఫ్లేమేషన్‌ను తగ్గిస్తారు. హైడ్రో థెరపీ (జల చికిత్స): ప్రధానంగా బ్యాక్ పెయిన్‌తో బాధపడే వారికి హాట్ స్పైనల్ బాత్, స్టీమ్ బాత్ (ఆవిరి స్నానం) ద్వారా తగ్గిస్తారు. మాగ్నిటో థెరపీ (అయస్కాంత థెరపీ): పవర్ఫుల్ అయస్కాంతం ద్వారా వెన్నెముక, కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులను తగ్గిస్తారు. ఏయే జబ్బులకు చికిత్స అధిక రక్తపోటు, పెరాలసిస్, గుండె జబ్బులు, ఒత్తిడిని తగ్గిం చడం, వెన్నెముక నొప్పులు, హెపటైటిస్, అన్ని రకాల చర్మ వ్యా ధులు, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, సెర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలిటిస్, ఆస్టియో ఆర్ధరిటిక్స్, యాక్సైటిక్-న్యూరోసిస్, మైగ్రేన్ తదితర వాటికి సంబంధించి ఇక్కడ ప్రకృతి చికిత్సను అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో యోగా శిక్షణకు దాదాపు 500 మంది హాజరవుతున్నారు. శిక్షణ వేళలు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు రెండు బ్యాచ్‌లు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో బ్యాచ్ చొప్పున యోగా శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా మహిళల కోసం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు రెండు బ్యాచ్‌ల్లో శిక్షణ ఇస్తున్నారు. వార్డుల సమాచారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇన్‌పేషెంట్‌గా చేరే వారి కోసం జనరల్ వార్డు, షేరింగ్ రూమ్ (ముగ్గురు లేక నలుగురు), స్పెషల్ రూమ్(ఒకరు లేక ఇద్దరు)లను కేటాయిస్తారు. జనరల్ వార్డుకు ట్రీట్మెంట్తో కలిపి రూ.400, షేరింగ్ రూమ్‌కు రూ. 500, స్పెషల్ రూమ్‌కు రూ. 700 ప్రకారం ఫీజు వసూలు చేస్తారు. పది రోజుల కోర్సుకు రూ. 2500, 15 రోజుల కోర్సుకు రూ. 3500 వసూలు చేస్తారు. శరీరం చాలా తేలికైంది మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్‌తో బాధపడుతూ ఇక్కడికి వచ్చాను. నాలుగు రోజుల క్రితం చేరాను. ఇక్కడ చికిత్సతో శరీరం చాలా తేలికయ్యింది. ఇక్కడ స్నేహపూరిత వాతావరణం ఉంది. 15 రోజుల కోర్సులో చేరాను. ట్రీట్మెంట్ బాగుంది. రీజినబుల్ రేట్లు ఉన్నందున అందరికీ అందుబాటులో ఉంది. - కె.మంజుల, గృహిణి బాగా కోలుకున్నా కడుపునొప్పితో బాధపడుతూ ఇక్కడ చేరాను. మల విసర్జన కూడా కష్టంగా ఉండేది. 15 రోజుల క్రితం చేరి డైట్, మసాజ్, యోగా చికిత్సలు తీసుకున్నాను. ఇప్పుడు బాగా కోలుకున్నాను. మలమూత్ర విసర్జనలు తేలికయ్యాయి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో త్వరగా కోలుకుంటున్నారు. - జి.శరత్‌బాబు ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి చికిత్స ఎంతో మేలు ప్రకృతి చికిత్స ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరితగతిన వ్యాధి నయం చేయవచ్చు. వ్యాధిని బట్టి వారికి ఆహారం అందిస్తూ నయం అయ్యేవరకు డాక్టర్ల పర్యవేక్షణ ఉంటుంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు అయ్యే ఖర్చు ఇక్కడ వందలు, వేలల్లోనే అయిపోతుంది. అయితే డాక్టర్లు చెప్పిన విధంగా ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. - టి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్, రెడ్‌క్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచర్‌క్యూర్ వ్యాధి మూలాల్లోకి... ఇక్కడ వ్యాధికి సంబంధించిన మూలాల్లోకి వెళ్లడం జరుగుతుంది. రోగ మూలాలను తీసివేస్తేనే వ్యాధి నయమవుతుంది. అందుకే ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తున్నాం. తక్కువ రేట్లలో నాణ్యమైన చికిత్సలు లభ్యమవుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు నేర్పిస్తాం. - డాక్టర్ దినేష్ రాజ్, డెరైక్టర్