పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో అధికార ఎన్‌డీఏ సీట్ల పంపిణీ ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు గాను బీజేపీ, జేడీయూ చెరో 17 చోట్ల, ఎల్‌జేపీ 6 చోట్ల అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) రాష్ట్ర అధ్యక్షులు వరుసగా నిత్యానంద్ రాయ్, వశిష్ట నారాయణ్ సింగ్, పశుపతి కుమార్ పరాస్‌లు ఈ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్‌కు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరిందని వారు తెలిపారు. ఇలా ఉండగా, రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ), హిందుస్తాన్ ఆవామ్ మోర్చా– సెక్యులర్ (హెచ్‌ఏఎం(ఎస్), లోక్ తాంత్రిక్ జనతాదళ్, వికాస్ శీల్ ఇన్సాన్ తదితర పార్టీలతో కూడిన మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment