సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరగనున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక భేటీ తర్వాత రాష్ట్రంలో సగం లోక్‌సభ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడంతో నష్టం జరిగిందన్న వాదనల నేపథ్యంలో ఇప్పుడు 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు న్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో మూడింటిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు (ఆదిలాబాద్ మినహా), చేవెళ్ల, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఎవరెవరు ఎక్కడెక్కడంటే...
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావొచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
- సికింద్రాబాద్: కిషన్‌రెడ్డి
- కరీంనగర్: బండి సంజయ్
- నిజామాబాద్: అర్వింద్ ధర్మపురి
- ఆదిలాబాద్: సోయంబాపూరావు లేదా బాపూరావు రాథోడ్, గుడెం నగేష్
- మల్కాజిగిరి: ఈటల రాజేందర్, మురళీధర్‌రావు, చాడ సురేష్ రెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, పొన్నా ల హరీష్రెడ్డి
- జహీరాబాద్: ఎం.జైపాల్‌రెడ్డి, ఆలె భాస్కర్, అశోక్ ముస్తాపురె / ఓ ప్రముఖ సినీ నిర్మాత
- చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు బి. జనార్దనరెడ్డి
- మహబూబ్‌నగర్: డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి, శాంతకుమార్
- భువనగిరి: బి.నర్సయ్యగౌడ్, జి. మనోహర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, శ్యాంసుందర్‌రెడ్డి
- మెదక్: ఎం.రఘునందన్‌రావు, జి. అంజిరెడ్డి
- వరంగల్: మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింతా సాంబమూర్తి
- నాగర్‌కర్నూల్: బంగారుశ్రుతి, కేఎస్ రత్నం
- హైదరాబాద్: టి.రాజాసింగ్, మాధవీలత, భగవంతరావు,
- పెద్దపల్లి: టి.కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం
- నల్లగొండ: మన్నె రంజిత్‌యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి
- మహబుబాబాద్: హుస్సేన్‌నాయక్ / మరొకరికి
- ఖమ్మం: దేవకీ వాసుదేవరావు, వినోద్‌రావు, రంగా కిరణ్
Comments
Please login to add a commentAdd a comment