సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్‌ఐ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్‌ఎస్‌ఐ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో).
పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి.
Comments
Please login to add a commentAdd a comment