
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి.
ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment