న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది.
కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment