candidates list
-
Delhi Elections: బీజేపీ రెండవ జాబితా విడుదల
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయపార్టీలు తమ వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీచేయబోయే అభ్యర్థుల రెండవ జాబితాను బీజేపీ విడుదల చేసింది.ఈ జాబితాలో 29 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. కపిల్ మిశ్రా(Kapil Mishra)ను కరవాల్ నగర్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. లక్ష్మీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి అభయ్ వర్మను బరిలోకి దింపింది. వర్మ ఈ స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 58 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ 29 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. కరవాల్ నగర్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్ట్‌కు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో కపిల్ మిశ్రాను అభ్యర్థిగా ప్రకటించింది. మోతీనగర్ నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా కుమారుడు హరీష్ ఖురానాను పార్టీ బరిలోకి దింపింది.ఐదుగురు మహిళా అభ్యర్థులుబీజేపీ ప్రకటించిన రెండవ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్టీ ఇద్దరు మహిళా అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఇప్పటివరకు పార్టీ ఏడుగురు మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది. పార్టీ నీలం కృష్ణ పెహల్వాన్‌ను నజాఫ్‌గఢ్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)కి చెందిన కైలాష్ గెహ్లాట్ ప్రస్తుతం నజాఫ్‌గఢ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఆలయ సెల్ అధ్యక్షునిగా కర్నైల్ సింగ్‌కు పార్టీ షకుర్ బస్తీ టికెట్ ఇచ్చింది. వివిధ స్థానాల నుంచి..ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుండి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్‌ను ఆ పార్టీ కొండ్లి నుంచి పోటీకి దింపింది. దీనితో పాటు తిమార్పూర్ నుండి సూర్య ప్రకాష్ ఖత్రి, నరేలా నుండి రాజ్ కరణ్ ఖత్రి, కిరాడి నుండి బజరంగ్ శుక్లా, చాందినీ చౌక్ నుండి సతీష్ జైన్, సుల్తాన్పూర్ మజ్రా (ఎస్సీ) నుండి కరం సింగ్ కర్మ, ముండ్కా నుండి గజేంద్ర దరాల్, సదర్ బజార్ నుండి మనోజ్ కుమార్ జిందాల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది. ఉత్తమ్ నగర్ నుండి పవన్ శర్మ, వికాస్పూర్ నుండి పంకజ్ కుమార్ సింగ్, కస్తూర్బా నగర్ నుండి నీరజ్ బసోయా, మటియాలా నుండి సందీప్ సెహ్రావత్, ద్వారక నుండి ప్రద్యుమాన్ రాజ్‌పుత్, పాలం నుండి కుల్దీప్ సోలంకి, రాజిందర్ నగర్ నుండి ఉమాంగ్ బజాజ్, తుగ్లకాబాద్ నుండి రోహ్తాస్ బిధురి, సీలంపూర్ నుండి మనీష్ చౌదరిలను ఎన్నికల్లో పోటీకి నిలిపింది. మొదటి జాబితాలో కూడా 29 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.ఫిబ్రవరి 5న ఒకే దశలో ఎన్నికలుఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు ప్రకటిస్తారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు, 25.89 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. మొదటిసారి ఓటు వేయబోయే మొత్తం ఓటర్ల సంఖ్య 2.08 లక్షలు. ఢిల్లీ ఎన్నికల నిర్వహణకు 13 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 830గా ఉంది. ఇది కూడా చదవండి: ఢిల్లీకి రూ. 2,026 కోట్ల నష్టం -
అతిశీపై అల్కా లాంబా పోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం. -
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
నేతలు పార్టీలు మారడం, సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే. చాలా ఏళ్లుగా ఉన్న ధోరణే. కానీ సిద్ధాంతాలు, విలువలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్లుగా ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేస్తుండటం విశేషం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో ఉన్న 435 మంది బీజేపీ అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి. వీరిలో ఏకంగా 106 మంది, అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వలస వచి్చనవాళ్లే! అందులోనూ 90 మంది గత ఐదేళ్లలో బీజేపీలోకి ఫిరాయించారు! ఈసారి ఎలాగైనా 2019 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలని అధికార బీజేపీ ప్రయతి్నస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రాంతీయ పారీ్టల్లో టికెట్లు రాని వారు, మోదీ మేనియా కలిసొస్తుందని భావించిన వాళ్లు ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు 2019 తర్వాతే పార్టీ తీర్థం తీసుకోవడం విశేషం! తెలంగాణలోనూ 17 మంది బీజేపీ అభ్యర్థుల్లో 11 మంది 2014 తర్వాత వచ్చి చేరిన వారే. వీరిలో చాలామంది మాజీ కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ నేతలే. ఇతర రాష్ట్రాల్లోనూ అంతే.. ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది గనుక వలస నేతలకు పెద్దపీట వేసిందనుకుంటే పార్టీ అత్యంత బలోపేతంగా ఉన్న యూపీ, హరియాణా తదితర చోట్లా ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించేదే! హరియాణాలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున బరిలో ఉన్నవారిలో ఆరుగురు 2014 తర్వాత పారీ్టలో చేరినవారే. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్‌సభ ఎన్నికల ముందే బీజేపీ కండువా కప్పుకున్నారు. పీసీసీ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ కూడా అంతే. ఇక యూపీలో బీజేపీ సొంతంగా పోటీ చేస్తున్న 74 లోక్‌సభ స్థానాలను చూస్తే 23 చోట్ల బరిలో ఉన్నవాళ్లు బయటి నుంచి వచి్చనవారే. అంటే ఏకంగా 31 శాతం! పంజాబ్‌లోని 13 స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస వచి్చన బాపతే. వీరిలో చాలామంది కాంగ్రెస్ మాజీలే. వీరు చాలావరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు. జార్ఖండ్‌లో కూడా 13 మంది బీజేపీ అభ్యర్థుల్లో ఏడుగురు జేఎంఎం, కాంగ్రెస్, జార్ఖండ్ వికాస్ మోర్చాల నుంచి జంప్ చేసిన నేతలే. వీరిలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరెన్ కూడా ఉన్నారు. ఒడిశాలో 29 శాతం, తమిళనాడులో 26 శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపుదారులే! మహారాష్ట్రలోనూ పావు వంతు బీజేపీ అభ్యర్థులు బయటి నుంచి వచ్చిన బాపతే. ఎందుకని..? బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలే గాక బలంగా ఉన్నచోట కూడా ఇలా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహిస్తుండటం వెనుక విజయమే పరమావధి అంటున్నారు. మరీ ముఖ్యంగా గత రెండు లోక్‌సభ ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తోంది. అయినా అక్కడ కూడా 31 శాతం మంది వలసదారులకు టికెట్లివ్వడం ఇందుకు నిదర్శనం. ప్రత్యర్థి పారీ్టలు బలమైన అభ్యర్థులను దింపిన చోట బీజేపీ ప్రధానంగా ఫిరాయింపుదారులనే నమ్ముకుంది. తనకు గెలుపు గుర్రాలు లేరనుకున్న లోక్‌సభ స్థానాల్లో ఇతర పారీ్టల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుకాడటం లేదు!ప్రముఖ జంపర్లు జ్యోతిరాదిత్య సింధియా (కేంద్ర మంత్రి, కాంగ్రెస్ మాజీ నేత–గుణ) జితిన్ ప్రసాద (కాంగ్రెస్ మాజీ నేత–పిలిభీత్) నవీన్ జిందాల్ (ప్రముఖ పారిశ్రామికవేత్త–కురుక్షేత్ర) అశోక్ తన్వర్ (హరియాణా పీసీసీ మాజీ చీఫ్–సిర్సా) ప్రణీత్ కౌర్ (అమరీందర్‌సింగ్ భార్య–పటియాలా) సీతా సోరెన్ (జేఎంఎం ఎమ్మెల్యే–దుమ్కా)– సాక్షి, నేషనల్ డెస్క్ -
పెండింగ్ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం.. పెండింగ్ స్థానాలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల్ని ఖరారు చేశారు. నాలుగు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లతో శుక్రవారం మధ్యాహ్నాం జాబితా విడుదల చేసింది టీడీపీ. లోక్‌సభ స్థానాల్లో భాగంగా.. విజయనగరం అప్పలనాయుడు, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఖరారు చేసింది. అలాగే.. అనంతపురం అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయనణ, కడప నుంచి భూపేష్‌రెడ్డి పేర్లను ప్రకటించింది. ఇక తొమ్మిది అసెంబ్లీ స్థానాలకుగానూ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తానికి పంతం నెగ్గించుకుని గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి సీటు దక్కించుకున్నారు. విజయనగరం చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీకి మరో సీనియర్ కళా వెంకట్రావ్‌ను చంద్రబాబు ముందుంచారు. దర్శిలో గొట్టిపాటి లక్ష్మికి అవకాశం కల్పించారు. కదిరిలో యశోదా దేవిస్థానంలో కందికుంట వెంకట ప్రసాద్‌కు ఛాన్స్ ఇచ్చారు. బీసీలకు వెన్నుపోటు మొత్తం మీద లోక్ సభ సీట్లకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే బీసీలకు వెన్నుపోటు అన్నది పూర్తిగా స్పష్టమవుతోంది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 20 ఆన్ రిజర్వ్డ్ సీట్లలో ఏకంగా 11 సీట్లను బీసీలకు కేటాయించింది. టీడీపీ కూటమి మాత్రం 20 ఆన్ రిజర్వ్ సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించింది. బీసీ జనాభా అధికంగా ఉన్న సీట్లలోనూ చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి సీట్లు కేటాయించుకున్నారు. కూటమి తరపున 25 సీట్లకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 సీట్లకు పోటీ చేస్తున్నారు. కాపులకు 17 లోక్ సభ సీట్లలో ఒక్క సీటు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. భీమిలిలో బేరాలు భీమిలిలో గంటా టికెట్ విషయంలో చివరివరకు డ్రామా నడిచింది. ఈ సీటు విషయంలో గంటాకు ఇవ్వడానికి ససేమిరా అన్న చంద్రబాబు.. చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాకు సూచించారు. అయితే గంటా మాత్రం ఓడిపోయే సీటు నాకెందుకంటూ పేచీ పెట్టారు. భీమిలి సీటు ఇస్తే.. ఎంత ఖర్చయినా పెడతానంటూ గంటా ముందుకురావడంతో చంద్రబాబు ఓకే అన్నట్టు తెలిసింది. భీమిలితో పాటు జిల్లాలోని కనీసం నాలుగు చోట్ల ఖర్చంతా పెట్టుకోవాలని గంటాకు షరతు పెట్టినట్టు తెలిసింది. ఓడిపోయే సీటు నాకు వద్దు బాబోయ్.. అని కళా వెంకట్రావు అరిచి గీ పెట్టినా.. ఆయనకు మళ్లీ చీపురుపల్లిని అంటగట్టాడు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కళాకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర విమర్శలు రావడంతో.. కళా వెంకట్రావుకు చీపురుపల్లిని ఇచ్చినట్టు తెలిసింది. వారసులకు మొండి చేయి అనంతపురంలో సీనియర్ నేత ప్రభాకర్ చౌదరికి నిరాశ మిగిలింది. జేసీ వారసుడు పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. ఇటీవల పరిటాల శ్రీరామ్‌కు కూడా చంద్రబాబు మొండిచేయే చూపించాడు. ధర్మవరం నియోజకవర్గంలో టికెట్‌ను పరిటాల శ్రీరామ్ ఆశించగా.. ఆ టికెట్‌ను బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించాడు. దీంతో ఇక్కడ పరిటాల శ్రీరామ్ బద్ధ శత్రువు వరదాపురం సూరికి టికెట్ దక్కింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సూరికి.. టీడీపీ ఇంఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఏ మాత్రం మద్ధతివ్వబోడని బహిరంగంగానే అంటున్నారు. చంద్రబాబు పెనుకొండ మీటింగ్ సందర్భంగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. గుమ్మనూరు విషయంలో ఏం జరిగింది? గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంను ప్రకటించాడు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో టిడిపిని సుదీర్ఘకాలం నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌కు బాబు వెన్నుపోటు పొడిచినట్టయింది. జయరాంకు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జితేంద్రగౌడ్‌కు చివరకు నిరాశే మిగిల్చాడు చంద్రబాబు. చివరిక్షణంలో YSRCP నుంచి వచ్చిన గుమ్మనూరుకు టికెట్ ఎలా ఇస్తారంటూ స్థానిక టిడిపి నేతలు ఊసురుమంటున్నారు. ఇన్నాళ్లు గుమ్మనూరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన తాము.. ఇప్పుడు ఆయన్ను గెలిపించాలని ఓటర్లను ఎలా అడుగుతామని అంటున్నారు. చివరికి గుమ్మనూరు ఓడిపోతాడని IVRS సర్వేల్లో తేలినా.. వెన్నుపోటు అన్న ప్రచారానికి భయపడి సీటు కేటాయించినట్టు తెలిసింది. మొత్తమ్మీద ఈ వ్యవహారం వెనక భారీగా డబ్బు లావాదేవీలు జరిగినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. గుమ్మనూరు డబ్బు సమర్పించుకోవడం వల్లే జితేంద్రకు అన్యాయం జరిగిందంటున్నారు. -
ఎనిమిది చోట్ల ఖరారుపై తకరారు!
ఆదిలాబాద్ ఈ లోక్‌సభ సీటులో స్థానిక నేతలు కాకుండా బయటి నుంచి తెచ్చిన వారిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రమేశ్ రాథోడ్ ఇప్పుడు పార్టీలో లేరు. అంతకంటే ముందు పోటీచేసిన డాక్టర్ నరేశ్ జాదవ్ పార్టీలోనే ఉన్నా వేరే అభ్యర్థి కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో రిమ్స్‌లో వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సుమలత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణలలో ఒకరిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. వీరిలో సుమలత పేరు ఖరారైందని తొలుత ప్రచారం జరిగినా.. ఇప్పుడు ఆత్రం సుగుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వరంగల్ ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటించిన రెండు ఎస్సీ రిజర్వుడ్ సీట్లను మాల సామాజిక వర్గానికే ఇచ్చారు. దీంతో ఇక్కడ మాదిగ సామాజికవర్గ నేతకే చాన్స్ ఇవ్వనున్నారు. తొలుత దొమ్మాట సాంబయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ పార్టీలోకి రావడంతో ఆయన వైపు మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఇద్దరితోపాటు గతంలో లోక్‌సభకు పోటీచేసిన డాక్టర్ రాగమళ్ల పరమేశ్వర్ కూడా టికెట్ అడుగుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థిని తేల్చడంలో గందరగోళం కనిపిస్తోంది. కరీంనగర్ : ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్‌రెడ్డి పేరు ప్రచారంలో ఉంది. వెలిచాల రాజేందర్రావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని అంటున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. నిజామాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ముత్యాల సునీల్‌రెడ్డి కూడా ఎంపీ టికెట్ అడుగుతున్నారు. ఇక్కడ జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైందని చెప్తున్నా అధికారికంగా ప్రకటించలేదు. ఖమ్మం: ఈ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులలో ఎవరికి అవకాశం అన్నదానిపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. మల్లు నందిని, పొంగులేటి ప్రసాదరెడ్డి, తుమ్మల యుగంధర్లతోపాటు పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. మంత్రుల కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా? కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యమిస్తారా? బీసీ వర్గాలకు టికెట్ ఇస్తారా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. భువనగిరి: ఇక్కడ కూడా ఖమ్మం లోక్‌సభ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ సీటుకు సంబంధించి తొలినుంచీ టీపీసీసీ ఉపాధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అనుచరుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తర్వాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి లక్ష్మి పేరును సీరియస్‌గా పరిశీలించారు. అయితే రాజగోపాల్‌రెడ్డి మాత్రం తాము టికెట్ అడగడం లేదని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తాను మంత్రిని అవుతానని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీలోకి వస్తారని, ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా అది ఆచరణలోకి రాలేదు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన మరో నాయకుడు పవన్‌రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. తాజాగా బీసీ నేతకు భువనగిరి టికెట్ వస్తుందనే చర్చ జరుగుతోంది. దీనితో గందరగోళంగా మారింది. మెదక్: ఈ లోక్‌సభ సీటును బీసీలకు ఇస్తారని మొదట్నుంచీ ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి, పటాన్చెరు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిన నీలం మధు ముదిరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహ కుమార్తె త్రిష కూడా పోటీలో ఉన్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల తనకు మెదక్ ఎంపీ టికెట్ కావాలని అడిగినా.. ఆమెను టీజీఐఐసీ చైర్మన్‌గా నియమించడంతో రేసు నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. మెదక్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. హైదరాబాద్ హైదరాబాద్ టికెట్ విషయంలోనూ ఏమీ తేలలేదు. ఇక్కడ ఎంఐఎంకు ప్రతిగా ఎంబీటీని ప్రోత్సహించాలని తొలుత భావించారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపాలని తర్వాత నిర్ణయించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్‌తోపాటు అలీ మస్కతిల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా న్యాయవాది షహనాజ్ తబసుమ్ అభ్యర్థిత్వాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు. ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఎలాంటి స్పష్టతా లేదు. -
TDP : మూడో జాబితా చూస్తే వెన్నుపోటు అంటే ఏంటో తెలుస్తుంది
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ మరీ.! భీమిలి నుంచి గంటాకు నో, మూడో జాబితాలో మొండి చేయి, చీపురుపల్లి నుంచి చేస్తే చేయ్.. లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్టు తెలిసింది. తెలుగుదేశం రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుండా లక్ష్మీదేవి, డబ్బు సంచులకే ప్రాధాన్యం తనను పక్కనబెట్టారని అంటున్నారు విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు చోటు దక్కకుండా చక్రం తిప్పాడు, బాలకృష్ణ తోడల్లుడి కొడుకు భరత్‌కు విశాఖ ఎంపీ సీటు ప్రకటించాడు, కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టిడిపికి అప్పగించారని పురందేశ్వరీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా.. కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు. మైలవరంలో దేవినేని ఉమా మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే వంద కోట్లు ఇచ్చిన కృష్ణప్రసాద్‌కు టిడిపి టికెట్ ఇచ్చినట్టు తాజా జాబితా బట్టి తేలిపోయింది. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకు టికెట్ ఇచ్చాడు బాబు. డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణ అయింది. శంకర్, గోవింద్రావు ఇద్దరిది అదే అర్హత అన్న విమర్శలున్నాయి పెనమలూరు టికెట్ పార్ధసారధి యాదవ్‌కు ఇస్తానని టీడీపీ లోకి తీసుకొని నూజివీడుకు పంపించారు చంద్రబాబు. అక్కడ బోడె ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు. అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్సిపి నుంచి ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరిన తర్వాత మొండిచేయి చూపించాడు బాబు. కాపు ,యాదవ, చేనేత ,బిసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మలను రంగంలోకి దించినట్టు తేలిపోయింది. విశాఖ ఎంపీగా భరత్ (కమ్మ) vs బొత్స ఝాన్సీ (కాపు) గుంటూరు ఎంపీ గ పెమ్మసాని (కమ్మ) vs కిలారు రోశయ్య(కాపు) నరసారావు పేట ఎంపీగా లావు vs అనిల్ యాదవ్ (యాదవ బీసీ) మంగళగిరి లో లోకేష్ vs కాండ్రు లావణ్య (చేనేత బీసీ ) కుప్పం లో బాబు vs భరత్ (వన్నెకుల క్షత్రియా బిసీ ) -
YSRCP సిద్ధం : వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
Updates సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈరోజు 50 శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్థానాలకు కేటాయించాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఎప్పుడూ జరగలేదు. దాదాపు 99 స్థానాల్లో మార్పులు చేశాం. ప్రజల మీద నమ్మకంతో మార్పులు చేశాం. టికెట్ రాని వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా భరోసా. విప్లవాత్మక మార్పులతో ఈ ఐదేళ్ల పాలన జరిగింది. ఎక్కడా లంచం లేకుండా సంక్షేప పథకాలు ప్రజలకు అందాయి. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. దేశ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో ఇది లిఖించదగిన అంశం. గ్రామాలు మారాయి. స్కూల్స్ బాగుపడ్డాయి. ఆసుపత్రులు మారాయి. మహిళా సాధికారత, సామాజిక న్యాయం చేసి చూపించాం. మార్పులను ప్రజలు గమనించాలి. రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం మరింత ఎక్కువగా అందిస్తామన్నారు. ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నందిగామ సురేష్.. అనకాపల్లి స్థానం పెండింగ్‌లో ఉంది. మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకు 200 సీట్లకు గాను 100 స్థానాలు కేటాయించారు. సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు కేటాయింపు. ఎంపీల విద్యార్థత.. 25 మంది ఎంపీ అభ్యర్థుల్లో 88 శాతం ఉన్నత విద్యావంతులే. ఇందులో 22 మంది డిగ్రీ ఆపైన చదువుకున్న వారు. 25 మంది అభ్యర్థుల్లో ఐదుగురు డాక్టర్లు, నలుగురు లాయర్లు. ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒకరు మెడికల్ ప్రాక్టిషనర్. ఎమ్మెల్యేల విద్యార్హత.. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 131 మంది విద్యావంతులు. 77 శాతం మంది ఉన్నత విద్యావంతులకే సీట్లు కేటాయింపు. 2024 ఎన్నికల బరిలో 18 మంది డాక్టర్లు, 15 మంది అడ్వకేట్లు. 34 మంది ఇంజినీర్లు, ఐదుగురు టీచర్లు, ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఒకరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగి, ఒక జర్నలిస్టు. 25 ఎంపీ సీట్లకు గాను ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లను కేటాయించారు. ►ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలైన 200 సీట్లలో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అదనంగా 11 సీట్లు కేటాయించిన సీఎం వైఎస్ జగన్. ►2019లో బీసీలకు 41 స్థానాలు కేటాయిస్తే ఈసారి 48 సీట్లు కేటాయింపు. ►2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే.. 2024లో నాలుగు స్థానాలు పెంపు. ►2019లో మైనార్టీలకు ఐదు ఎమ్మెల్యే స్థానాలు కాగా.. 2024లో మరో రెండు స్థానాలు పెంచి ఏడు స్థానాలు కేటాయింపు. ►2019లో మహిళలకు రెండు ఎంపీ స్థానాలు ఇస్తే.. ఈసారి ఒకసీటు అదనంగా మూడు సీట్లకు పెంపు. ►2019లో ఎంపీ ఎన్నికల్లో ఎస్సీలకు నాలుగు, బీసీలకు 12 సీట్లు కాగా.. 2024లో బీసీలకు అదనంగా నాలుగు సీట్లు కేటాయింపు. ►2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయింపు. ►2024 ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి 100 సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయింపు. ►2019లో మహిళలు, మైనార్టీలకు 18 సీట్లు ఇస్తే.. ►2024లో ఆరు సీట్లు పెంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 24 సీట్లు ఇచ్చి తన మార్క్ చాటుకున్న సీఎం జగన్. ►2019 ఎన్నికల్లో మహిళలకు 15 చోట్ల ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు.. ఈసారి ఆరు సీట్లు పెంచి 24 చోట్ల అవకాశం. ►2024 ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 14 ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు. వైఎస్సార్‌ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్ ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలతో నివాళులర్పిస్తున్న సీఎం జగన్, వైఎస్సార్సీపీ నేతలు కాసేపట్లో ఇడుపులపాయకు సీఎం జగన్ కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ కాసేపట్లో ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్ కి బయల్దేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి. జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు: సజ్జల అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చాం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నాం వైఎస్సార్సీపీ తుది జాబితాలో ఇది కనిపిస్తుంది ఇడుపులపాయకు బయల్దేరిన సీఎం జగన్ వైఎస్సార్‌ఘాట్ వద్ద కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన మధ్యాహ్నం 12.30కు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళి ఆ తర్వాత.. మధ్యాహ్నాం 12.50 నుంచి 1.20 వరకు జాబితా ప్రకటన సీఎం జగన్ సమక్షంలో.. అభ్యర్థుల పేర్లను రిలీజ్ చేయనున్న వైఎస్సార్సీపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల కోసం 175, లోక్‌సభ ఎన్నికల 25 మంది పేర్లను ఒకేసారి ప్రకటించనున్న పార్టీ సామాజిక న్యాయం ప్రతిబింబించేలా జాబితా.. ►మధ్యాహ్నాం 12.58 నిమిషాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన ►సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల్ని ప్రకటించనున్న ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ ►బీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఉండే అవకాశం ►అన్ని వర్గాలకు అవకాశాలు ఉండేలా తుది జాబితా ►ఇప్పటికే 68 అసెంబ్లీ స్థానాలకు మార్పులు ప్రకటించిన వైఎస్సార్సీపీ ►32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలకు పక్కన పెట్టిన అధిష్టానం ►సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములే ప్రామాణికంగా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించనున్నారు. ►ఇడుపులపాయ వద్ద 200 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు, నందిగామ సురేష్ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ►వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటే అవకాశం. అన్ని వర్గాలకు అవకాశం ఉండే విధంగా వైఎస్సార్సీపీ జాబితా రూపొందించినట్టు సమాచారం. సీఎం జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. ►అక్కడ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం ఇడుపులపాయ నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ►మరోవైపు గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశ్వసనీయతను చాటుకున్నారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మేనిఫెస్టోను ప్రకటించాక.. ఆ వెంటనే పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రచార భేరి మోగించనున్నారు. ►ఈ నెల 18 నుంచి ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రచార ప్రణాళికను రూపొందించారని తెలుస్తోంది. ఓవైపు సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. మరోవైపు వైఎస్సార్సీపీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకెళ్లే దిశగా అడుగులేస్తోంది. -
మరో నలుగురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్‌లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది. ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు -
నేడే బీజేపీ రెండో జాబితా?.. తెలంగాణ నుంచి రేసులో వీరేనా!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ సారించింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. అయితే.. ఆ అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రమే వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంతోనే తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగానే జరుగుతున్నాయి. బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, నిన్న(ఆదివారం) బీఆర్ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో, వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు. టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు.. మహబూబ్‌నగర్: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్ మహబూబాబాద్: సీతారాం నాయక్ ఖమ్మం: జలగం వెంకట్రావు నల్గొండ: శానం సైదిరెడ్డి వరంగల్: కృష్ణ ప్రసాద్ పెద్దపల్లి: ఎస్. కుమార్ -
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్‌సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్‌క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్‌కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్‌లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్‌వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్‌నగర్‌లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్‌రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్‌కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్‌కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
BJP: లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్‌రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్‌నగర్- డీకే అరుణ, నాగర్‌కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు -
‘ఇండియా’కు మరో షాక్.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఏకపక్షంగా వ్యవహరించింది. కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్ అన్నారు. ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. కాంగ్రెస్ బ్లాక్‌పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని -
వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ ల నాలుగో జాబితా విడుదల
-
చివరి నిమిషంలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. బీఆర్ఎస్కు అదే ప్లస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్కు ఓటమి ఎదురయ్యేది. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు ఇవే.. అలంపూర్: అబ్రహం స్థానంలో విజయుడికి సీటు.. గెలుపు. జనగాం: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు.. గెలుపు స్టేషన్ ఘనపూర్: తాటికొండ రాజయ్య స్థానంలో కడియంకు అవకాశం.. గెలుపు. నర్సాపూర్: మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం.. గెలుపు ఆసిఫాబాద్: ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం.. గెలుపు దుబ్బాక: ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం.. గెలువు బోథ్: రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం.. గెలువు ఉప్పల్: బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు. మల్కాజ్గిరి: మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం.. విజయం. -
వీరంతా బీజేపీ అభ్యర్థులేనా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీలోని పాతకాపులతోపాటు ఏబీవీపీ, యువమోర్చా విభాగాల్లోని వారు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీ ప్రకటించిన 111 మంది అభ్యర్థుల్లో 30–35 మంది మాత్రమే పాతనేతలు, పార్టీ సిద్ధాంత భూమిక ఉన్నవారని.. ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక భూమిక ఉన్న పార్టీగా ప్రజలకు ఏరకమైన సందేశాన్నిస్తారని నిలదీస్తున్నారు. అసలు ఈ అభ్యర్థులను బీజేపీ వారిగా భావించవచ్చా? ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాక వీరిలో ఎంత మంది పార్టీలో మిగులుతారనే ప్రశ్నలను సంధిస్తున్నారు. పార్టీలో ప్రస్తుత ముఖ్యనేతలు, మరీ ముఖ్యంగా బయట నుంచి వచ్చిన నేతలు వర్గాల వారీగా విడిపోయి తమ అనుయాయులకు పెద్దసంఖ్యలో టికెట్లు ఇప్పించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. టికెట్ల ఖరారులో డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలతో బీజేపీ విమర్శల పాలైదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రపార్టీలోని ముఖ్యనేతలు తమ వారికి టికెట్లు ఇప్పించుకునేందుకు చేసిన హెచ్చరికలకు జాతీయ, రాష్ట్రనాయకత్వాలు లొంగిపోవడం ఎలాంటి సంకేతాలిస్తాయంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో ముందు నుంచి ఉన్న ముఖ్యనేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు కొందరు వర్గాలుగా విడిపోయి టికెట్ల కేటాయింపులో తమ పట్టును నిలుపుకునేలా ఒత్తిళ్లు తెచ్చి పైచేయి సాధించడం వంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదంటున్నారు. ఏళ్లకు ఏళ్లు పనిచేసినా... నల్లగొండ, చేవెళ్ల, మహబూబాబాద్ ఎంపీ సీట్ల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా పాతకాపులు, పార్టీ సిద్ధాంతాలు నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా పనిచేస్తున్న వారికి అవకాశం లభించలేదని వారు వాపోతున్నారు. ఈ స్థానాల్లో కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటున్నారు. రెండు, మూడువారాల వ్యవధిలోనే పార్టీలో చేరిన పది, పదిహేను మందికి సీట్లు ఇవ్వడం పట్ల విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఈ స్థానాల్లో వీరంతా కచ్చితంగా గెలుస్తారని నాయకత్వం చెప్పగలదా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటపుడు అన్నిచోట్లా కాకపోయినా వీలున్న చోట్ల అయినా పార్టీని నమ్ముకున్న వారికి పార్టీకి బలపడేందుకు అవకాశం ఉండేదని వాదిస్తున్నారు. మొత్తంగా 111 స్థానాల వారీగా పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల పూర్వాపరాలు, గతంలో ఉన్న పార్టీలు వంటి వాటిని పరిశీలిస్తే... వీరిలో చాలామంది రెండు, మూడుపార్టీలు మారిన వారేనని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలనే యోచనలో దీర్ఘకాలం పార్టీలో పనిచేసిన పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన కాంగ్రెస్ సీఈసీ సమావేశం
-
నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్‌లో రాజాసింగ్ పేరు!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’ -
నేడే కాంగ్రెస్ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. గత నెలరోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసిన నేపథ్యంలో ఆదివారం ఏ సమయంలోనైనా 58 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా వస్తుందని ఏఐసీసీ వర్గా లు వెల్లడించాయి. ఆ తర్వాత ఇంకొక్క జాబితాలోనే మిగిలిన అభ్యర్థులను ప్రకటించాలని కూ డా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈనెల 18న ఆ జాబితా కూడా వస్తుందని తెలుస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనా ఒకట్రెండు రోజులేనని, ఈనెల 20లోపు 119 మంది అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, అభ్యర్థుల ప్రకటన అంశంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆదివారం 58 మందితో తొలి జాబితా వస్తుందని వెల్లడించడం గమనార్హం. -
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది. -
కర్ణాటక కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
-
కర్ణాటక: మూడో విడత జాబితాలో భారీ పోటీ.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు
శివాజీనగర(బెంగళూరు): పెండింగ్‌లో ఉన్న 58 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్ సుర్జెవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, ప్రతిపక్ష నాయకులు సిద్దరామయ్య తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రెండో విడతలో ప్రకటించిన 42 మంది అభ్యర్థుల లిస్టులో భారీ అసంతృప్తులు వినిపించాయి. టికెట్ రానివారు జేడీఎస్– బీజేపీ వైపు చూశారు. ఇలా పార్టీని వీడిన వారిలో బలమైన నాయకులు ఉండటం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. మూడో విడత జాబితాలో భారీ పోటీ నెలకొంది. దీని వల్ల నేతల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్నీ చర్చించిన తరువాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. -
కర్ణాటక ఎన్నికలు: 124 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ‘రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిటీ ఖరారు చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితా ఇదే’ అంటూ పార్టీ అభ్యర్థుల జాబితాను ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రకటించిన తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్లు ఉన్నాయి. కాగా డీకే శివకుమార్ కనకపుర స్థానం నుంచి పోటీ చేస్తుండగా.. సిద్ధరామయ్య ఈ సారి కోలార్ స్థానం నుంచి కాకుండా వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇందుకోసం ఆయన కుమారుడు యతీంద్ర తన సీటును త్యాగం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే.. చీతాపూర్ నుంచి, మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర కోరటగెరె స్థానం నుంచి బరిలోకి దిగుతున్నట్లు పార్టీ ప్రకటించింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన తొలి పార్టీ కాంగ్రెస్సే. ఈ ఏడాది మే నెలతో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి వారంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా... మేలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కర్ణాటక ఎన్నికలు: వయసుల వారీగా కాంగ్రెస్ తొలి జాబితా 30 ఏళ్లలోపు : 1 40 లేదా అంతకంటే తక్కువ: 12 50 లేదా అంతకంటే తక్కువ: 22 55 లేదా అంతకంటే తక్కువ: 26 60 లేదా అంతకంటే తక్కువ: 19 60 : 44 కంటే ఎక్కువ కాంగ్రెస్ తొలి జాబితాలో 20% లింగాయత్‌లకు కేటాయించారు పంచమశాలి లింగాయత్ 7 రెడ్డి లింగాయత్ 5 సదర్ లింగాయత్ 3 వీరశైవ లింగాయత్ 3 లింగాయత్ (ఇతరులు) 4 బంజిగ లింగాయత్ 3 గణిగ లింగాయత్ 2 నోనాబా లింగాయత్ 1 -
యూపీలో 172 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: వచ్చే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 172 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటివరకు శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాథూ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవచ్చు. చదవండి: UP Assembly Election 2022: అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు! ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమై ఏడు దశల్లో సాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశల్లో పోలింగ్ జరిగే నియోజకవర్గాలపైనే బీజేపీ అత్యధిక దృష్టి సారించింది. 172 మంది అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. గురువారం జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర నేతలు నేరుగా హాజరు కాగా ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. సగం కొత్తవారికే..!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఆరుగురు కొత్తవారికి టీఆర్ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు అవకాశమిచ్చారు. మరో ఆరుగురు పాతవారిని అభ్యర్థులుగా ఎంపిక చేశారు. సామాజిక, కుల సమీకరణాలు, తాను ఇచ్చిన హామీలు, మంత్రుల అభిప్రాయాలు, పార్టీ కోసం పనిచేస్తున్న నేతలు తదితర అంశాల ప్రాతిపదికగా 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు నామినేషన్లు సిద్ధం చేసుకోవాలని ఒక్కొక్కరుగా అభ్యర్థులకు సమాచారం అందింది. కేసీఆర్ ఈ బాధ్యతలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావుకు అప్పగించి ఢిల్లీ వెళ్లగా.. హరీశ్‌రావు అభ్యర్థులకు ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు సమాచారం. అన్నింటినీ బేరీజు వేశాకే.. ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక, కుల సమీకరణాలను బేరీజు వేసుకున్నాకే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు చెప్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఐదుగురే పాతవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), టి.భానుప్రసాదరావు (కరీంనగర్) ఉన్నారని.. వారు మరోమారు స్థానిక కోటాలో పోటీలో ఉంటారని సమాచారం. నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత.. ఈసారి పోటీకి అనాసక్తిగా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఆమె వద్దనుకుంటే ఎమ్మెల్యే కోటాలో రిటైరైన ఆకుల లలితకు స్థానిక కోటాలో అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. కవిత పోటీకి దిగితే మాత్రం ఆరుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చినట్టవుతుంది. అయితే ఆకుల లలిత అభ్యర్థిత్వమే ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీవర్గాలు చెప్తున్నాయి. కొత్తగా అవకాశం వచ్చిన జాబితాలో గాయకుడు సాయిచంద్ (మహబూబ్‌నగర్), ఎల్.రమణ (కరీంనగర్), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), దండె విఠల్ (ఆదిలాబాద్), తాతా మధు (ఖమ్మం), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) ఉన్నారు. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న తొమ్మిది జిల్లాల మంత్రులతో కేసీఆర్ సమావేశమై స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. చేజారనివ్వొద్దు.. ఎన్నికలు జరగనున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు సంపూర్ణ బలం ఉందని.. ఓటర్లు చేజారకుండా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు సమాచారం. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేయడం సహా ఇతర జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో నామినేషన్లు సిద్ధం చేసుకునేలా అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ మేరకు మంత్రులతోపాటు, పార్టీపక్షాన మంత్రి హరీశ్‌రావు సదరు అభ్యర్థులకు ఫోన్‌చేసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. అభ్యర్థిత్వం ఖరారైన నేతలు సోమ లేదా మంగళవారాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తమకు పార్టీపరంగా సమాచారం అందిందని, నామినేషన్లకు సిద్ధమవుతున్నామని కొందరు అభ్యర్థులు ‘సాక్షి’కి ధ్రువీకరించారు. హామీలు, సాన్నిహిత్యంతో.. శాసన మండలిలో పద్మశాలి సామాజికవర్గానికి అవకాశమిస్తామనే సీఎం హామీ మేరకు ఎల్.రమణకు అవకాశం వచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఎంసీ కోటిరెడ్డికి.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ యాదవరెడ్డికి జాబితాలో చోటు దక్కింది. గతంలో సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దండె విఠల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన స్వస్థలం సిర్పూర్ కాగజ్‌నగర్ కావడంతో ప్రస్తుతం ఆదిలాబాద్ ‘స్థానిక’ కోటా అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సాన్నిహిత్యంతోపాటు చాలాకాలంగా టీఆర్ఎస్లో కొనసాగుతుండటంతో తాతా మధుకు ఖమ్మం అభ్యర్థిత్వం దక్కినట్టు చెప్తున్నారు. ఉద్యమ సమయం నుంచి సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా ఉన్న సాయిచంద్‌కు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. 12 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఏడుగురు ఓసీలు, నలుగురు బీసీలు, ఒక ఎస్సీ సామాజికవర్గ అభ్యర్థికి ప్రాతినిధ్యం లభించింది. అభ్యర్థుల వారీగా చూస్తే.. పట్నం మహేందర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి (రెడ్డి), భానుప్రసాద్‌రావు (వెలమ), తాతా మధు (కమ్మ) ఓసీ కేటగిరీలో ఉన్నారు. బీసీ కేటగిరీలో శంభీపూర్ రాజు, ఆకుల లలిత, దండె విఠల్ (మున్నూరు కాపు), ఎల్.రమణ (పద్మశాలి) అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఎస్సీ (మాల) కేటగిరీలో సాయిచంద్‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. సిట్టింగ్‌లు రంగారెడ్డి: శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్‌రెడ్డి వరంగల్: పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కరీంనగర్: భానుప్రసాదరావు మహబూబ్‌నగర్: కసిరెడ్డి నారాయణరెడ్డి కొత్తవారు ఎల్.రమణ, సాయిచంద్, దండె విఠల్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, తాతా మధు. మళ్లీ పోటీకి అవకాశం దక్కనివారు నారదాసు లక్ష్మణరావు (కరీంనగర్), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి (మహబూబ్‌నగర్), పురాణం సతీశ్ (ఆదిలాబాద్), తేరా చిన్నపరెడ్డి (నల్లగొండ), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), వి.భూపాల్‌రెడ్డి (మెదక్) ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ దూరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలతో ఈ విషయమై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పార్టీకి తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే బీజేపీ స్ధానిక సంస్థల ప్రతినిధులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరాదని, ఒకవేళ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా మద్దతు కోరితే ఆలోచించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేసిన ఆరు పేర్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. వారి వివరాలను పరిశీలిస్తే.. సి.రామచంద్రయ్య చార్టర్డ్ అకౌంటెంట్‌గా మొదలుపెట్టి.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి అయిన సి.రామచంద్రయ్య 1948, మే 27న కడపలో జన్మించారు. ఆయన కొంతకాలం చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. 1985–89 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 1986–88 మధ్య ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. 1999–2004 మధ్యకాలంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్స్ చైర్మన్‌గా పనిచేశారు. 2011లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2012లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. చల్లా భగీరథరెడ్డి తండ్రి బాటలో నడుస్తూ.. ఎమ్మెల్సీ అభ్యర్థి చల్లా భగీరథరెడ్డి 1976లో చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన భగీరథరెడ్డి 2003 నుంచి 2009 వరకు కర్నూలు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2008 వరకు జాతీయ స్థాయి యువజన కాంగ్రెస్ సెక్రటరీగా, 2009 నుంచి 2010 వరకు ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాజకీయంగా తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇంజనీరింగ్ చదివి.. దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు కుమారుడైన 36 ఏళ్ల బల్లి కళ్యాణ్‌చక్రవర్తి బీఈ వరకు చదివారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని 16వ వార్డు ఆయన స్వస్థలం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకుడుగా కొనసాగుతున్నారు. గత 12 ఏళ్లుగా తండ్రి బల్లి దుర్గాప్రసాద్‌రావుకు రాజకీయంగా చేదోడుగా ఉంటున్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఖాకీ వృత్తి నుంచి రాజకీయాల్లోకి.. షేక్ మహమ్మద్ ఇక్బాల్ విశ్రాంత ఐజీ. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఎంఏ వరకు చదివిన ఆయన 35 ఏళ్లపాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో మొదటిసారి ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. మార్చి 29తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కరీమున్నీసా కార్పొరేటర్‌గా మొదలై.. ఎండీ కరీమున్నీసా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్. భర్త ఎండీ సలీం. ఏడవ తరగతి వరకు ఆమె చదివారు. 2014లో జరిగిన విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున 54వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి కూడా డివిజన్ అభివృద్ధికి కరీమున్నీసా కృషి చేశారు. అలాగే పార్టీ బలోపేతానికీ కృషి చేశారు. ప్రస్తుతం 59వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ ఎంపిక చేసింది. దువ్వాడ శ్రీనివాస్ పోరాటాలతో ప్రస్థానం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన దువ్వాడ శ్రీనివాస్ 1964లో దువ్వాడ కృష్ణమూర్తి, లీలావతి దంపతులకు జన్మించారు. కాకినాడ పీఆర్ కళాశాలలో ఎంఏ లిటరేచర్, బీఎల్ చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా వ్యవహరించారు. 2006లో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున టెక్కలి ఎమ్మెల్యే పదవికి పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. అలాగే 2014లో టెక్కలి అసెంబ్లీకి, 2019లో శ్రీకాకుళం ఎంపీ పదవికి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. రాజకీయ ఆరంభం నుంచి కింజరాపు కుటుంబ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ పోరాటం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో అత్యధికంగా 112 సర్పంచ్ స్థానాల గెలుపునకు కృషి చేశారు. చదవండి: (ఎమ్మెల్సీ ఎన్నికలు: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్)