సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ సారించింది. ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇక, ఇప్పుడు రెండో జాబితా కోసం కసరత్తుల్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. రెండో జాబితా అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. అయితే.. ఆ అభ్యర్థుల జాబితా ఇవాళ సాయంత్రమే వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంతోనే తెలంగాణలో బీజేపీలోకి చేరికలు భారీగానే జరుగుతున్నాయి. బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కాగా, నిన్న(ఆదివారం) బీఆర్‌ఎస్ మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావ్‌లు బీజేపీలో చేరారు. దీంతో, వీరికి టికెట్స్ ఇస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు బీబీ పాటిల్, రాములు తనయుడు భరత్ టికెట్ దక్కించుకున్నారు.
టికెట్ కోసం రేసులో ఉన్న ఆశావహులు..
మహబూబ్‌నగర్: డీకే అరుణ/ జితేందర్ రెడ్డి
మెదక్: రఘునందన్ రావు/ అంజిరెడ్డి
ఆదిలాబాద్: నగేష్/సోయం బాపురావు/ అభినవ్ సర్దార్
మహబూబాబాద్: సీతారాం నాయక్
ఖమ్మం: జలగం వెంకట్రావు
నల్గొండ: శానం సైదిరెడ్డి
వరంగల్: కృష్ణ ప్రసాద్
పెద్దపల్లి: ఎస్. కుమార్
Comments
Please login to add a commentAdd a comment