‘ఇండియా’కు మరో షాక్‌.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌ | AAP Unilaterally Announces 3 Candidates For MP Elections In Assam | Sakshi
Sakshi News home page

‘ఇండియా’కు మరో షాక్‌.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆప్‌

Published Thu, Feb 8 2024 3:59 PM | Last Updated on Thu, Feb 8 2024 4:13 PM

Aap Unilaterally Announces Three Candidates For Mp Elections - Sakshi

న్యూఢిల్లీ: ఇండియా కూటమి అసలు ఉంటుందా ఉండదా అని అనుమానాలు తలెత్తుతున్న వేళ కూటమి ఉనికిని ప్రశ్నించే మరో పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ అయిన ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్‌) ఏకపక్షంగా వ్యవహరించింది. 

కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలతో సంప్రదించకుండా అస్సాంలోని మూడు ఎంపీ సీట్లకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ గురువారం ఢిల్లీలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అనంతరం మాట్లాడుతూ ఇండియా కూటమి తమ అభ్యర్థులకు మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 

‘ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. అభ్యర్థులను ఫైనల్‌ చేసి ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కూటమి నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి. మేం ఇండియా కూటమితోనే ఉన్నాం’ అని పాఠక్‌  అన్నారు. 

ఇప్పటికే కూటమిలోని మరో ప్రధాన పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) 16 మంది అభ్యర్థులతో యూపీలో తన తొలిజాబితాను ప్రకటించింది. ఓ పక్క కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండగానే ఎస్పీ 16 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం వివాదాస్పదమైంది. తాజగా కూటమిలోని ఆప్‌ పార్టీ కూడా ఇదే పని చేయడంతో కూటమి ఉందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే పరిస్థితి నెలకొంది. 

ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించి ఒక దశలో కన్వీనర్‌ పదవి తీసుకుంటారని ప్రచారం జరిగిన బీహార్‌ సీఎం, జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ ఇప్పటికే కూటమి నుంచి వైదొలిగి బీజేపీతో జతకట్టి బీహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ఇండియా కూటమిని లీడ్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని కలవరానికి గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇదీచదవండి.. కాంగ్రెస్‌ బ్లాక్‌పేపర్‌.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement