యూపీలో 172 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు | BJP Finalised Candidates For 172 Seats In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో 172 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ఖరారు

Jan 14 2022 7:40 AM | Updated on Jan 14 2022 7:40 AM

BJP Finalised Candidates For 172 Seats In Uttar Pradesh - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 172 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేయనుంది. ఇప్పటివరకు శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్య నుంచి, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య సిరాథూ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవచ్చు.

చదవండి: UP Assembly Election 2022: అఖిలేశ్‌కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు!

ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమై ఏడు దశల్లో సాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశల్లో పోలింగ్‌ జరిగే నియోజకవర్గాలపైనే బీజేపీ అత్యధిక దృష్టి సారించింది. 172 మంది అభ్యర్థుల్ని ఖరారు చేయడానికి బీజేపీ తీవ్ర కసరత్తు చేసింది. గురువారం జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు రాష్ట్ర నేతలు నేరుగా హాజరు కాగా ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement