నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్‌లో రాజాసింగ్‌ పేరు! | MLA Raja Singh Name In BJP Candidates List | Sakshi
Sakshi News home page

నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. లిస్ట్‌లో రాజాసింగ్‌ పేరు!

Published Sat, Oct 21 2023 10:16 AM | Last Updated on Sat, Oct 21 2023 10:59 AM

MLA Rajasingh Name In BJP Candidates List - Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. నేడు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా విడుదల కానుంది. ఇక, ఈ జాబితాలోనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పేరు కూడా ఉన్నట్టు సమాచారం. తొలి జాబితాలో దాదాపు 60 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశముంది. 

వివరాల ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ స్పీడ్‌ పెంచింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిన్న అర్ధరాత్రి వరకు సమాలోచనలు చేసింది. ఈ క్రమంలో నేతలు.. అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చూపించారు. ఇక, ఎన్నికల కమిటీ కంటే ముందే జేపీ నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని అమిత్‌ షా సూచించారు. 

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంపీలు  కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్  విముఖత చూపించారు. తాము ఎన్నికల్లో పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు. ఇక, కరీంనగర్ నుంచి బండి సంజయ్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్  పోటీలో నిలుస్తున్నారు. మరోవైపు.. సస్పెన్షన్ ఎత్తివేసి తొలి జాబితాలోనే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు ఉన్నట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: ‘ఆ సీట్లలో రూ.కోట్ల వరద’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement