
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్.
అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment