సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్‌ఎస్ ఫుల్ ఫోకస్ సాధించింది. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో.. అస్వస్థత నుంచి కోలుకుంటున్న అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్షకు దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో.. ఎన్నికల కోసం ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రౌండ్ వర్క్‌పై అధినేత కేసీఆర్ ఆరా తీసి మరీ మందలించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొందరిపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టికెట్లు దక్కాక చాలామంది హైదరాబాద్‌కు తరచూ వస్తూ పోతుండడంపై ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. పని తీరు మారని అభ్యర్థులకు ఆయన వార్నింగ్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జిల్లా అభ్యర్థులు ఎవరూ ఉండకూడదని.. ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు వెళ్లి క్షేత్రస్థాయిలో తిరగాలని ఆయన గట్టిగానే చెప్పినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో మరింత బలంగా పని చేయాలని ఆయన వాళ్లకు సూచించినట్లు సమాచారం.
మరోవైపు ఇప్పటికే అభ్యర్థుల జాబితా ప్రకటించిన బీఆర్‌ఎస్.. మరో ఐదు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో.. ఇవాళో రేపో అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment