
శివాజీనగర(బెంగళూరు): పెండింగ్‌లో ఉన్న 58 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ముకుల్ వాస్నిక్, వీరప్ప మొయిలీ, కే.సీ.వేణుగోపాల్, రణదీప్ సుర్జెవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్, ప్రతిపక్ష నాయకులు సిద్దరామయ్య తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
రెండో విడతలో ప్రకటించిన 42 మంది అభ్యర్థుల లిస్టులో భారీ అసంతృప్తులు వినిపించాయి. టికెట్ రానివారు జేడీఎస్– బీజేపీ వైపు చూశారు. ఇలా పార్టీని వీడిన వారిలో బలమైన నాయకులు ఉండటం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. మూడో విడత జాబితాలో భారీ పోటీ నెలకొంది. దీని వల్ల నేతల భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అన్నీ చర్చించిన తరువాతనే అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment