
సాక్షి, యాదాద్రి : శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల జాబితాను వడబోసే పనిలో పడింది. ప్రతి జిల్లానుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వెళ్లడంతో స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. రాహుల్ దూతలు చేపట్టిన సర్వేలతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేయించిన సర్వేల ఆధారంగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సామాజిక అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంటూ జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కె.జానారెడ్డితోపాటు పలువురు పార్టీ పెద్దలు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేపట్టారు.అంతా సవ్యంగా జరిగితే జాబితా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
6 నియోజకవర్గాల్లోఒకే నామినేషన్, ఒకే అభ్యర్థి
ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలకు ఒకే నామినేషన్, ఒకే అభ్యర్థి పేరు ఖరారు చేసి అధిష్టానానికి పంపినట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నుంచి డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పేర్లు, తుంగతుర్తి నియోజకవర్గానికి మూడు పేర్లు, మునుగోడు నియోజకవర్గానికి మూడు పేర్లు ప్రతిపాదించి పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. మూడు పేర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఒకరి పేరు మాత్ర మే ఖరారు చేయనున్నారు. ఈ విషయమై శుక్రవారం హైకమాండ్, కమిటీలు మరోమారు సమావేశమై పేరు నిర్ణయించి అధిష్టానానికి పంపనున్నట్లు తెలుస్తోంది.
భువనగిరినుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు..
భువనగిరి నియోజకవర్గం కోసం పెద్దఎత్తున ఆ శావహులు అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్న వి షయం తెలిసిందే. అయితే తాజాగా స్క్రీనింగ్ క మిటీ మూడు పేర్లు ఖరారు చేసి వాటిలో ఒకరి పేరు కోసం తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలు స్తోంది. ఒకరి కంటే ఎక్కువ మంది ఆశావహులు టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటైన భువనగిరి అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయ సా ధన ప్రారంభమైంది. ముందుగా మహాకూటమికి భువనగిరి స్థానం కేటాయిస్తారని ప్రచారం జరిగి నా తాజా పరిణామాలతో ఆలోచన లేనట్లేనని తెలుస్తోంది. భువనగిరి సీటు మహాకూటమి అ భ్యర్థి కోసం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున చేసిన ప్ర యత్నాలు ఫలించలేదు.
అయితే అభ్యర్థుల ఎంపి క ఇంకా ఖరారు కాకపోవడంతో పొత్తులో భాగంగా మహాకూటమి భాగస్వాములు భువనగిరిని కోరే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నా రు. అయితే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నాయకుల పేర్లను రా ష్ట్ర నాయకత్వం పరిగణనలోకి తీసుకుని పరిశీలి స్తోంది. అయితే ముగ్గురిలో ఒక్క పేరు మాత్రమే అధిష్టానానికి పంపించడానికి నేతల మధ్యన ఏకా భిప్రాయంకోసం కమిటీ ప్రయత్నిస్తోంది.
రాహుల్‌గాంధీ టెలీ కాన్ఫరెన్స్
ఎన్నికల నేపథ్యంలో పార్టీ పనితీరుపై రాహుల్‌గాంధీ, డీసీసీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎన్ని గెలుస్తాయి, కార్యకర్తల పనితీరు, నాయకుల పనితీరు, సామాజిక సమీకరణలపై సమాచారాన్ని సేకరించారు. ఉమ్మడి జిల్లాల డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డీసీసీ అధ్యక్షుడి హోదాలో టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులపై ఆయన తన నివేదికను రాహుల్‌కు సమర్పించారు.
కొనసాగుతున్న సర్వేలు
కాంగ్రెస్ పార్టీ సర్వేలు కొనసాగుతున్నాయి. ఏఐ సీసీ, టీపీసీసీ నుంచి రెండు వేర్వేరుగా ఆశావహులపై ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నారు. భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏరోజుకారోజు సర్వేలు నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహాకూటమి ఏర్పాటుతో టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే ప్రజల్లో పలుకుబడి కలిగిన నాయకులనే పోటీలో ఉంచాలని తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment