
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో నలుగురు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించింది. చేవెళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య, జహీరాబాద్ అభ్యర్థిగా గాలి అనిల్‌కుమార్, నిజామాబాద్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్థన్‌లను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.
తాజాగా నలుగురు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా తొమ్మిదికి చేరింది. ఇంకా 8 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్‌ఎస్. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వ్) స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, )మహబూబ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది.
ఇదీ చదవండి: బీజేపీ రెండో జాబితా.. తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
Comments
Please login to add a commentAdd a comment