చంద్రబాబు ఆక్ పాక్ కరివేపాక్ ఫార్ములా
మూడో జాబితాలో స్పష్టంగా బాబు ఉద్దేశ్యాలు
డబ్బు సంచులకే టిడిపి టికెట్లు
గంటాకు, కళా వెంకట్రావుకు మొండి చేయి
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీకి సంబంధించి 11 మంది, అలాగే 13 మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఉదయం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఊహించినట్లుగానే ఆశావహుల్లో కొందరికి అధిష్టానం మొండి చేయి చూపించింది. సీనియర్లలో కొందరికి సీట్లు దక్కగా.. మరికొందరికి మాత్రం చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. తన సామాజిక వర్గానికి పెద్ద పీట వేసుకున్న చంద్రబాబు.. బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు అంటే రుచి చూపించారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ మరీ.!
- భీమిలి నుంచి గంటాకు నో, మూడో జాబితాలో మొండి చేయి, చీపురుపల్లి నుంచి చేస్తే చేయ్.. లేదంటే తప్పుకో అంటూ గంటాకు సూచన చేసినట్టు తెలిసింది.
- తెలుగుదేశం రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు
- శ్రీకాకుళంలో సీటు ఆశించి భంగపడ్డ గుండా లక్ష్మీదేవి, డబ్బు సంచులకే ప్రాధాన్యం తనను పక్కనబెట్టారని అంటున్నారు
- విశాఖ ఎంపీగా పోటీ చేయాలనుకున్న జీవీఎల్‌కు చోటు దక్కకుండా చక్రం తిప్పాడు, బాలకృష్ణ తోడల్లుడి కొడుకు భరత్‌కు విశాఖ ఎంపీ సీటు ప్రకటించాడు,
- కేవలం కుటుంబ సభ్యుల కోసమే విశాఖ సీటును టిడిపికి అప్పగించారని పురందేశ్వరీ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
- నిజమైన బీజేపీ కార్యకర్తలకు కాకుండా.. కుటుంబ సభ్యుల కోసం పార్టీని తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు.
- మైలవరంలో దేవినేని ఉమా మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగానే వంద కోట్లు ఇచ్చిన కృష్ణప్రసాద్‌కు టిడిపి టికెట్ ఇచ్చినట్టు తాజా జాబితా బట్టి తేలిపోయింది. డబ్బుల పోటీలో దేవినేని ఉమా వెనకబడిపోయారు. పార్టీలో చేరగానే వసంతకు టికెట్ ఇచ్చాడు బాబు.
- డబ్బు సంచులకే టికెట్లు అన్నది శ్రీకాకుళంలో పక్కాగా నిరూపణ అయింది. శంకర్, గోవింద్‌రావు ఇద్దరిది అదే అర్హత అన్న విమర్శలున్నాయి
- పెనమలూరు టికెట్ పార్ధసారధి యాదవ్‌కు ఇస్తానని టీడీపీ లోకి తీసుకొని నూజివీడుకు పంపించారు చంద్రబాబు. అక్కడ బోడె ప్రసాద్ చౌదరికి ఇచ్చాడు.
- అలాగే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సిపి నుంచి ఎన్నికైన ఉండవల్లి శ్రీదేవిని ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆశ పెట్టి ఓటు వేయించుకున్నాడు. తీరా అవసరం తీరిన తర్వాత మొండిచేయి చూపించాడు బాబు.
కాపు ,యాదవ, చేనేత ,బిసీ సామాజిక వర్గాలకు పోటీగా కమ్మలను రంగంలోకి దించినట్టు తేలిపోయింది.
- విశాఖ ఎంపీగా భరత్ (కమ్మ) vs బొత్స ఝాన్సీ (కాపు)
- గుంటూరు ఎంపీ గ పెమ్మసాని (కమ్మ) vs కిలారు రోశయ్య(కాపు)
- నరసారావు పేట ఎంపీగా లావు vs అనిల్ యాదవ్ (యాదవ బీసీ)
- మంగళగిరి లో లోకేష్ vs కాండ్రు లావణ్య (చేనేత బీసీ )
- కుప్పం లో బాబు vs భరత్ (వన్నెకుల క్షత్రియా బిసీ )
Comments
Please login to add a commentAdd a comment