సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల విషయంలో బీఆర్‌ఎస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కలిసి వచ్చాయి. లేకపోతే మరికొన్ని స్థానాల్లో కూడా బీఆర్‌ఎస్‌కు ఓటమి ఎదురయ్యేది.
బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చిన స్థానాలు ఇవే..
అలంపూర్: అబ్రహం స్థానంలో విజయుడికి సీటు.. గెలుపు.
జనగాం: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీటు.. గెలుపు
స్టేషన్ ఘనపూర్: తాటికొండ రాజయ్య స్థానంలో కడియంకు అవకాశం.. గెలుపు.
నర్సాపూర్: మదన్ రెడ్డి స్థానంలో సునీతా లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు
కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్థానంలో ఆయన కుమారుడు డా:కల్వకుంట్ల సంజయ్ రావుకు అవకాశం.. గెలుపు
ఆసిఫాబాద్: ఆత్రం సక్కు స్థానంలో కోవాలక్ష్మీకి అవకాశం.. గెలుపు
దుబ్బాక: ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డికి అవకాశం.. గెలువు
బోథ్: రాథోడ్ బాబురావు స్థానంలో అనిల్ జాదవ్‌కు అవకాశం.. గెలువు
ఉప్పల్: బేతి సుభాష్ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి అవకాశం.. గెలువు.
మల్కాజ్‌గిరి: మైనం పల్లి హన్మంతరావు స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డి అవకాశం.. విజయం.
Comments
Please login to add a commentAdd a comment