ముంబై: శివసేనతో పొత్తు కొనసాగింపు విషయమై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్‌భండారీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా. పొత్తు విషయంలో తాజా సమాచారం ఏదైనా ఉంటే మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడనవిస్ మీడియాకు తెలియజేస్తారు’ అని అన్నారు.
కాగా ఉద్ధవ్‌ఠాక్రే శనివారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక రాష్ట్రాల్లో మోడీ వేవ్ పనిచేయలేదని పేర్కొన్నారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని మోడీకి మాత్రమే ఆపాదింపజేయలేమన్నారు. మహారాష్ట్రలో విజయం విషయంలో శివసేన వాటాను కొట్టిపారేయలేనదని పేర్కొన్న సంగతి విదితమే. ఈ వ్యాఖ్యలు బీజేపీ నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసిన సంగతి విదితమే.
కార్యకర్తలు కలత చెందారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ కార్యకర్తల్లో కలత రేపాయని బీజేపీ రాష్ట్ర శాఖ కోశాధికారి షైనా ఎన్‌సీ పేర్కొన్నారు. ‘మా నాయకుడిని ఉద్ధవ్ అవమానించారు. ప్రతి ఒక్కరికీ రాజకీయ ఆకాంక్షలు ఉంటాయి. అయితే ఇతర పార్టీ నాయకుల గురించి ఆచితూచి మాట్లాడాలి. విచక్షణతో మాట్లాడాలి’అని అన్నారు. కాగా మూడురోజుల పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 17వ తేదీన నగరానికి రానున్నారు.
అధిష్టానం నిర్ణయిస్తుంది
Published Mon, Sep 15 2014 9:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement