ముంబయి : సీట్ల సర్దుబాటుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఉద్ధవ్ థాక్రేతో ఫోన్లో మాట్లాడారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అమిత్ షా సూచించారు. పొత్తు పెట్టుకోకపోతే ఇరు పార్టీలకు నష్టమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది.
కనీసం 130 సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.
ఉద్థవ్ థాక్రేకు అమిత్ షా ఫోన్ కాల్
Published Mon, Sep 22 2014 11:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement