uddav thakrey
-
ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌పై దాడి, వీడియో వైరల్
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలోని చెంబూర్‌లో సోమవారం జగిరిన మ్యూజిక్ కన్సర్ట్‌లో కొందరు ఆయనపై దాడికి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాలు.. ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ ఆధ్యర్యంలో ముంబయిలోని చెంబూరులో జరిగిన ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సోనూనిగమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాటలు పాడి అలరించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా కొందరు ఆయనతో సెల్ఫీ దిగే వంకతో సోనునిగమ్పై దాడి చేశారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి స్టెప్స్‌పై నుంచి తొయడంతో ఆయన కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూ నిగమ్‌పై దాడి చేస్తున్న క్రమంలో ఆయన సహచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై సైతం సదరు గ్రూప్ దాడి చేసేందుకు యత్నించగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న బాడీగార్డ్స్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోనూ నిగమ్ బృందంలోని ఇద్దరు వ్యక్తులు స్టేజ్‌పై నుంచి కింద పడటంతో వారిలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో! ఇక ఈ ఘటన అనంతరం సోనూ నిగమ్ మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ దిగాలని వచ్చి తనని తోయడంతో కింద పడ్డానని, వారిని ఆపేందుకు వచ్చిన తన అనుచరులపై కూడా దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్లు ఉద్ధవ్ ఠాక్రె పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్ కొడుకే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు ఈ దాడికి పాల్పడినట్లు సోనూ నిగమ్ బృందం చెబుతుండగా.. సెల్ఫీలు తీసుకునే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే చెబుతుండటం గమనార్హం. #SonuNigam attacked by Uddhav Thackeray MLA Prakash Phaterpekar son and his goons in music event at Chembur. Sonu has been taken to the hospital nearby. pic.twitter.com/ERjIC96Ytv — Swathi Bellam (@BellamSwathi) February 20, 2023 Shocking😡 Padma Shri Singer #SonuNigam was attacked by the son of Shiv Sena MLA Prakash Phaterpekar. got some serious injuries & taken to Zen Hospital Chembur. Is this what a Padma Shri & a legend deserves? Demanding stringent action @Dev_Fadnavis @MumbaiPolice @mieknathshinde pic.twitter.com/4HnEMdTa9p — Akassh Ashok Gupta (@peepoye_) February 20, 2023 -
‘మహా’ సంక్షోభం: సీఎం ఉద్దవ్‌థాక్రే రాజీనామా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ శివసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ఉన్న మంత్రి హోదాను తొలగించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం కేబినెట్ భేటి జరగనుంది. అలాగే, సాయంత్రం 5 గంటలకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థ్రాకే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने.. — Sanjay Raut (@rautsanjay61) June 22, 2022 -
33 ఏళ్లకు భూమిని తిరిగిచ్చేసిన భారత దిగ్గజ క్రికెటర్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ 33 ఏళ్ల తర్వాత తనకు కేటాయించిన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పడం చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళితే.. 1988లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలంటూ సునీల్ గావస్కర్‌కు ముంబైలో బాంద్రా శివారులో 20వేల స్క్కేర్‌ఫీట్‌లలో ఒక ప్లాట్‌ను కేటాయించింది. 33 ఏళ్లు కావొస్తున్నప్పటికి గావస్కర్ అక్కడ క్రికెట్ అకాడమీని గాని.. అందుకు సంబంధించిన మౌళిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ గతేడాది గావస్కర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా బాంద్రాలో కేటాయించిన ప్లాట్‌లో అకాడమీని ఏర్పాటు చేయలేనంటూ గావస్కర్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు బుధవారం లేఖ రాసినట్లు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంహెచ్ఏడీఏ) పేర్కొంది. కాగా గతంలో క్రికెట్ అకాడమీ విషయమై గావస్కర్.. సచిన్‌తో కలిసి ఉద్దవ్‌ను కలిసి ప్లాన్ వివరించారు. కానీ ఆ ప్లాన్ ఎలాంటి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలోనే 33 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ప్లాట్‌ను ఇచ్చేయాలని గావస్కర్‌ను కోరగా.. ఆయన ప్రభుత్వానికి ఇచ్చేసినట్లు ఎంహెచ్డీఏ తెలిపింది. చదవండి: Yuvraj Singh: టెస్టు క్రికెట్ చనిపోయే దశకు వచ్చింది -
PM Modi: మోదీకి హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
దేశంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం) హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిలో కోర్టులో హాజరు పరుచగా.. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
ఉద్థవ్ థాక్రేకు అమిత్ షా ఫోన్ కాల్
ముంబయి : సీట్ల సర్దుబాటుపై ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఉద్ధవ్ థాక్రేతో ఫోన్లో మాట్లాడారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని అమిత్ షా సూచించారు. పొత్తు పెట్టుకోకపోతే ఇరు పార్టీలకు నష్టమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కాగా 151 స్థానాలకు పోటీ చేసి తీరుతామని తెగేసి చెబుతున్న శివసేన.. బీజేపీకి 119కి సీట్లకు మించి ఒక్కటి కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కనీసం 130 సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా ఫోన్ కాల్ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి పదవి శివసేనకు ఇచ్చేందుకు అంగీకరిస్తే.. శివసేన మరి కొన్ని సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.