NCP Leader Hanuman Chalisa Offer For PM Modi After Uddhav Thackeray - Sakshi
Sakshi News home page

PM Modi: మోదీకి హనుమాన్‌ చాలీసా ఎఫెక్ట్‌

Published Mon, Apr 25 2022 12:11 PM | Last Updated on Mon, Apr 25 2022 1:18 PM

NCP Leader Hanuman Chalisa Offer For PM Modi  - Sakshi

దేశంలో హనుమాన్‌ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్‌సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం) హనుమాన్‌ చాలీసా, నమాజ్‌, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉండగా.. హనుమాన్‌ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఇంటి ముందు హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామ‌ని న‌వ‌నీత్ రాణా మొద‌ట్లో దంప‌తులు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత విర‌మించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్ష‌న్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిలో కోర్టులో హాజరు పరుచగా.. వీరిద‍్దరికీ మే 6 వ‌ర‌కూ జుడీషియ‌ల్ రిమాండ్ విధిస్తున్న‌ట్లు బాంద్రా మెట్రో పాలిట‌న్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ స‌న్‌డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బిగ్‌ షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement