జైపూర్: రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హనుమాన్ జయంతిని సందర్భంగా హనుమాన్ చాలీసా వినడం కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో తప్పు అని అన్నారు. ప్రజల సంపదను లాక్కుని కొందరికి పంచిపెట్టే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
శ్రీ రామనవమి రోజు రాజస్థాన్‌లో మొదటిసారి శోభా యాత్ర ఊరేగింపు జరిగింది. రామ్-రామ్ అని జపించే రాజస్థాన్ వంటి రాష్ట్రంలో, ప్రజలు రామనవమి జరుపుకోకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పండుగను నిషేదించిందని మోదీ పేర్కొన్నారు.
కాగా ఇప్పటికే మోదీ కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. మీరు కష్టపడి సంపాదించిన మీ ఆస్తిని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా? అని ప్రశ్నించారు.
మహిళల దగ్గర ఉన్న బంగారానికి సంబంధించిన వివరాలు సేకరిస్తామని.. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చెబుతోంది. ప్రజల కష్టార్జితం, వారి ఆత్మ గౌరవానికి సంబంధించిన సంపదని ఇతరులకు పంచిపెట్టడం ఎంతవరకు న్యాయమని మోదీ ప్రశ్నించారు. మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు విరుచుకుపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment