Singer Sonu Nigam attacked during music concert in Mumbai - Sakshi
Sakshi News home page

Singer Sonu Nigam: ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌పై దాడి, ఎమ్మెల్యే కొడుకే చేసినట్లు ఆరోపణలు!

Published Tue, Feb 21 2023 10:01 AM | Last Updated on Tue, Feb 21 2023 11:02 AM

Singer Sonu Nigam Attacked By a Group At Mumbai Music Concert - Sakshi

ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సోనూ నిగమ్‌పై దాడి జరిగింది. ముంబయిలోని చెంబూర్‌లో సోమవారం జగిరిన మ్యూజిక్‌ కన్‌సర్ట్‌లో కొందరు ఆయనపై దాడికి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వివరాలు.. ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్‌ ఆధ్యర్యంలో ముంబయిలోని చెంబూరులో జరిగిన ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సోనూనిగమ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పాటలు పాడి అలరించారు. అనంతరం తిరిగి వెళ్తుండగా కొందరు ఆయనతో సెల్ఫీ దిగే వంకతో సోనునిగమ్‌పై దాడి చేశారు.

చదవండి: టాలీవుడ్‌లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్‌ మృతి

స్టెప్స్‌పై నుంచి తొయడంతో ఆయన కిందపడిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోనూ నిగమ్‌పై దాడి చేస్తున్న క్రమంలో ఆయన సహచరులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారిపై సైతం సదరు గ్రూప్‌ దాడి చేసేందుకు యత్నించగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉన్న బాడీగార్డ్స్‌ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో సోనూ నిగమ్‌ బృందంలోని ఇద్దరు వ్యక్తులు స్టేజ్‌పై నుంచి కింద పడటంతో వారిలో ఒకరు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో!

ఇక ఈ ఘటన అనంతరం సోనూ నిగమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ దిగాలని వచ్చి తనని తోయడంతో కింద పడ్డానని, వారిని ఆపేందుకు వచ్చిన తన అనుచరులపై కూడా దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ప్రస్తుతం విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసిన ట్విటర్‌ యూజర్లు ఉద్ధవ్‌ ఠాక్రె పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ ఫర్తేపేకర్‌ కొడుకే ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే కుమారుడు ఈ దాడికి పాల్పడినట్లు సోనూ నిగమ్ బృందం చెబుతుండగా.. సెల్ఫీలు తీసుకునే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే చెబుతుండటం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement