కాపులే మా బలం.. మేమే కాపులకు అసలైనప్రతినిధులం అని చెప్పుకునే జనసేనకు సరైన చోట దెబ్బ పడింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తమదే హవా.. అక్కడ మాకు మాగ్జిమమ్ సీట్లు ఇవ్వాలని .. ఇస్తారని ఆశించిన జనసేనకు వెన్నుపోటు రుచి ఏమిటో తెలిసొచ్చింది. ఆరెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలివిడత మొత్తం 118 సీట్లలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి 13 సీట్లు.. ఇవ్వగా రెండు స్థానాలు మాత్రం జనసేనకు ఇచ్చారు. అంటే ఇంకా అక్కడ 19 స్థానాలు ఉన్నాయ్.. అందులో జనసేనకు ఎన్ని ఇస్తారన్నది సందేహమే.. మొత్తం 34 స్థానాల్లో తమకు ఇరవై వరకూ సీట్లు ఇస్తారని సైనిక్స్ ఆశించారు.. గోదావరి జిల్లాలను స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికారు.
తీరా చూస్తే ఇప్పుడిచ్చినవి రెండు సీట్లు పోనూ మిగిలిన 19 స్థానాల్లో మహా ఇస్తే పది ఇస్తారేమో .. అప్పుడు మొత్తం పన్నెండు ఇచ్చినట్లు అవుతుంది.. మరి గోదావరి జిల్లాల్లో జనసేన పెత్తనం .. పెద్దరికం.. ప్రాధాన్యం ఎక్కడుంది... చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ఉంటుంది. దీంతో జనసైనికులు మాత్రం చంద్రబాబును నమ్ముకుని నిలువుగా గోదావరిలో మునిగిపోయినట్లు అయిందని నిర్వేదంలో ఉన్నారు. గోదావరి రెండు జిల్లాల్లో మాదే హవా.. ప్రజలను, ఓటర్లను మేము శాసిస్తాం... అందుకే పెద్ద మొత్తంలో టిక్కెట్లను ఆశిస్తున్నాం అని చెప్పుకున్న జన సైనిక్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
కాపుల మద్దతు మాత్రం కావాలి.. జనసేన ఓట్లు కావాలి కానీ వాళ్లకు టిక్కెట్లు మాత్రం ఎక్కువగా ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద పని చేసిన చంద్రబాబు... సరిగ్గా తాను అనుకున్నట్లే దెబ్బ కొట్టారు.. దీంతో జనసైనికుల నడుం విరిగినంత పని అయింది.. కొన్నాళ్లుగా కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు రాస్తూ కాపులకు, జనసేనకు కనీసం యాభై టిక్కెట్లు ఇవ్వకపోతే పొత్తు పొసగదు అంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.
కానీ చంద్రబాబు మత్తులోపడిన పవన్... ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.. దీంతో చంద్రబాబు తాను అనుకున్న ప్రకారమే గుప్పెడు సీట్లు పవన్ మొహాన పడేసి సింహభాగం తాను ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా జనసేనకు ప్రస్తుతం కేటాయించిన 24 సీట్లలో ఐదింటికి అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 19 చోట్ల అభ్యర్థులను తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబే కొందర్ని పంపించి పోటీచేసే అవకాశాలు ఉన్నాయ్.
ఏది ఏమైనా జనసేనకు టిక్కెట్లు, అభ్యర్థులను సైతం సప్లై చేస్తూ మెల్లగా ఆ పార్టీని నిర్వీర్యం చేసి జనసేనానిని పూర్తిగా పీల్చి పిప్పి చేసేసి వదిలేస్తారు అని సైనిక్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చంద్రబాబు..లోకేష్.. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ..అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లంతా తమ నియోజకవర్గాలను ప్రకటించుకున్నారు.
ఈ లిస్టులో వారి పేర్లు ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం తన నియోజకవర్గాన్ని సైతం బహిర్గత పరచలేదు..ముందే చెబితే ఓడగొట్టెందుకు సీఎం వైఎస్ జగన్ గట్టి ప్రణాళిక వేస్తారని భయపడ్డారో.. ఇంకేదైనా కారణం ఉందో కానీ పవన్ తన నియోజకవర్గాన్ని సైతం ప్రకటించే సాహసం చేయకపోవడం కాపులను, జనసైనికులను మరింత కలవరపరుస్తోంది.. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నా కనీసం తన నియోజకవర్గం పేరును వెల్లడించలేని నాయకుడు ఇక పార్టీని ఎలా నడుపుతాడు అని విమర్శలు వస్తున్నాయి.
::: సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment