చెన్నై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని పాలక ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లు సంయుక్తంగా ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్ధానాల్లో పోటీ చేస్తుందని తాము తమిళనాడు, పుదుచ్చేరిలో ఉమ్మడిగా బరిలో దిగుతామని పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు.
పొత్తుపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ తమిళనాడులోని 21 అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో తాము ఏఐఏడీఎంకేకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నాయకత్వంలో, కేంద్ర స్ధాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము అంగీకరించామన్నారు. అంతకుముందు పీఎంకేతో పొత్తుపై ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఆ పార్టీ ఏడు లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించింది. పీఎంకేకు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అవగాహనలో భాగంగా తమిళనాడులో రానున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు పీఎంకే మద్దతు ప్రకటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment