లోక్‌సభ ఎన్నికల మొదటిదశ పోలింగ్ మరో నాలుగు రోజులున్నా.. ఇంకా మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో మరో ఆరు సీట్ల అభ్యర్థుల కేటాయింపు పెండింగ్‌లో ఉంది. ఆ ఆరు కీలక స్థానాల్లో మహాయుతి కూటమి పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ సీట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకోలేకపోతోందని పార్టీల్లో తీవ్ర చర్చ జరగుతోంది. ఇవే ఆ ఆరు స్థానాలు.. దక్షిణ ముంబై, థానే, పాల్ఘర్, రత్నగిరి-సింధుదుర్గ్ సీటు, నాసిక్ ఔరంగాబాద్.
నాసిక్ సీటులో ఎన్సీపీ( అజిత్ పవార్) పార్టీ తరఫున మాజీ మంత్రి ఛగన్ భుజబల్‌ను ప్రతిపాధించగా.. సీఎం ఏక్‌నాథ్ షిండే(శివసేన) ఆ స్థానాన్ని వదులకోవడానికి సిద్ధం లేనట్టు తెలుస్తోంది. నాసిక్ స్థానం శిశసేన సిట్టంగ్ స్థానం. అక్కడ ఎంపీగా హేమంత్ గాడ్సే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఔరంగాబాద్ నుంచి బీజేపీ ఎంపీ పార్లమెంట్‌లో అడుగుపెడతారని ఇటీవల కేంద్రహోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే సోమవారం పార్టీ కార్యకర్తల మీటింగ్ మాట్లాడుతూ.. ఔరంగాబాద్ నుంచి శివసేన అభ్యర్థి బరిలోకి దిగుతారని వ్యాఖ్యానించటం గమనార్హం.
థానే, రత్నగిరి-సింద్‌దుర్గ్ రెండు స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని భావించినప్పటికీ.. తర్వాత తన ఆలోచనను విరమించుకొని థానే సీటును శివసేన( షిండే)కు కేటాయించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఉమ్మడి శివసేన అభ్యర్థిగా 2019లో రాజన్ విచారే గెలుపొందారు. శివసేన పార్టీ చీలిన తర్వాత ఆయన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్నారు. అయితే శివసేనకు కంచుకోట అయిన థానే స్థానాన్ని షిండే వదలుకుకోవడాని సిద్ధంగా లేరని సమాచారం. అయితే థానేకు బదులు రత్నగిరి-సింద్‌దుర్గ్‌ను శివసేన బీజేపీకి ఇవ్వడానికి ఆసక్తి చూపుతోంది. ఇక ఈ స్థానంలో బీజేపీ నారాయణ రాణేను బరిలోకి దించాలని యోచిస్తోంది.
పాల్ఘర్ స్థానం బీజేపీ దక్కే అవకాశం ఉంది. 2019లో శివసేన గెలిచే వరకు పాల్ఘర్ బీజేపీ పట్టున్న స్థానం. ఇప్పటికే పలు స్థానాలను వదులుకున్న శవసేన.. సౌత్ ముంబై స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధం లేదు. సీఎం షిండే శివసేన మొదట్లో ముంబైలో మొత్తం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అందులో ఇద్దరిని మార్పు చేశారు. నాలుగురికి టికెట్ తిరస్కరించింది. సీట్ల విషయంలో శివసేన ఒత్తిడిలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివసేనకు బలం ఉన్న ముంబై, ఇతర సీట్లను వదులుకోవడాని సిద్ధంగా లేరని తెలుస్తోంది.
ఈసారి సౌత్ ముంబై, థానే, రత్నగిరి సింద్‌దుర్గ్, నాసిక్ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్లు బీజేపీ భావిస్తోంది. అయితే శివసేన ఈ సీట్లను వదులుపోవడానికి సిద్ధంగా లేదు. ఒకట్రెండు రోజుల్లో ఈ సిట్లలో ఎవరికి దక్కుతాయో కొలిక్కి రానుంది. ఇక.. అజిత్ పవార్ ఎన్సీపీ ఆశిస్తున్న నాసిక్ సీటు సైతం షిండే(శివసేన) దక్కించుకోనున్నట్లు సమాచారం.థానే సీటును ఏక్‌నాథ్ షిండే దక్కించుకునే అవకాశం ఉందని.. రత్నగిరి-సింధుదుర్గ్ సీటు బీజేపీకి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment