ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.
బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా.. బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల విభజనపై కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతున్నట్లు వస్తున్న వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment