ఢిల్లీ: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన ఆశిస్తున్నట్టు హోంశాఖ వారికి దక్కే చాన్స్ లేనట్టు కీలక నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శివసేనకు అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వశాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు.
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రి విస్తరణ కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై అమిత్ షా, నడ్డాతో ఫడ్నవీస్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో సదరు కీలక నేత మరో బాంబు పేల్చారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదన్నారు. అలాగే, మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఇక, చివరకు శివసేనకు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు. దీంతో, శివసేన నేతల్లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
#MaharashtraGovtFormation | Maharashtra Chief Minister Devendra Fadnavis met Home Minister Amit Shah, Deputy Chief Minister Eknath Shinde skips meeting as per sources; talks likely on portfolio allocation pic.twitter.com/g9aM3hXP2x
— NDTV (@ndtv) December 12, 2024
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment