ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ
ఒంటరిపోరుకు సిద్దమవుతున్న బీజేపీ
Published Sun, Sep 21 2014 9:16 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ఒంటరిపోరుకే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సీట్ల సర్ధుబాటు వ్యవహారంపై శివసేనతో అవగాహన కుదరకపోవడంతో మహారాష్ట్రలోని 288 స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనుంది.
Advertisement
Advertisement