288 స్థానాలకు శివసేన పోటీ? | BJP, Shiv Sena trying to salvage alliance | Sakshi
Sakshi News home page

288 స్థానాలకు శివసేన పోటీ?

Published Sun, Sep 21 2014 8:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

288 స్థానాలకు శివసేన పోటీ? - Sakshi

288 స్థానాలకు శివసేన పోటీ?

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ, శివసేన పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. సర్ధుబాటు వ్యవహారంలో శివసేన పార్టీ ఖచ్చితంగా ఉండటంతో ఇరుపార్టీల మధ్య పోటీ చేసే సీట్ల సంఖ్యపై ఓ అవగాహనకు రాలేకపోయారు. 
 
ఈ నేపథ్యంలో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం మాతోశ్రీలో సమావేశమైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరకపోతే మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని శివసేన యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్నికల పొత్తుపై ఓ అవగాహనకు వచ్చేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్, సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement