సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరువురు నేతల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతుండగానే.. షా, నితీశ్‌లు సీట్ల సర్దుబాటు కోసం భేటీ అవడం చర్చనీయాంశమైంది. 40 ఎంపీ స్థానాలున్న బిహార్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ 15 సీట్లను వదులుకోకూడదని జేడీయూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే బిహార్‌లో ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటే.. జేడీయూకు 15 సీట్లు ఇవ్వడం కష్టమని బీజేపీ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment