టీడీపీ.. బీజేపీ మధ్య ఏ ముహూర్తంలో పొత్తు కుదిరిందో గానీ, రెండు పార్టీలకూ అది తలనొప్పిగానే మారింది.
టీడీపీ.. బీజేపీ మధ్య ఏ ముహూర్తంలో పొత్తు కుదిరిందో గానీ, రెండు పార్టీలకూ అది తలనొప్పిగానే మారింది. తెలంగాణ ప్రాంతంలో బీజేపీ నేతలు తమకు కావల్సిన సీట్లు కాక, పనికిమాలిన స్థానాలన్నీ టీడీపీ తమకోసం వదిలిపెట్టిందని మండిపడుతున్నారు. తాము కోరిన సీట్లు ఇవ్వకపోతే అన్ని పదవులకు రాజీనామా చేస్తామని రంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు హెచ్చరించారు.
ఈ మేరకు ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. తాము కోరుతున్న స్థానాలు కాకుండా, వాళ్లకు ఇష్టం వచ్చిన స్థానాలు మాత్రమే ఇస్తామంటే ఊరుకునేది లేదని, అవసరమైతే సొంతంగా బరిలోకి దిగుతామని కూడా బీజేపీ నాయకులు తమ పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు.