
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మరింత చేరువయ్యారు. ప్రతిపాదిత కూటమిపై తుది చర్చలు జరిపేందుకు మాయావతితో అఖిలేశ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైనట్లు ఎస్పీ వర్గాలు చెప్పాయి. దీనిపై ఇరు పార్టీల నుంచీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ సీట్లుండగా ఈ ఇరు పార్టీలు చెరో 37 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన 6 సీట్లను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్‌దళ్ వంటి పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు అమేథీ, రాయ్‌బరేలీ సీట్లు ఇచ్చే చాన్సుంది.
Comments
Please login to add a commentAdd a comment