న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకంలో విషయంలో చర్చల వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో శివసేన( యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రేతో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపింది.
కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్‌లో కూడా సీట్ల పంపకం గురించి మరోసారి సీఎం మమతా బెనర్జీ టీఎంసీతో చర్చలు జరుపుతారన్న వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లను కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల నేపథ్యంలో టీఎంసీకి చెందిన ఓ కీలక నేత స్పందించారు.
‘బైనాక్యూలర్‌లో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్ల కంటే ఎక్కువ కనిపించటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీకి మూడో సీటును మేము గుర్తించలేకపోతున్నాం. ఏదేమైనా కాంగ్రెస్, టీఎంసీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగితే త్వరలోనే ప్రకటిస్తాం’ అని అన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రెండు సీట్లను మాత్రమే కేటాయిస్తామని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఇక.. కాంగ్రెస్ పార్టీ మరిన్ని సీట్ల కేటాయింపుకు పట్టుపట్టినా మమతా బెనర్జీ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాము కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే బెంగాల్‌లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీఎం మమతా బెనర్జీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే పలుమార్లు రాహుల్ గాంధీ.. సీఎం మమతా బెనర్జీకి అనుకూలంగా మాట్లాడటంతో మళ్లీ సీట్ల పంపకంపై ఆశలు చిగురించాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో చోటు చేసుకుంటున్న సీట్ల పంపకాల పరిణామాలతో బెంగాల్ కూడా సీట్ల పంపకం చర్చకు వచ్చింది. ఇక.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన పంతం తగ్గించుకుని కాంగ్రెస్‌తో చర్చకు రెడీ అయినట్టు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో దాదాపు ఆరు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment