కోల్‌కతా: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలకు కనీసం 40 సీట్లు అయినా గెలుస్తుందో? లేదో? అనే అనుమానం కలుగుతోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ శుక్రవారం ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు.
‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లకు కనీసం 40 సీట్లలో అయినా గెలుస్తుందో? లేదో? అనుమానం కలుగుతోంది. ఎందుకు కాంగ్రెస్‌కు అంత అహంకాంరం? మీరు బెంగాల్ రండి. అప్పుడు మనమంతా ‘ఇండియా కూటమి’. మీకు దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోవటం ఖాయం!’ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
‘మేము యూపీలో గెలవము. మీరు రాజస్థాన్‌లో గెలవరు. ముందు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ గెలవండి. మీరు వారణాసి, అలహాబాద్‌లో గెలిచి మీ ధైర్యం చూపండి. మీ పార్టీ శక్తి, సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోండి!’ అని సవాల్ విసిరారు మమతా బెనర్జీ.
రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై మమతా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బెంగాల్ బీడీ కార్మికులతో మాట్లాడిన విషయంపై ప్రస్తుతం కొత్త స్టైల్ నడుస్తోందని.. అది ఫొటోషూట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కానీసం చాయ్ దుకాణం దగ్గరు వెళ్లని వారు.. నేడు మాత్రం బీడీ కార్మికుల వద్దకు వెళ్లారని అటువంటివారు బెంగాల్‌లో వలస పక్షులని మండిపడ్డారామె.
ఇండియా కూటమి నుంచి వైదొలిగిన మమతా బెనర్జీ.. బెంగాల్‌లో తాము ఒంటరి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు కేటాయిస్తామని తెలిపిన మమతా.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment