కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మరోసారి కాంగ్రెస్ పార్టీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న సీఎం మమతా బెనర్జీ గురించి తాను సానుకూలంగా మాట్లాడనని అన్నారు.
‘‘నన్ను, కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలనుకున్న వారికి తాను సానుకూలంగా మాట్లాడాను. ఇది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాటం. కాంగ్రెస్ కార్యకర్తల తరఫునే నేను సానుకూలంగా మాట్లాడుతాను. సీఎం మమతపై నాకు ఎటువంటి వ్యక్తిగతమైన పగ లేదు.
..ఆమె అవలంబిస్తున్న రాజకీయ విలువలను ప్రశ్నిస్తాను. ఆమె వ్యక్తిగత అజెండా కోసం కాంగ్రెస్‌ను ఉపయోగపడాలని నేను అనుకోవటం లేదు. నా వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యతిరేకించినా.. రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల కోసం ఒక కాంగ్రెస్ నేతగా సీఎం మమతకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా’’అని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.
అంతకు ముందు అధీర్ రంజస్ సీఎం మమాతపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉంటారన్న నమ్మకం లేదు. బీజేపీ చేరువ కానున్నారు. బెంగాల్‌లోని పురూలియా, బంకురా, ఝార్‌గ్రామ్ జిల్లాల్లో లెఫ్ట్ పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు సీఎం మమతా మావోయిస్టుల సహాయాన్ని కోరారు’’ అని అధీర్ రంజన్ ఆరోపణలు చేశారు.
అయితే ఆధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘‘మమతా బెనర్జీ కూటమిలోనే ఉన్నారు. ఇటీవల ఆమె కూటమిలో నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో చేరుతానని తెలిపారు. ఆధీర్ రంజన్ పార్టీ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేరు. కీలకమైన నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడిగా నేను, పార్టీ హైకమాండ్ మాత్రమే తీసుకుంటుంది. తమ నిర్ణయాలను పాటించని వారు బయటకు వెళ్లిపోతారు’’ అని ఖర్గే స్పష్టం చేశారు. మరోవైపు.. అధీర్ రంజన్ బహరాంపూర్ నుంచి పోటీ చేయగా.. టీఎంసీ ఈ స్థానంలో మాజీ క్రికెట్ క్రీడాకారుడు యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది.
Comments
Please login to add a commentAdd a comment