varanasi constituency
-
నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తర ప్రదేశ్ వారణాసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. మోదీ నామినేషన్‌ను నలుగురు నేతలు బలపర్చారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో ఇద్దరు ఓబీసీ నేతలు ఉన్నారు.మోదీ నామినేషన్ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్టీయే నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు.#WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024 pic.twitter.com/lSgGcPiNjR— ANI (@ANI) May 14, 2024 #WATCH | Prime Minister Narendra Modi files nomination from Varanasi Lok Sabha seat for #LokSabhaElections2024Uttar Pradesh CM Yogi Adityanath is also present on the occasion. pic.twitter.com/woWNPgqdiG— ANI (@ANI) May 14, 2024నామినేషన్ వేయడానికి ముందు.. దశ అశ్వమేథ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే.. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ.. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి ఫేజ్‌లో భాగంగా జూన్ 1వ తేదీన వారణాసి పార్లమెంట్ స్థానానికి పోలింగ్ జరగనుంది. #WATCH | Uttar Pradesh: PM Narendra Modi offers prayers at Dasaswamedh Ghat in VaranasiPM Narendra Modi will file his nomination for #LokSabhaElections2024 from Varanasi today. PM is the sitting MP and BJP's candidate from Varanasi. pic.twitter.com/tnZNsQCnmV— ANI (@ANI) May 14, 2024 -
కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా!
కోల్‌కతా: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 స్థానాలకు కనీసం 40 సీట్లు అయినా గెలుస్తుందో? లేదో? అనే అనుమానం కలుగుతోందని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మమతా బెనర్జీ శుక్రవారం ముర్షిదాబాద్‌లో నిర్వహించిన ఓ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ 300 సీట్లకు కనీసం 40 సీట్లలో అయినా గెలుస్తుందో? లేదో? అనుమానం కలుగుతోంది. ఎందుకు కాంగ్రెస్‌కు అంత అహంకాంరం? మీరు బెంగాల్ రండి. అప్పుడు మనమంతా ‘ఇండియా కూటమి’. మీకు దమ్ముంటే బీజేపీని వారణాసిలో ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోవటం ఖాయం!’ అని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘మేము యూపీలో గెలవము. మీరు రాజస్థాన్‌లో గెలవరు. ముందు రాజస్థాన్‌కు వెళ్లి అక్కడ గెలవండి. మీరు వారణాసి, అలహాబాద్‌లో గెలిచి మీ ధైర్యం చూపండి. మీ పార్టీ శక్తి, సామర్థ్యాలు ఏంటో నిరూపించుకోండి!’ అని సవాల్ విసిరారు మమతా బెనర్జీ. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై మమతా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ బెంగాల్ బీడీ కార్మికులతో మాట్లాడిన విషయంపై ప్రస్తుతం కొత్త స్టైల్ నడుస్తోందని.. అది ఫొటోషూట్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు కానీసం చాయ్ దుకాణం దగ్గరు వెళ్లని వారు.. నేడు మాత్రం బీడీ కార్మికుల వద్దకు వెళ్లారని అటువంటివారు బెంగాల్లో వలస పక్షులని మండిపడ్డారామె. ఇండియా కూటమి నుంచి వైదొలిగిన మమతా బెనర్జీ.. బెంగాల్లో తాము ఒంటరి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ రెండు సీట్లు కేటాయిస్తామని తెలిపిన మమతా.. తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపింది. -
రాహుల్ గాంధీ విషయంలో ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారు..
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ అమేధీ లోక్ సభ స్థానం నుంచే పోటీ చేస్తారని కరాఖండిగా చెబుతున్నారు యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్. అమేధీ ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను ఓడించి తాము చేసిన తప్పును సరిచేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రీజ్ లాల్ ఖబ్రీ స్థానంలో నియమితులైన అజయ్ రాయ్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే కీలక ప్రకటన చేసి సంచలనానికి తెర తీశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమేధీ నుంచే పోటీ చేస్తారని ప్రకటన చేశారు. మొదట కచ్చితంగా పోటీ చేస్తారని చెప్పిన ఆయన తర్వాత విలేఖరులు నొక్కి మరీ ప్రశ్నించడంతో కాస్త తటపటాయించి.. క్లాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అమేధీ ప్రజలు కూడా గత ఎన్నికల్లో తాము చేసిన పొరపాటుని సరిచేసుకుని ఈసారి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదే పార్లమెంటు స్థానంలో గెలిచిన స్మృతి ఇరానీ కిలో పంచదార కేవలం రూ.15 కే అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ పంచదార ఎటు పోయిందంటూ ప్రశ్నించారు. గత రెండు పర్యాయాల్లో వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోదీపై పొటీ చేసిన అజయ్ రాయ్ ఈసారి ప్రియాంక గాంధీ ఇక్కడ నుండి పోటీ చేస్తానంటే తనతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. . గత సార్వత్రిక ఎన్నికల్లో అమేధీ నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ అభ్యర్థి ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓడించారు. 2004 నుండి ఇదే పార్లమెంటు స్థానం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన రాహుల్ గాంధీ గత పర్యాయం 2019లో మాత్రం ఓటమిని చవిచూశారు. అయినా కూడా ఆయన కేరళలోని వాయనాడ్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి చట్టసభలో అడుగుపెట్టారు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు -
శాలినీ యాదవ్‌తోనే మోదీకి పోటాపోటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న యూపీలోని వారణాసికి ఏడవ విడత కింద మే 19వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మోదీకి దీటైన పోటీని ఇవ్వగలిగిన వారెవరన్నది చర్చనీయాంశమైంది. శాలినీ యాదవ్ అన్న ఓ మహిళా అభ్యర్థి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె పేరు దేశ ప్రజలకు తెలియకపోయిన వారణాసి మేయర్ ఎన్నికల్లో పోటీ చేసినందున స్థానిక ప్రజలకు బాగానే తెలుసు. ఆమె సమాజ్‌వాది–బహుజన సమాజ్–రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 2017లో జరిగిన వారణాసి మేయర్ ఎన్నికల్లో శాలినీ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి 1.40 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఆమె ప్రత్యర్థిగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థికి దాదాపు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శ్యామ్‌లాల్ యాదవ్ ఆమెకు మామ. ఆయన 1984లో వారణాసి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. శాలినీ యాదవ్ స్థానిక హిందీ సాయంకాలం దినపత్రిక ‘భారత్ దూత్’కు పబ్లిషర్, ఎడిటర్. మాజీ బీఎస్ఎఫ్ సైనికుడు తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో శాలినీ యాదవ్‌ను తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎస్పీ, బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి రంగంలోకి దించింది. వారణాసి మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగానే మోదీపైన పోటీ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించగా, అసలు విషయాన్ని ఆమె గ్రహించారేమో ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మహాకూటమి ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేసుకొంది. ఆమెకు మద్దతుగా ఈ నెల 16వ తేదీన కూటమి వారణాసిలో ఎన్నికల సభను నిర్వహిస్తోంది. ఈ సభలో కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, మాయావతి, అజిత్ సింగ్‌లు ప్రసంగిస్తున్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమైన సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు నాయకులు వారణాసిలో ఎన్నికల ర్యాలీ నిర్వహించి, ప్రసంగించడం వల్ల ప్రజలపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. పైగే మోదీని వ్యతిరేకించే ముస్లిం మైనారిటీలో అక్కడ మూడున్నర లక్షల మంది ఉన్నారు. మూడు లక్షల మంది బ్రాహ్మణులు రెండవ అతిపెద్ద గ్రూపు. ఆ తర్వాత రెండు లక్షల మంది వైశ్యులు, 1.5 లక్షల మంది భూమిహార్లు, 1.5 లక్షల మంది కుర్మీలు, 1.5 లక్షల మంది యాదవ్‌లు, రెండు లక్షల మంది దళితులు ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మోదీకి అన్ని వర్గాల వారు ఓట్లు వేయడంతో 5.8 లక్షల ఓట్లు (56 శాతం) వచ్చాయి. ఇక్కడ ఓ అభ్యర్థి విజయం సాధించాలంటే 30 శాతం మించి ఓట్లు వస్తే చాలు. నాడు మోదీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రివాల్‌కు 2.09 లక్షల ఓట్లు వచ్చాయి. అదే కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కి 75 వేల ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థికి 60,000 ఓట్లు, ఎస్పీ అభ్యర్థికి 45 ఓట్లు వచ్చాయి. 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి 2.03 లక్షల ఓట్లతో విజయం సాధించారు. కేజ్రివాల్‌కన్నా తక్కువ ఓట్లు. నరేంద్ర మోదీకి గత ఎన్నికల్లో వచ్చినట్లుగా ఐదు లక్షల పైచిలుకు రావనే అంచనాలు ఎక్కువే ఉన్నప్పటికీ ఆయనే గెలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. బ్రాహ్మలు, వైశ్యులు ఆయనకే ఓట్లు వేస్తారు కనుక, ఆ రెండు వర్గాల ఓట్లే ఐదు లక్షలు ఉన్నందున ఆయన గెలవడం తేలికే. ఈసారి ఆయన దీటుగా మైనారిటీ ముస్లింలు, మిగతా సామాజిక వర్గాలు కలిస్తే గట్టి పోటీ ఉంటుందన్నది లెక్క. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అజయ్‌రాయ్‌ని మళ్లీ బరిలోకి దింపిందన్నది రాజకీయ విశ్లేషణ. ఈ లెక్కన మోదీ, శాలినీ యాదవ్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందనేది అర్థం అవుతోంది. -
మోదీ ఇలాకలో దీదీ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేపట్టనున్నారు. తాను వారణాసిని సందర్శించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె సంకేతాలు పంపారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను ఆహ్వానిస్తే తాను వారణాసిలో ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. వారు (అఖిలేష్, మాయావతి) తనకు నైతిక బలం ఇచ్చే స్నేహితులని దీదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా మమతా బెనర్జీ కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 29న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీలో 23 విపక్ష పార్టీల నేతలను ఆమె ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మమత రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమి ఓటమే లక్ష్యంగా ముందుకెళతానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. -
ప్రధాని ఇలాకాలోనే.. అడ్డదిడ్డం ఆపరేషన్లు!
అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటరీ నియోజకవర్గం. అక్కడే ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. వారణాసి జిల్లా చిరాయ్ పీహెచ్సీలో ఓ లేడీ డాక్టర్ ఇటీవల ఒకే రోజు 73 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి ఆరోగ్య కేంద్రం ఆరుబయట ఎండలో పడుకోబెట్టింది. అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్న ఆ పీహెచ్సీలో రికార్డు కోసమే డాక్టర్ లలిత్ యదవ్ ఒకేరోజు ఇన్ని ఆపరేషన్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిరాయ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం నాలుగు బెడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ మందికి అత్యవసర వైద్యం చేయాల్సి వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పోనీ ముందుగానే ఎక్కువ ఆపరేషన్లు అనుకున్నా కూడా అందుకు ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. అదేమీ లేకుండా.. ఆపరేషన్ చేయించుకున్న మహిళలను ఎండలో నేలపైనే పడుకోబెట్టారట! మహిళల కుటంబ సభ్యులు, బంధువులు గొడవ చేస్తే హడావుడిగా రగ్గులు తెచ్చి కప్పారట. ఈ విషయాన్ని వారణాసి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లగా దర్యాప్తునకు ఆదేశిస్తున్నామని చెప్పారు. ఇలాగే రికార్డు కోసం గత నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో డాక్టర్ ఆర్కే గుప్తా ఒకే రోజు 83 కుటంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంతో వైద్యం వికటించి 14 మంది మహిళలు మరణించిన విషయం తెలిసిందే.