నామినేషన్‌ వేసిన ప్రధాని మోదీ | Elections 2024: Pm Narendra Modi Filed Nomination | Sakshi
Sakshi News home page

వారణాసిలో నామినేషన్‌ వేసిన ప్రధాని నరేంద్ర మోదీ

Published Tue, May 14 2024 11:55 AM | Last Updated on Tue, May 14 2024 1:32 PM

Elections 2024: Pm Narendra Modi Filed Nomination

ఢిల్లీ: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికల కోసం నామినేషన్‌ వేశారు. మంగళవారం ఉదయం ఉత్తర ప్రదేశ్‌ వారణాసి కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. ఎన్నికల అధికారులకు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. 

నామినేషన్‌ సమర్పించే టైంలో మోదీ వెంట సాధువులు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఉన్నారు. మోదీ నామినేషన్‌ను నలుగురు నేతలు బలపర్చారు. వాళ్లలో అయోధ్య ఆలయ పూజారి, ఒకరు దళితుడు, మరో ఇద్దరు ఓబీసీ నేతలు ఉన్నారు.

మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఎన్టీయే నేతలతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రముఖులు వెళ్లారు.

అట్టహాసంగా మోడీ నామినేషన్

 

నామినేషన్‌ వేయడానికి ముందు.. దశ అశ్వమేథ ఘాట్‌లో మోదీ ప్రత్యేక పూజలు చేశారు.  ఇదిలా ఉంటే.. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఇది మూడోసారి. గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ.. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి ఫేజ్‌లో భాగంగా జూన్‌ 1వ తేదీన వారణాసి పార్లమెంట్‌ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement