dictatorship
-
నియంతృత్వంపై పోరాడదాం: సిసోడియా
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. నియంతృత్వాన్ని ప్రశి్నస్తూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై బిగ్గరగా గర్జిస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 24 గంటల్లో జైలు నుంచి బయటకు వస్తారని చెప్పారు. నిజాయతీకి ప్రతిరూపమైన కేజ్రీవాల్‌ను కుట్రపూరితంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన సిసోడియా శనివారం ‘ఆప్’ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయం తన భార్యతో కలిసి తేనీరు సేవిస్తున్న ఫొటోను మనీష్ సిసోడియా శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. 17 నెలల తర్వాత స్వతంత్రమైన సూర్యోదయాన మొదటి తేనీరు అని పేర్కొన్నారు. -
నియంతృత్వ శక్తులను ఓడిద్దాం: తేజస్వీ యాదవ్
పట్నా: దేశంలోని నియంతృత్వ శక్తులను ఓడిద్దామని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పరోక్షంగా విమర్శించారు. పట్నాలో శుక్రవారం విపక్ష పార్టీల భేటీపై శనివారం బిహార్ డెప్యూటీ సీఎం అయిన తేజస్వీ స్పందించారు. ‘ కన్యాకుమారి నుంచి కశీ్మర్దాకా నేతలంతా నియంతృత్వ శక్తులను ఓడిద్దామని విపక్షాలభేటీలో ప్రతినబూనారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోదీ గురించో మరే ఇతర వ్యక్తి గురించో కాదు. ప్రజా సంక్షేమం గురించి. విపక్షాల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వచ్చేనెలలో సిమ్లాలో జరిగే సమావేశంలో చర్చిస్తాం. ప్రస్తుతానికి ఇక్కడ తొలి అడుగు పడింది. గతంలో చరిత్రాత్మక చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమాలు బిహార్ నుంచే మొదలయ్యాయి ’ అని అన్నారు. ‘ సమావేశంలో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రతీ అంశాన్ని సామరస్యపూర్వక పరిష్కారం కోసమే స్వీకరించి చర్చించాం’ అని చెప్పారు. ఢిల్లీలో పరిపాలన సేవలపై కేంద్రం తెచి్చన ఆర్డినెన్స్‌లో కాంగ్రెస్ వైఖరి వెల్లడించాలని ఆప్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ నిరాకరిస్తుండటంతో శుక్రవారం భేటీ తర్వాత సంయుక్త పత్రికా సమావేశంలో పాల్గొనకుండానే కేజ్రీవాల్ ఢిల్లీకి వెనుతిరిగారు. ఈ విషయంపైనే తేజస్వీపైవిధంగా స్పందించారు. విపక్షాల భేటీని బీజేపీ అగ్రనేత అమిత్ షా ఫొటో సెషన్‌గా పేర్కొంటూ విమర్శించడంపై తేజస్వీ స్పందించారు. ‘ ఫొటో సెషన్ అంటే ఏమిటో వారికే బాగా తెలుసునన్నారు. -
అదంతా ఓ జ్ఞాపకం.. ఆ నలుగురి నియంతృత్వంలో దేశం: రాహుల్ ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇప్పుడు అది ఒక జ్ఞాపకమేనన్నారు. భారత్‌లో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోందని కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని స్వతంత్ర సంస్థలను ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది కాంగ్రెస్. దీనికి ముందు ఢిల్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. భారత్ నలుగురు వ్యక్తుల నియంతృత్వంలో ఉందని రాహుల్ పేర్కొన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలను చర్చించడానికి అవకాశం ఇవ్వట్లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్దంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆంక్షలు విధించారు. చదవండి: జుమ్లానామిక్స్‌ను దాచలేరు.. నిర్మలవి అసత్యాలు.. -
విద్వేష సిద్ధాంతాలతో దేశ పునాదుల్ని బలహీనపరిచే కుట్ర
న్యూఢిల్లీ: పటిష్ట పునాదులపై సమున్నతంగా నిల్చున్న భారత వారసత్వాన్ని బలహీనపర్చే కుట్రకు బీజేపీ తెర తీసిందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. విభజన సిద్ధాంతాలతో దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతూ దేశానికి హాని తలపెడుతోందని బీజేపీని సోనియా తూర్పారబట్టారు. కాంగ్రెస్ 137 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం పార్టీ శ్రేణులనుద్దేశిస్తూ సోనియా వీడియో సందేశమిచ్చారు. ‘భారత దేశ సంస్కృతిలో ఒకటిగా కలిసిపోయి, అద్భుతంగా పరిఢవిల్లుతున్న హిందూ–ముస్లిం మత సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నియమాలను పక్కకుతోసి నియంత పాలన కొనసాగుతోంది’ అని సోనియా ధ్వజమెత్తారు. ‘ ఇకపై ఈ దారుణాలకు కాంగ్రెస్ మౌన సాక్షిగా ఉండబోదు. దేశ వారసత్వ భావాలను చెరిపేసే ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుంటుంది’ అని ఆమె హామీ ఇచ్చారు. ‘ భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం, పాత్ర లేని కొన్ని విభజన, విద్వేష శక్తులు ప్రస్తుతం దేశ లౌకికగుణాన్ని నాశనం చేసే దారుణానికి ఒడుగడుతున్నాయి’ అని పరోక్షంగా బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ‘ అర్హత లేకున్నా తమకూ దేశ చరిత్రలో స్థానం కల్పించుకునేందుకు చరిత్రను తిరగరాసే యత్నం చేస్తున్నారు’ అని సోనియా అన్నారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జెండాను ఎగరేస్తుండగా హఠాత్తుగా జెండా నేలరాలింది. -
జానపద గాయకుడిని కాల్చి చంపిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నిరంకుశ పాలన సాగిస్తారనే అనుమానాలు బలపడు తున్నాయి. జానపద గాయకుడు ఫవాద్ అందారబీని తాలిబన్లు కాల్చి చంపినట్లు సమాచారం. బఘ్లాన్ ప్రావిన్స్‌లోని అందారబీ వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఒకసారి తాలిబన్లు తమ నివాసానికి వచ్చి, తన తండ్రితో మాట్లాడి టీ తాగి వెళ్లారని ఫవాద్ కుమారుడు జవాద్ అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. కానీ, శుక్రవారం తాలిబన్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపేశాడ న్నారు. దోషిని శిక్షిస్తామని స్థానిక తాలిబన్ నేతలు హామీ ఇచ్చారన్నారు. ‘మా నాన్న అమాయకుడు. ప్రజలకు వినోదం పంచడం మాత్రమే తెలిసిన గాయకుడు’అని ఆయన తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గాయకుడు అందారబీ ఘిచాక్ అనే వాద్య పరికరాన్ని వాయిస్తారు. తన జన్మభూమి, తన ప్రాంత ప్రజలు, తన దేశం గురించి సంపద్రాయ, దేశభక్తిని ప్రబోధించే పాటలు పాడుతుంటారు. కళాకారుల హక్కులను గౌరవించేలా అంతర్జాతీయ సమాజం తాలిబన్లపై ఒత్తిడి తేవాలని ఐరాస సాంస్కృతిక విభాగం ప్రతినిధి కరీమా బెన్నౌన్ అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ స్పందిస్తూ... తాలిబన్ల వైఖరి మార లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. -
పౌర ప్రకపంనలు : కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
-
కమల్ హాసన్‌ను అడ్డుకున్న పోలీసులు
చెన్నై : బీజేపీ నియంతృత్వం వైపు అడుగులు వేస్తుందని మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా చిచ్చు రగిలిస్తున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యునివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీబావం తెలిపేందుకు బుధవారం కమల్ అక్కడికి వెళ్లారు. కానీ కమల్‌ను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేయడంతో బయటినుంచే విద్యార్థులతో మాట్లాడారు. 'ఈ బిల్లు దేశానికి సంబంధించినది. ఏ బిల్లు వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు. ఇది ప్రజలకు మంచి చేయదనుకుంటే ప్రభుత్వం దానిని వెనుకకు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ ప్రభుత్వం ఇవేవి పట్టించుకోకుండా నియంతృత్వ పాలనవైపు అడుగులు వేయడం దురదృష్టకరం' అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. కాగా, పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిలో కమల్‌హాసన్ కూడా ఉన్నారు. (చదవండి : పౌర బిల్లుపై దీదీ కీలక వ్యాఖ్యలు..) Kamal Haasan: I am not allowed to go inside. Till I die, I will call myself a student, I have come here in that capacity to be their defender. I will keep voicing whether or not I have started a party and now that I have started a party it becomes my duty to be here. https://t.co/pkdsv1MFxP pic.twitter.com/56Kpn9AFHu — ANI (@ANI) 18 December 2019 -
నిజాంలాగా కేసీఆర్‌ది నిరంకుశమే: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజాంలాగానే నిరంకుశంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, కె.మాధవి ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లా డుతూ.. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్లిన వారిని పోలీసులు అమానవీయంగా కొట్టడం, జైళ్లలో పెట్టడం నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థులే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి సంతాపం ప్రకటించడానికి కూడా మంత్రులకు తీరిక లేదా అని వారు ప్రశ్నించారు. అయ్యప్ప పూజలో భజనలు చేసుకోవడానికి అభ్యంతరం చెబుతున్న పోలీసులు.. సన్‌బర్న్ లాంటి తాగి, తందనాలాడే పార్టీలకు అనుమతులు ఇస్తున్నారని మాధవి విమర్శించారు. ఓయూ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి: ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న బోధనేతర, టీచింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మంగళవారం డిమాండ్ చేశారు. ఓయూలో 20 రోజులుగా పోరాడుతున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా ఆయన రోజంతా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. -
‘ట్రంప్ విజయంతో ప్రజల్లో నియంతృత్వం’
లండన్: అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం, బ్రెగ్జిట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో నియంతృత్వం పెరుగుతోందని బ్రిటన్వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఎంజీ నిర్వహించిన సర్వే వివరాలను ‘ది ఇండిపెండెంట్’ వార్తా పత్రిక ప్రకటించింది. యూకేతో సహా యూరప్ అంతటా ప్రజల్లో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ట్రంప్ విజయంతో అమెరికా వ్యాప్తంగా ఫాసిజమ్ వేళ్లూనుకుంటుందని బ్రిటిష్ ప్రజలు చెప్పారు. -
27 సెప్టెంబర్, 1988 ఎర్రజెండా ఎగిరింది!
కడుపులో చల్ల కదలకుండా మయన్మార్ సింహాసనంపై నింపాదిగా కూర్చున్న ‘నియంతృత్వం’ వెన్నులో చలి పుట్టిన చారిత్రక రోజు ఇది. దీనికి కారణం...‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ పార్టీ పుట్టుక. ప్రజాస్వామ్య నినాదంతో ప్రజల ముందుకు వచ్చింది ఎన్ల్డి. నోబెల్ బహుమతిగ్రహీత ఆంగ్‌సాన్ సూకి ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. సూకీ పార్టీనీ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. మిలటరీ నియంత పాలకులు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ప్రజా తీర్పు ప్రతిఫలించకుండా జాగ్రత్త పడ్డప్పటికీ 1990 పార్లమెంటరీ ఎన్నికలలో 392 స్థానాలను గెలుచుకుంది ఎన్ఎల్డి. అయితే ప్రజా తీర్పును నియంత పాలకులు ఆమోదించలేదు. ఆ తరువాత ఎన్ని పరిణామాలు జరిగినప్పటికీ బర్మా రాజకీయచరిత్రలో ‘ఎన్ఎల్డి’ ఆవిర్భావం కీలక మార్పులకు దారి తీసింది. -
ఇది సాంస్కృతిక నిరంకుశత్వం
గోవధపై సార్వత్రిక నిషేధం విధించాలన్నది బీజేపీ ప్రభుత్వ ఆలోచన. దాని అమలుకి జైనుల పండుగను ఒక అవకాశంగా ఎంచుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం శాకాహార ఎజెండాను తెరపైకి తెస్తున్నాయి. వివిధ కులాలకు, తెగలకు ప్రత్యేక ఆహారపు అలవాట్లున్నాయి. హిందువులలో ఎక్కువ మంది మాంసాహారులే. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, వ్యవసాయ కులాలు మాంసాహారులే. హిందువులంతా ఒక్కటేనంటూ కొందరి ఆహారపుటలవాట్లను అందరిపై రుద్దాలనుకోవడం బీజేపీ చింతనలోనే ఉన్న లోపం. చందమామను, జాబిల్లిని రమ్మని, గోగుపూలు తెమ్మని సున్నితంగా ప్రకృ తిని ఆహ్వానించిన అనుభవం చాలా మందికి ఉంది. కానీ అదే పాటలో తమ దైన సంస్కృతిని ప్రతిబింబించే ఆహారాన్ని, అలవాట్లను కలబోసిన భాష అణగారిన వర్గాలకే బాగా పరిచయం. చందమామ రావే, సక్కంగ రావే... గొల్కొండకు బోయి. గొర్రెను తెచ్చి, నడి ఇంట్లో వేసి నాలుకపీకి, సియ్య బువ్వ మనం తిని, చీకిన బొక్క కుక్క కేస్తే... అనేది కొన్ని కులాల పాట, ఆ కులాలే పాడగల పాట. అందుకే భాషకు కులముంది. అలాగే ఆహారానికీ కులముంది. అది తెగకు, కులానికి, మతానికి ముడిపడి ఉంది. మన దేశంలో ప్రస్తుతం మతాధిపత్యాన్ని, అధికారాన్ని చలాయించడానికి ఆ ఆహారాన్నే ఆయుధంగా వాడుకుంటున్నారు. మాంసాహార నిషేధం పేరుతో అది జోరుగా సాగుతోంది. ప్రజల తిండిపై ప్రభుత్వ పెత్తనం? ‘‘మనం తీసుకునే ఆహారానికి ఒక స్వీయ వ్యక్తీకరణ, ఒక అస్థిత్వం కలగలసి ఉన్నాయి. అది సంస్కృతికి, సంప్రదాయానికీ సంబంధించిన అంశం. తర తరాల మానవ పరిణామ క్రమంలో ఆహారపుటలవాట్లు ఏర్పడతాయి’’ అని ఏమేలా గోమన్, కత్రిన్ సుచెర్లు తమ ‘ఆహారం - సంస్కృతి’ అనే పుస్తకం లో అన్నారు. అయితే ఆధిపత్య భావాలు అన్నింటిపైనా ఆంక్షలు విధించ గలవు. భాష, యాస, యోచన, తినే తిండి ఇలా దేనిపైనైనా నిషేధించగలవు. మతం పేరిటో, మరో సాకుతోనో ప్రజలు తినే తిండిని సైతం ప్రభుత్వాలు నిషేధించడాన్ని ముస్లింలే కాదు, హిందువులు సైతం జీర్ణించుకోలేకపోతు న్నారు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు పూర్తిగా భంగకరం. మొదట మహా రాష్ట్రలో ఎద్దులు, దూడలను వధించకూడదని, వాటిని ఆహారంగా తీసుకోకూ డదని చట్టం తెచ్చారు. రాజస్థాన్ ప్రభుత్వం దాన్ని అనుసరించింది. కాగా, కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రభు త్వాలు జైనుల సంప్రదాయక పండుగ ‘పర్షుయాన్’ సందర్భంగా ఒక వారం రోజులపాటు అన్ని రకాల మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి. తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దాన్ని రెండు రోజులకు కుదించింది. నేటి ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలు ఏ తిండి తినాలి, ఏం తినకూడదు అనేవి ప్రభుత్వాలు నిర్ణయిం చాల్సినవి కావు. అలా చేస్తే అది నిరంకుశత్వం అవుతుంది. వివిధ దేశాల ప్రజలకు విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలు, ఆహారపుటలవాట్లున్నాయి. చైనాలో అన్నం, సోయాసాస్ తింటే, మెక్సికోలో మొక్కజొన్నలు, మిరియాలు ఉపయోగిస్తారు. ఐర్లాండు ప్రజలు ఆలుగడ్డలు, బ్రిటిష్ వాళ్లు టీ, వెన్న, ఫ్రెంచి వాళ్ళు వైన్ తమ ప్రత్యేక ఆహారంగా భావి స్తారు. అలాగే మాంసాహారంలోనూ భిన్నత్వం ఉంది. కొరియాలో కుక్కలు, చైనాలో పాములు, కప్పలు అలవాటుగా తినే మాంసాహారమే. మన దేశంలో కొన్ని కులాలలో ఎలుకలను, పిల్లులను తినే అలవాటుంది. ముస్లింలకు ఆవు, ఎద్దు మాంసం ప్రియమైనది. పైగా అది చవక. కాబట్టి నిరుపేదలైన దళి తులు, ముస్లింలకు ఆవు, ఎద్దు ప్రధాన మాంసాహారం. ఎవరి ఆహారపుటల వాట్లు వారి ప్రత్యేక సంస్కృతిని, అస్థిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక ఇక పోతే జైనులు మాంసాహారులు కాదు. కూరగాయలు తినడం కూడా వారి దృష్టిలో హింసే. అది వాళ్ళ సంస్కృతి. ఇతరులు దానిని గౌరవించడం సంస్కారం. అందరి ఆహారపుటలవాట్లను గౌరవించడం ప్రజాస్వామ్యం. అందరూ మాం సాహారులో లేదా శాకాహారులో కావాలనుకోవడం పూర్తిగా తప్పు. బీజేపీ చింతనలోనే ఉంది లోపం నేటి మాంసాహార నిషేధం ఏ అహింసా సామ్రాజ్యస్థాపనకో జరిగింది కాదు. గుజరాత్లో చాలాకాలం క్రితమే గోవధను నిషేధించారు. మహారాష్ట్రలో దాన్ని అనుసరించారు. పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు అదే బాటలో ఉన్నాయి. గోవధపై సార్వత్రిక నిషేధం విధించాలన్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆలోచన. దాని అమలులో భాగంగా జైనుల పండుగను అవకాశంగా ఎంచు కున్నారు. హిందూత్వ రాజకీయాల బీజేపీ ప్రభుత్వాలు ఒక పథకం ప్రకారం తమ శాకాహార ఎజెండాను తెరపైకి తెస్తున్నట్లుంది. మన దేశం కులాలు, తెగ లుగా విభజింపబడి ఉన్నది. వాటికి తమ ప్రత్యేక ఆహారపు అలవాట్లు న్నాయి. హిందువులలో సైతం ఎక్కువ మంది మాంసాహారులే. పైగా వారి దేవుళ్ళు, దేవతలకు మాంసం ప్రధాన నైవేద్యం. దళితులు, ఆదివాసులు, వెనుకబడిన కులాలు, వ్యవసాయ కులాలన్నీ మాంసాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నాయి. బీజేపీ చింతనలోనే పెద్ద లోపం కనిపిస్తోంది. హిందువు లందరూ ఒక్కటేననే పేరు మీద మైనారిటీ ఆహారపుటలవాట్లను మెజారిటీ ప్రజల మీద రుద్దుతున్నారు. ముస్లిం వ్యతిరేకత కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈనెల 25వ తేదీన ముస్లింల బక్రీద్ పండుగ ఉన్నది. జైనుల పేరు మీద ముస్లింలను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నది. పైగా మాంసాహారం అంటేనే ముస్లింలు తీసుకొచ్చిన అపచారంగా ప్రచారం చేస్తున్నారు. దేశంలో నేడు సంపూర్ణ శాకాహారులుగా ప్రకటించుకుంటున్న బ్రాహ్మణులతో సహా అందరూ ఒకప్పుడు మాంసాహారులే. ఆవు, ఎద్దు లేత దూడల మాంసాన్ని అత్యంత ప్రియమైన ఆహారంగా భావించినది బ్రాహ్మ ణులేనని వేదాల నుంచి పురాణాల వరకు స్పష్టంగా తెలుపుతున్నాయి. యాగాలు, క్రతువులలో వేలాది పశువులను బలిచేసేవారు. అయితే బౌద్ధాన్ని దెబ్బతీయడానికి తర్వాతి కాలంలోని వైదిక మతపెద్దలు వారికంటే ముం దుకు వెళ్ళి ‘పవిత్రత’ పేరుతో గోవధని నిషేధించారు. బుద్ధుడు మాంసాహార వ్యతిరేకి కాదు బౌద్ధం పశువుల హత్యాకాండను నిరసించడానికి ప్రధాన కారణం వ్యవ సాయ సంక్షోభం. ఆనాటి వ్యవసాయాధారిత సమాజంలో పశుసంపద వ్యవ సాయ పనులకు కీలకంగా ఉండేది. మితిమీరిన యాగాలు, క్రతువుల వల్ల పశు సంపద క్షీణించిపోయే ప్రమాదం వచ్చింది. అందుకే పశు సంపదను కాపాడడం కోసం బుద్ధుడు పెద్ద ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది. అయితే బుద్ధుడు ఏనాడూ మాంసాహారానికి వ్యతిరేకం కాదు. ప్రజల తిండిని, ఆహా రపుటలవాట్లను ఆయన చులకనగా చూడలేదు, వ్యతిరేకించ లేదు. పైగా ప్రజలు మాంసం పెట్టినా తినాలని, తిరస్కరించకూడదని బోధించాడు. మాంసాహారం పట్ల బుద్ధుడికి ఉన్నది వ్యతిరేకత కాదు. వ్యవసాయక సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న విచ్చలవిడి పశుసంహారాన్ని మాన్పించాలని ప్రయత్నించాడు, అదే బోధించాడు. బౌద్ధం స్వీకరించిన అశోకుడు జంతు వధపై కొన్ని ఆంక్షలు విధించినా ఏనాడూ తన అధికారాన్ని ప్రయోగించి మాంసాహారాన్ని నిషేధించేందుకు ప్రయత్నించలేదు. వారంలో కొన్ని రోజు లు మాత్రమే తమ వంటశాలలో మాంసాహారాన్ని వండకూడదనే ఆంక్ష విధించాడు. అయితే నేడు మాంసాహారంపై నిషేధం విధిస్తున్న పాలకులు పండు గలు, సంప్రదాయాల గురించే మాట్లాడుతున్నారు. కానీ మాంసాహారం వల్ల మంచి, చెడులను వివరించడం లేదు. గుండె సంబంధిత వ్యాధులున్న వాళ్ళు తప్ప మిగతా వారందరికీ మాంసాహారం తీసుకోవడం మంచిదేనని అధ్యయ నాలన్నీ భావిస్తున్నాయి. భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైద్యశాస్త్రం ప్రామాణిక గ్రంథమైన ‘చరక సంహిత’ మాంసాహారం విశిష్టతను వివరిం చింది. బాలింతలు మాంసాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారని అం దులో స్పష్టం చేశారు. ముఖ్యంగా మేక, గొర్రె మాంసాలు రక్త వృద్ధిని కలగ జేస్తాయని పేర్కొన్నారు. శరీరంలోని వివిధ అంగాల నిర్మాణంలోనూ, వాటి పనిలోనూ మాంసాహారం ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతు న్నారు. శరీరకశక్తిని పెంచే ప్రొటీన్లు ఎక్కువగా మాంసాహారం వల్లనే లభి స్తాయి. ఈ ప్రొటీన్లు గాయపడిన శరీర భాగాలను త్వరగా కోలుకునేటట్టు చేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయి. మాంసాహారంలో ఐరన్, జింక్ సెలినియం లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఐరన్ వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తెలిసిందే. అంతేకాదు విట మిన్ ఏ, బీ, డీలు పుష్కలంగా లభ్యమవుతాయి. వైవిధ్య విధ్వంసం అవివేకం అనారోగ్యకరం కాని, పోషకాహార విలువలు కలిగిన ఆహారపు అలవాట్ల విష యంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం ఒకరకంగా మూర్ఖత్వమే అవు తుంది. ఆహారపుటలవాట్లు ఒక్క రోజులో ఏర్పడేవి కావు. ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితమైనవి అంతకన్నా కాదు. మనిషి చారిత్రక పరిణా మక్రమంలో పలురకాల ఆహారపుటలవాట్లను ఏర్పర్చుకున్నాడు, కొన్నింటిని తిరస్కరించాడు కూడా. రుచికరంగా ఉన్నదాన్ని, శక్తినిచ్చేదాన్ని, ఆరోగ్యకర మైనదాన్ని స్వీకరించి కొనసాగించాడు. ఆయా దేశాల, ప్రాంతాల, ప్రదేశాల వాతావరణ, భౌగోళిక, జీవావరణ పరిస్థితులకు అనుగుణంగానే మనిషి ఆహారపుటలవాట్లు ఉన్నాయి. అంతేగానీ ప్రభుత్వాల, పాలకుల ఆదేశాలను బట్టి ఏర్పడినవి కావు. కాబట్టి ఏ మతం వారు ఆ మత సంప్రదాయాలను కొనసాగించుకోవచ్చు. అందుకు భిన్నంగా అన్ని మతాలవారు ఒకే ఆహా రాన్ని తినాలనడం తప్పే, తినకూడదనడమూ కూడా తప్పే. ఆహారపుటలవా ట్లలో ఒకరి అభిప్రాయాలను మిగతా వారి మీద రుద్దడం అప్రజాస్వామికం. శాకాహారమైనా, మాంసాహారమైనా దానిని వ్యక్తి, సమూహాల స్వేచ్ఛకు వదిలిపెట్టాలి. ప్రభుత్వాలు చట్టాలు దానిని నియంత్రించడం అవివేకం. నిషే ధమే ఆయుధంగా ప్రజల సాంస్కృతిక వైవిధ్యాన్ని ధ్వంసం చేయాలనుకోవ డం మూర్ఖత్వం. అది ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య