
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజాంలాగానే నిరంకుశంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, కె.మాధవి ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లా డుతూ.. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్లిన వారిని పోలీసులు అమానవీయంగా కొట్టడం, జైళ్లలో పెట్టడం నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థులే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి సంతాపం ప్రకటించడానికి కూడా మంత్రులకు తీరిక లేదా అని వారు ప్రశ్నించారు. అయ్యప్ప పూజలో భజనలు చేసుకోవడానికి అభ్యంతరం చెబుతున్న పోలీసులు.. సన్‌బర్న్ లాంటి తాగి, తందనాలాడే పార్టీలకు అనుమతులు ఇస్తున్నారని మాధవి విమర్శించారు.
ఓయూ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి: ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న బోధనేతర, టీచింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మంగళవారం డిమాండ్ చేశారు. ఓయూలో 20 రోజులుగా పోరాడుతున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా ఆయన రోజంతా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment