nvss prabhakar
-
కేంద్రం నిధులతోనే ఉప్పల్–వరంగల్ ‘కారిడార్’ నిర్మాణం
ఉప్పల్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే ఉప్పల్–వరంగల్ జాతీయ రహదారి (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. నిర్మాణ పనులు పనులు 28 నుంచి పునఃప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. ఉప్పల్ స్కై ఓవర్ నిర్మాణ పనులలో జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్లే జాప్యం జరుగుతుండటాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తాను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. యుద్ధ ప్రాతిపదిక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయాలని కోరామన్నారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి జులై 24న అవసరమైన నిధుల విడుదలకు అనుమతి మంజూరు చేశానారన్నారు. ఈ నెల 28 నుంచి పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి అదేశించారని ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ వెంటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ద్వారా రోడ్డుకు ఇరువైపులా బీటీ రోడ్డు వేస్తామని ప్రకటన చేయించారని ఎద్దేవాచేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని రోడ్డు వేయిస్తుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ కోరారు. దాన్ని మేమే వేస్తున్నామన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కపట నాటకానికి తెర తీసిందని ఆయన విమర్శించారు. -
మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్‌షా సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ నేతలకు కంటిమీద కునుకు లేకుండాపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ మెప్పుకోసం పనిలేని, పనికిరాని రాష్ట్ర మంత్రులు బీజేపీపై పిచ్చి ప్రేలాపనలతో విమర్శలు చేస్తున్నారన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇకపై ప్రధాని మోదీ మొదలుకుని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడితే రాష్ట్ర మంత్రులను తెలంగాణలో తిరగనివ్వబోమని, తాట తీయడంతో పాటు వారిని తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. సభలో అమిత్‌షా చేసిన విమర్శల్లో ఏది అబద్ధమో చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సీఎం మొదలు ఎస్సీలకు 3 ఎకరాలు, దళితబంధు, నిరుద్యోగభృతి ఇతర హామీలను గాలికొదిలేయడం, పీఎంఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథ కాలు అమలు చేయకపోవడం అవాస్తవమా అని ప్రశ్నించారు. రాష్ట్ర కేబినెట్లోనే అత్యంత అవినీతి కేటీఆర్ మున్సిపల్ శాఖలోనే జరుగుతోందని ఆరోపించారు. చదవండి👇 Hyderabad: పెద్ద అంబర్‌పేట్‌లో స్కూల్ బస్సు బీభత్సం 8 ఏళ్ల కిందటి ‘అచ్ఛేదిన్’ ఇవేనా..?: మోదీ ట్వీట్‌పై కేటీఆర్ -
సీఎం క్షమాపణలు చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: ప్రొటోకాల్, ఇతర ఉల్లంఘనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణ చెప్పి ప్రస్తుత వివాదానికి ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్‌చేశారు. ఆ విధంగా కేసీఆర్ చేయని పక్షంలో రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిన సీఎంగా తెలంగాణ చరిత్రలో మిగిలిపోతారని హెచ్చరించారు. శుక్రవారం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గవర్నరే స్వయంగా తనకు జరుగుతున్న అవమానాలపై ప్రస్తావించిన నేపథ్యంలో వాటిపై సీఎం స్పందించాలి తప్ప మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎలా సమాధానమిస్తారని ప్రశ్నించారు. సీఎం వివరణ ఇవ్వకుండా మంత్రులతో మాట్లాడించడం చూస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరిరక్షకురాలైన గవర్నర్‌ను, రాజ్యాంగ వ్యవస్థను కించపరుస్తోందని ఆరోపించారు. ఇటీవల యాదాద్రి సందర్శనకు, అంతకు ముందు మేడారం జాతరకు వెళ్లినపుడు గవర్నర్‌ను ఏ విధంగా అవమానించారో ప్రజలు చూశారన్నారు. రాష్ట్రం మత్తు పదార్థాలకు కేంద్రంగా మారడం, మద్యం ఏరులై పారడం వల్ల జరిగిన దుర్ఘటనలు, అత్యాచారాలు చోటుచేసుకోవడంపై ప్రభుత్వం సీఎస్ సోమేశ్‌కుమార్‌కు స్థానభ్రంశం కలిగించాలని, ఎక్సైజ్ కమిషనర్‌ను విధుల్లోంచి తొలగించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
Huzurabad: ఓట్ల కోసం కుట్రలు చేయడం సిగ్గుచేటు
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మంత్రులు తమ నియోజకవర్గాల్లో అమలు చేయించుకునే దమ్ము, ధైర్యం ఉంటే స్పష్టం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. మంత్రులు తమ నియోజకవర్గాలు, మంత్రిత్వశాఖలను గాలికి వదిలి హుజూరాబాద్ రాజకీయం కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారని, ఓటర్లను మభ్యపెట్టడానికి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు తమ నియోజకవర్గాల్లోని దళితులకు మూడెకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీసబ్ ప్లాన్ నిధులతో ఎంతమందిని ఆదుకున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఒక్క ఈటల రాజేందర్‌ను ఓడించడానికి టీఆర్ఎస్ యంత్రాంగం, ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతున్నా నేటికీ ఆశించిన ఫలితం రాలేదన్నారు. సర్వేలన్నీ ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మత రాజకీయాలకు అలవాటు పడిపోయి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేని దుస్థితిలో ఉందని దుయ్యబట్టారు. మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని, నాటి నిజాం సర్కారుకు నేటి కేసీఆర్ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల అనంతరం టీఆర్ఎస్కు కౌంట్‌డౌన్ మొదలవుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కన్న కృష్ణ, జిల్లా కార్యదర్శి రాపర్తి ప్రసాద్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, రాపర్తి విజయ, కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, మీడియా ఇన్చార్జి కటకం లోకేశ్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. చదవండి: ప్రజల దృష్టిలో చిల్లర కావద్దు -
‘నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారు’
సాక్షి, హైదరాబాద్ : సీపీఐకి చిత్తశుద్ధి ఉంటే హుజూర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఉపసంహరించుకొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ నోరు విప్పాలని, వారు నోరు విప్పితేనే టీఆర్ఎస్ ఓనర్లు అవుతారని మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రానికి కేంద్రం కావాల్సిన యూరియాను సరఫరా చేసిందని, స్పీకర్ పోచారం, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సొంత జిల్లాల్లో యారియా కొరతను సృష్టించారని ఆరోపించారు. యూరియా కొరత సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పరిపాలన స్తంభించిదని, ఈఎస్ఐ స్కాం, విస్తరిస్తున్న వ్యాధులపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రభాకర్ విమర్శించారు. -
కేసీఆర్ 31 జిల్లాల పేర్లు పలకగలరా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 31 జిల్లాల పేర్లు పలకగలరా అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అవినీతి విస్తరించిందని.. మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఎప్పుడేం మాట్లాడుతారో అర్థంకాక అధికారులు అయోమయంలో పడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే పరిపాలనలో తెలంగాణ స్ఫూర్తి కొరవడిందని విమర్శించారు. కేసీఆర్ ఒక్క జిల్లాలో కూడా సంపూర్ణంగా పర్యటించలేదని అన్నారు. ఎన్నికల కోసం తప్పా, పరిపాలన కోసం కేసీఆర్ ఎన్నడూ రాష్ట్రంలో పర్యటించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిరిసిల్ల, గజ్వేల్ తప్ప ఇతర నియోజకవర్గాలు కనబడవా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
కూటమిపై ప్రజలకు విశ్వాసం లేదు..
సాక్షి, హైదరాబాద్ : అవకాశవాద పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిపై ప్రజలకు విశ్వాసం లేదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే కూటమిని ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టాడని విమర్శించారు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో కలిసి ఆదివారం రోడ్డుషోలో పాల్గొన్న గడ్కరీ టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లు ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలని ధ్వజమెత్తారు.నిన్నటి వరకూ తమతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి అధికారం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రత్యేక ప్రణాళికలతో బీజేపీ ముందుకొస్తుందని హామీ ఇచ్చారు. ఛాయ్‌వాలా ప్రధాని అయ్యాడంటే అది బీజేపీ గొప్పతనమని చెప్పుకొచ్చారు. -
నాకూ ఒక గోవును ఇవ్వండి : ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వాలని ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గోవులను పంచుతామని ఆపార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌బీఎస్‌ఎస్ ప్రసాద్ ఇటీవల ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సోమవారం ఓ సమావేశంలో ఓవైసీ దీనిపై స్పందిస్తూ.. బీజేపీ ప్రకటించిన విధంగా తనకు కూడా ఓ గోవును ఇవ్వగలరా అని ఆయన ప్రశ్నించారు. ‘‘వారు నాకు గోవును ఇస్తే దానిని పవిత్రంగా చూసుకుంటాను. వాళ్లు నాకు ఇవ్వగలరా?’’ అని ఓవైసీ ప్రశ్నించారు. కాగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గో మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌లో వసుంధర రాజే గోవుల రక్షణకు ఏటా వందలకోట్లు కేటాయించి ప్రత్యేక రక్షణలు కూడా తీసుకుంటున్నారు. -
సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. సాయంత్రం ఆరుగంటలకంతా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, బార్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసివేయాలన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం మహమ్మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందని, అందుకే మద్యపాన నియంత్రణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతరకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. హనుమాన్, అయ్యప్ప, అమ్మవారి దీక్ష ముగిసి ఆలయాలకు వెళ్లేవారికోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. వక్ఫ్, ఎండోమెంట్, క్రైస్తవ దేవాలయాల భూమల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల కోసం ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ మున్సిపాలిటీ వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఉద్యోగ భద్రత, హెల్త్ స్కీం కల్పిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై అత్యధిక వ్యాట్ తెలంగాణ వసూలు చేస్తోందని అన్నారు. తెలంగాణ వసూలు చేస్తున్న వ్యాట్‌ను తాము అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. -
కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట: ఎన్వీఎస్ఎస్
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ అనే ఓ పార్టీ ఏడున్నదో ఎవరికీ తెలియదు..’అని సీఎం కేసీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట అని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎక్కడా లేకపోతే ఢిల్లీకి పోయి బీజేపీ నాయకులకు పొర్లుదండాలు ఎందుకు పెడుతున్నావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఇంటి అద్దె హామీ విషయంలో ఎవరికి కడతారు? ఏం కడతారని ఆయనకు అర్థం కాక విమర్శిస్తున్నారని, అది ప్రజలకు అర్థమైందని అన్నారు. 50 గదుల విశాలమైన ప్రగతి భవన్లో ఉండే ఆయనకు పేదల బాధ ఏం తెలుస్తుందని విమర్శించారు. తాము అ«ధికారంలోకి వస్తే రాజకీయ అవినీతిని నిర్మూలిస్తామని, దాంతో అలాంటి పథకాలు మరో పది అమలు చేయవచ్చని పేర్కొన్నారు. -
ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైంది
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఘోరంగా తయారైందని, వెంటనే శాసనసభ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కోరారు. విలేకరులతో మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులను ప్రభుత్వం ఆపేసిందని తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ల చెల్లింపులు కూడా ఆగిపోయాయని అన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల సంక్షేమం పడకేసిందని చెప్పారు. కొత్త పథకాల వల్ల పాత పథకాలకు డబ్బుల్లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. వైద్యశాఖలో అవినీతి ఏరులై పారుతోందని, ఎంసెట్ స్కాంకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, దానికి పరిపూర్ణానంద స్వామిజీ నగర బహష్కరణే నిదర్శనమన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల పరిస్థితులపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. మహాభారతం, రామాయణంపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. నారాయణ కామెంట్స్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తుందో వేచి చూస్తామని వెల్లడించారు. -
‘కత్తి మహేష్‌పై జీవితకాల నిషేధం విధించాలి’
సాక్షి, హైదరాబాద్: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆరు నెలల నిషేధం సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుంచి శాశ్వతంగా కత్తి మహేష్‌ను బహిష్కరించాలని, జీవితకాలం పాటు నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళితుల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్‌పై ప్రభుత్వానికి పట్టదా? స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఖండించారు. కత్తి మహేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. స్వామిజీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేస్తామంటే ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు సినీ నటి కరాటే కల్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. చదవండి : పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత! కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు! కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం: డీజీపీ -
నిజాంలాగా కేసీఆర్‌ది నిరంకుశమే: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిజాంలాగానే నిరంకుశంగా ఉందని బీజేపీ అధికార ప్రతినిధులు ఎన్.వి.సుభాష్, కె.మాధవి ఆరోపించారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లా డుతూ.. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించడానికి వెళ్లిన వారిని పోలీసులు అమానవీయంగా కొట్టడం, జైళ్లలో పెట్టడం నియంతృత్వానికి పరాకాష్ట అని మండిపడ్డారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన విద్యార్థులే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబానికి సంతాపం ప్రకటించడానికి కూడా మంత్రులకు తీరిక లేదా అని వారు ప్రశ్నించారు. అయ్యప్ప పూజలో భజనలు చేసుకోవడానికి అభ్యంతరం చెబుతున్న పోలీసులు.. సన్‌బర్న్ లాంటి తాగి, తందనాలాడే పార్టీలకు అనుమతులు ఇస్తున్నారని మాధవి విమర్శించారు. ఓయూ సిబ్బందిని క్రమబద్ధీకరించాలి: ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న బోధనేతర, టీచింగ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్ మంగళవారం డిమాండ్ చేశారు. ఓయూలో 20 రోజులుగా పోరాడుతున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి మద్దతుగా ఆయన రోజంతా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. -
ఉప్పల్ ఎమ్మెల్యే కారుపై దాడి
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపుల విషయంలో ఇప్పటికే పలు పార్టీలలో లుకలుకలు బయట పడుతుండగా.. తాజాగా ఓ ఎమ్మెల్యే వాహనం పై అసమ్మతి వర్గానికి చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్‌లో గురువారం చోటుచేసుకుంది. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కారును అడ్డుకున్న కొందరు స్థానికులు దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. -
టీడీపీ, బీజేపీ డిష్యుం డిష్యుం
-
టీడీపీ, బీజేపీ డిష్యుం డిష్యుం
హైదరాబాద్: అధినేతల ఆదేశాలను పక్కకుపెడుతూ తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు మరోసారి పోట్లాడుకున్నారు. ఈసారి ఉప్పల్ లోని మేకల భారతి గార్డెన్ ఇందుకు వేదికైంది. ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్‌లో జరిగిన నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం రసాబాసగా మారింది. ఫ్లేక్సిలో టీడీపీ నేత వీరేందర్ గౌడ్ బోమ్మ లేకపోవడమే ఈ వివాదానికి కారణం. సభా వేదికపై ఓ పక్క ఎమ్మెల్యే ప్రభాకర్, ఎంఎల్సీ రాంచందర్‌రావులు... మరో పక్క రంగారెడ్డి జిల్లా అర్బన్న్ అధ్యక్షులు మీసాల చంద్రయ్యలు ఉన్నారు. అదే సమయంలో వీరేందర్ గౌడ్ రాకతో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. కొంత మంది టీడీపీ కార్యకర్తలు సభా స్థలిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చించేసారు. వీరేందర్ గౌడ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో... ప్రతిగా బీజేపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ న్యాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో స్పందించడంతో సభా సమావేశంలో గందర గోళం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ లోపు సమావేశపై వేదికపై ఉన్న ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకుంటూ స్టేజికింద వరకు వచ్చారు. చోక్కాలు పట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ధూషణలకు దిగారు. దీంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఎంతకు కార్యకర్తలు తగ్గక పోవడంతో వీరేందర్ గౌడ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు కూడా వెనుదిరిగారు. చివరికి సభ ప్రారంభం కాకుండానే ముగిసింది. అనంతరం సభా ప్రాంగణంలో ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ... పది మంది కార్యకర్తలను వెనుకేసుకోచ్చి బోమ్మ కోసం రాద్దాంతం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకం ఉన్న నాయకుడు ఇలా చేస్తాడా అంటూ పది మందితో రాద్దాంతం చేయాలకుంటే మేం అంతకు ఐదు రెట్లు ఎక్కువ చేసి చూపిస్తామన్నారు. మరోవైపు.. వీరేందర్‌గౌడ్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర నాయకుని బోమ్మ లేదని కార్యకర్తలు ఆవేశానికి గురైనట్టు చెప్పారు. ప్రోటోకాల్ పని చేయలేదనే బాధే కానీ, మరో ఉద్దేశం లేదన్నారు. అన్ని సర్థుకు పోతాయని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పని చేస్తామని చెప్పారు. -
'ఇళ్లు లేవు...రావు, గాల్లోకి వదిలేశారు'
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్...ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయిందన్నారు. ఇళ్లు లేవు...ఇళ్లు రావనేదే టీఆర్ఎస్ సర్కార్ విధానమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇక విద్యారంగానికి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ మేథోమధనం తర్వాత చూద్దామంటూ విద్యను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. హామీలను ఎన్నికల ప్రచారానికి మాత్రమే టీఆర్ఎస్ వాడుకుందన్నారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ భూమిని సాగులోకి తెస్తామని ఆ విషయాన్నే ప్రభుత్వం మరచిందన్నారు. అలాగే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్‌లకు ఎంత ఖర్చుచేశారో చెప్పలేనివిధంగా సర్కార్ ఉందన్నారు. -
కేసీఆర్ నిజస్వరూపాన్ని బయటపెడతాడనే...
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతున్నా ఎన్నికల నాటీ హమీలు ఒక్కటీ నెరవేర్చలేకపోయిందని ఉప్పల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన విమర్శించారు. ఆదివారం ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసీఆర్ నిజస్వరూపాన్ని జగ్గారెడ్డి బయటపెడతాడనే భయంతో ఆయనపై టీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సీపీఎం మద్దతు ఎలా అడుగుతారని ఆయన టీఆర్ఎస్ను ప్రశ్నించారు. మెదక్ ప్రజలను కేసీఆర్ ఎన్నో సార్లు అవమానించారని ఈ సందర్భంగా ప్రభాకర్ గుర్తు చేశారు. మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమని ప్రభాకర్ జోస్యం చెప్పారు. మూడు నెలల పాలనపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. -
చవకబారు ఆరోపణలొద్దు!
మత ప్రబోధకులు బ్రదర్ అనిల్ కుమార్‌కు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎయిర్‌షోలో బ్రదర్ అనిల్ పాల్గొన్న దృశ్యాన్ని చూపించి కుంభకోణంలో పాత్ర అంటూ ఆరోపణలు చేయడం సరికాదని సోమవారం క్లాస్ తీసుకున్నారు. మీడియాలో ప్రచారం కోసం చవకబారు ఆరోపణలకు దిగొద్దని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆ సందర్భంలో తన వాదనను సమర్ధిం చుకునేందుకు ప్రభాకర్ ఇబ్బంది పడినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. తన వద్ద ఉన్న కొన్ని కాగితాలను చూపించి ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గాలి కబుర్లను పోగేసి ఏవేవో వెబ్సైట్లలో ఉంచిన సమాచారాన్ని తానేదో శోధించి కనుగొన్నట్టు మీడియాకు చెప్పడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఫలితమేముండదని పేరు రాయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నేత ఒకరు ధ్వజమెత్తారు. ఏదైనా విమర్శ లేదా ఆరోపణ చేసే ముందు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మరో నాయకుడు సూచించారు. ప్రభాకర్ ఎవరి చేతిలోనో పావుగా మారి ఇటువంటి ఆరోపణలకు దిగారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. ‘ఇటువంటి వ్యక్తిని మా నాయకుడు ఎలా ప్రధాన కార్యదర్శిని చేశారో అర్థం కావడం లేద’ని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభాకర్ చెప్పిన విషయాల్ని ఖండిస్తే పార్టీ పరువు పోతుందని మిన్నకుండిపోయామే తప్ప లేదంటే గట్టిగానే బయటకు చెప్పేవారమని అన్నారు. -
బ్రదర్ అనిల్‌పై మరోసారి బీజేపీ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆగస్టా-వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో అనిల్‌కుమార్ పాత్ర ఉందంటూ ఆది వారమిక్కడ ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన త ర్వాతే కేంద్ర ప్రభుత్వం ఇటలీకి చెందిన ఆగస్టా కంపెనీతో 12 హెలికాఫ్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇటలీకి చెందిన హాస్కీ అనే దళారిని ఇటీవల స్విట్జర్లాండ్‌లో ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను బ్రదర్ అని ల్ను ఒకేచోట కూర్చోబెట్టి విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్‌తో సత్సంబంధాలు ఉన్నందునే హస్కీ ఎంఆర్ఎంజీఎఫ్లో డెరైక్టర్‌గా నియమితులయ్యారని ప్రభాకర్ ఆరోపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఒక హెలికాఫ్టర్ కోసం నాటి ప్రభుత్వ సీఎస్ రమాకాంత్‌రెడ్డి నాలుగు సార్లు ఇటలీ వెళ్లివచ్చారని, ఇదెక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. మరో ఉన్నతాధికారి బ్ర హ్మానందరెడ్డి కూ డా ఇటలీ వెళ్లారని, ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తే దీని వెనకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు. ఈ కుంభకోణంలో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్పటేల్ల పాత్ర ఉందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రక్షణ మంత్రి ఆంటోనీ ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.