మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆగస్టా-వెస్ట్‌లాండ్ హెలికాఫ్టర్ల కుంభకోణంలో అనిల్‌కుమార్ పాత్ర ఉందంటూ ఆది వారమిక్కడ ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన త ర్వాతే కేంద్ర ప్రభుత్వం ఇటలీకి చెందిన ఆగస్టా కంపెనీతో 12 హెలికాఫ్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఇటలీకి చెందిన హాస్కీ అనే దళారిని ఇటీవల స్విట్జర్లాండ్‌లో ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ను బ్రదర్ అని ల్‌ను ఒకేచోట కూర్చోబెట్టి విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. బ్రదర్ అనిల్‌తో సత్సంబంధాలు ఉన్నందునే హస్కీ ఎంఆర్‌ఎంజీఎఫ్‌లో డెరైక్టర్‌గా నియమితులయ్యారని ప్రభాకర్ ఆరోపించారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన ఒక హెలికాఫ్టర్ కోసం నాటి ప్రభుత్వ సీఎస్ రమాకాంత్‌రెడ్డి నాలుగు సార్లు ఇటలీ వెళ్లివచ్చారని, ఇదెక్కడైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. మరో ఉన్నతాధికారి బ్ర హ్మానందరెడ్డి కూ డా ఇటలీ వెళ్లారని, ఈ విషయాన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తే దీని వెనకున్న కాంగ్రెస్ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయని చెప్పారు. ఈ కుంభకోణంలో దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్‌ల పాత్ర ఉందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రక్షణ మంత్రి ఆంటోనీ ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.